Categories
National

లాక్ డౌన్ ఎఫెక్ట్: మహిళను చంపేసిన జవాను

కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి గ్రామాలకు వచ్చిన వలస జీవుల లిస్ట్‌లో తన పేరు రాసినందుకు ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆర్మీ జవాన్ ఓ మహిళను కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామానికి వచ్చిన వలస జీవుల జాబితాలో తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లు ఉండటంతో శైలేంద్ర అనే ఆర్మీ జవాను సహనం కోల్పోయాడు.

తన వివరాలు.. కుటుంబం వివరాలు నమోదు చేసినందుకు  వినయ్‌ యాదవ్‌ అనే వ్యక్తి కొలకత్తా నుంచి వచ్చినట్లుగా రాసి అధికారులకు అందజేశాడు. ఈ క్రమంలోనే జవాన్ శైలేంద్ర.. వినయ్ ఇంటిపైకి వెళ్లి గొడవ చేశాడు. దీంతో వినయ్‌కి సపోర్ట్‌గా ఓ మహిళ, వినయ్ సోదరుడు దినేష్ రాగా.. 36 ఏళ్ల మహిళ సంధ్యపై కాల్పులు జరిపాడు శైలేంధ్ర.

దీనిపై కుర్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, శైలేంద్రను అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అజయ్ కుమార్ పాండే తెలిపారు. గ్రామ పంచాయతీ సూచనల మేరకు, కరోనావైరస్ వ్యాప్తి తరువాత వివిధ ప్రదేశాల నుంచి తిరిగి వచ్చిన పేర్ల జాబితాను వినయ్ సిద్ధం చేశాడని, అయితే ఆగ్రహించిన శైలేంధ్ర దారుణానికి ఒడికట్టినట్లు చెప్పారు. 

Categories
Telangana

కామారెడ్డిలో కరోనా కలకలం, ఆర్మీ జవాన్‌కు కొవిడ్ వైరస్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కామారెడ్డిలో కరోనా కలకలం రేగింది. రామారెడ్డి మండలంలో ఆర్మీ జవాన్ లో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అధికారులు జవాన్ ని హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహిస్తున్నారు. జవాను మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్ నుంచి వచ్చాడు. రైలులో కామారెడ్డి వచ్చాడు. జవాన్ తో పాటు రైలులో ప్రయాణించిన 8మందికి కరోనా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసులు:
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా 13 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎస్‌, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా కట్టడికి కేసీఆర్ సర్కార్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడం, హైదరాబాద్ లో ఆంక్షలు మరింత కఠినతరం చేయడం, ఆర్టీసీ బస్సు సర్వీసులను పరిమితం చేయడం, హోటల్స్ మూసివేత వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో S-9 బోగిలో రామగుండం వచ్చిన ఇండోనేషియన్లు:
ఒక్కసారిగా 7 కరోనా కేసులు నమోదు కావడంతో కరీంనగర్‌ భయంతో వణికిపోతోంది. ఇండోనేసియా నుంచి వచ్చిన ఇస్లామిక్ మత ప్రచారకుల బృందం ఈ మహమ్మారిని కరీంనగర్‌కు తీసుకొచ్చింది. మార్చి 13న ఢిల్లీ నుంచి బయలుదేరిన 10మంది సభ్యుల బృందం 14న ఉదయం రామగుండం చేరుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ఎస్-9 బోగీలో వారంతా వచ్చారు. ఆ తర్వాత రోజు ఓ ప్రైవేట్ వాహనంలో ఇండోనేషియన్లు కరీంనగర్‌కు వచ్చారు. ఆ బృందంలోని ఏడుగురు వైరస్ బారిన పడ్డారు. దీంతో కరీంనగర్‌లో టెన్షన్‌ నెలకొంది. వైరస్ కేసులు బయటపడటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. కరీంనగర్‌లో ఆంక్షలు విధించింది. ఇండోనేషియా బృందం కలెక్టరేట్‌కు సమీపంలోనే బస చేసింది. దీంతో కలెక్టరేట్ కు 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. నగరంలో దుకాణాలు తెరుచుకోలేదు. పదో తరగతి పిల్లలు మాత్రమే రోడ్లపై కనిపిస్తున్నారు.

కరోనా సోకిన ఇండోనేషియన్లతో సన్నిహితంగా ఉన్న 8మంది గురించి ఆరా:
ఇండోనేషియా బృందం ఎవరెవరితో సన్నిహితంగా తిరిగారన్నది అధికారులు ఆరా తీస్తున్నారు. 8మంది వీరితో బాగా క్లోజ్‌గా ఉన్నట్లు గుర్తించారు. వారిని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఆ 8మంది ఎక్కడెక్కడ, ఎవరెవరితో తిరిగారన్న వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌కు వంద ప్రత్యేక వైద్య బృందాలను తరలించారు. వారు ఇంటింటికీ తిరిగి నిర్బంధ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 బెడ్లను సిద్ధం చేశారు. తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే.. దేశవ్యాప్తంగా 169 కరోనా కేసులు నమోదైతే తెలంగాణలోనే 13 రికార్డయ్యాయి.

See Also | ఆ విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు : ఆర్టీసీ బస్సుల్లో ఇళ్లకు చేరుస్తాం – ఆదిమూలపు సురేష్

Categories
Crime

మహిళపై నిన్న కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్ నేడు ఆత్మహత్య 

ప్రేమించిన యువతి కుటుంబంపై నాటు తుపాకీతో రెండు రోజుల క్రితం కాల్పులు జరిపిన ఆర్మీ మాజీ జవాన్ బాలాజీ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న బాలాజీ మృత దేహాన్ని బంధువులు గుర్తించారు. 

చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో యేమినేని బాలాజీ అనే వ్యక్తి ఆర్మీ జవాన్ గా పనిచేసేవాడు. ఒక పెళ్ళి వేడుకలో అదే గ్రామానికి చెందిన రమాదేవి అనే ఆమె కుమార్తెను చూసి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తన కోరిక తీర్చుకున్నాడు. మోజు తీరిన తర్వాత నువ్వు వద్దని ఆమెను దూరం పెట్టాడు. పెద్ద మనుషులు  ద్వారా పంచాయితీ చేసినప్పటికీ అతడు ఆమెను పెళ్ళి చేసుకోటానికి ససేమిరా అన్నాడు.

మోసపోయిన యువతి 2019 డిసెంబర్2వ తేదీన బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఈక్రమంలో కేసు నమోదు కావటంతో బాలాజీ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.  దీంతో రమాదేవి కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని తుద ముట్టించాలని గత 20 రోజుల్లో   3 సార్లు రాత్రిపూట రెక్కీ నిర్వహించాడు. 

పిబ్రవరి 22 వ తేదీ శనివారం తెల్లవారు ఝూమున తన మిత్రుడి సాయంతో నడింపల్లిలో నివాసం ఉంటున్న రమాదేవి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆసమయంలో ఎవరు వచ్చారా….  అనే సందేహంతో  అప్రమత్తమై తలుపు తీసిన రమాదేవి పై తనతో తెచ్చుకున్న నాటు తుపాకీతో 3 రౌండ్లు  కాల్పులు జరిపాడు. ప్రమాదాన్ని ముందే ఊహించిన రమాదేవి కాల్పులనుంచి త్రుటిలో తప్పించుకోవటంతో ఆమె చెవికి గాయం అయ్యింది.

ex army jawan 2

తుపాకి శబ్దం, రమాదేవి కేకలు విని స్ధానికులు బాలాజీని పట్టుకునే ప్రయత్నం చేశారు. స్ధానికులు అంతా  పట్టుకోటానికి ప్రయత్నం చేయటంతో తనతో పాటు తెచ్చిన బ్యాగు, నాటు తుపాకీని అక్కడే వదిలేసి, తాను వచ్చిన ఆటోలో  బాలాజీ పరారయ్యాడు. గాయపడ్డ రమాదేవిని స్దానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ex army jawan 1

విషయం తెలుసుకున్న పోలీసులు రమాదేవి నుంచి ఫిర్యాదు స్వీకరించి, ఘటనా స్ధలంలో బాలాజీ వదిలి వెళ్లిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న బాలాజీ కోసం గాలింపు చేపట్టారు. ఎలాగైనా సరే పోలీసులు తనను అరెస్టు చేస్తారనిభయపడిన బాలాజీ ఆదివారం ఉదయం రైలు కింద పడి ప్రాణాలు విడిచాడు. 

Categories
Crime

ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధిస్తూ..తల్లిపై జవాన్ కాల్పులు

గుంటూరు జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే  మహిళకు గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన రమాదేవిని చికిత్సనిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జవాన్ కోసం గాలిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే..చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో బాలాజీ అనే వ్యక్తి ఆర్మీ ఉద్యోగిగా పనిచేశాడు. జవాన్ గా విధులు నిర్వహిస్తున్నప్పటి నుంచి ఏమాత్రం బాధ్యత లేకుండా ఆకతాయిగా..పోకిరిగా వ్యవరించేవాడు. బాలాజీ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న రమాదేవి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. అతని వేధింపులు భరించలేక రమాదేవి తన కూతుర్ని తీసుకుని ఆరు నెలల క్రితం వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.అయినా బాలాజీ వేధింపులు ఆపలేదు.వాళ్లు ఎక్కడ ఉన్నారో గాలించి తెలుసుకుని వేధింపులు కొనసాగించాడు. 

అతని వేధింపులు భరించలేక రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమను తరచూ వేధిస్తున్నాడనీ..తమ కుమార్తెను రేప్ చేసాడనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు..బాలాజీపై కేసు నమోదు చేసుకుని  రిమాండ్‌కు తరలించారు. తరువాత కొంతకాలం జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు.దీంతో బాలాజీని అతని గన్ ను కూడా స్వాధీనం చేసుకు ఆర్మీ విధుల్లోనుంచి సస్పెండ్ చేశారు. 

ఈక్రమంలో తమ కుమార్తెను వేధించి వేధించి హింసపెట్టావు. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి కావటంలేదు. దీనికి కారణం నువ్వే కాబట్టి నువ్వే పెళ్లి చేసుకోవాలని సదరు రమాదేవి..ఆమె భర్త బాలాజీపై ఒత్తిడి తెచ్చారు. కానీ నా ఉద్యోగం పోవటానికి కారణం మీరే మీ అమ్మాయిని నేనెందుకు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశాడు బాలాజీ. ఇలా బాలాజీకీ రమాదేవి కుటుంబాలకు మధ్య వివాదం కొనసాగుతున్న క్రమంలో మా అమ్మాయిని పెళ్లి చేసుకోల్సిందేనని మరోసారి బాలాజీ ఇంటికి శుక్రవారం (ఫిబ్రవరి 21,2020)అర్ధరాత్రి వచ్చి డిమాండ్ చేయటంతో ఆగ్రహానికి గురైన బాలాజీ తన వద్ద ఉన్న ఓ నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల నుంచి రమాదేవి తృటిలో తప్పించుకోవటంతో గాయాలతో బైటపడింది. దీంతో రమాదేవిని స్థానిక హాస్పిటల్ కు  తరలించి చికిత్సందిస్తున్నారు.  
 

Categories
National

ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో : గుర్రం ఎక్కాడని దళిత ఆర్మీ జవాన్ పెళ్లి కొడుకుపై రాళ్ల దాడి

యుగాలు మారినా మనుషుల్లో ఇంకా మార్పు లేదు. ఇంకా కులం, మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల ఆగడాలు

యుగాలు మారినా మనుషుల్లో ఇంకా మార్పు లేదు. ఇంకా కులం, మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల ఆగడాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో(gujarat) దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెళ్లి వేడుక సందర్భంగా గుర్రం ఎక్కాడు. అతడు దళితుడు. దళిత వర్గానికి చెందిన యువకుడు గుర్రం ఎక్కడం, ఊరేగింపుగా వెళ్లడం.. అగ్రవర్ణాల వారికి తీవ్రమైన కోపం తెప్పించింది. అంతే.. ఆగ్రహంతో.. పెళ్లి కొడుకుపై రాళ్ల వర్షం(stone pelting) కురిపించారు. ఈ ఘటనలో పెళ్లి కొడుకుతో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత పోలీసుల సెక్యూరిటీ మధ్య వివాహం జరిగింది. 

దళితుడు గుర్రం ఎక్కకూడదు:
పెళ్లి కొడుకు పేరు ఆకాశ్ కుమార్ కొటియా(22)(Akash Kumar Koitiya). భారత ఆర్మీలో జవాన్ గా పని చేస్తున్నాడు. కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. వివాహం కోసం తన స్వగ్రామం బనస్ కంత(Banaskantha) జిల్లాలోని షరీఫ్ దా(Sharifda) వచ్చాడు. వివాహ వేడుకలో భాగంగా వరుడు గుర్రం ఎక్కాడు. గ్రామంలో గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి వెళ్లాడా. గుర్రం ఎక్కడమే అతడి పాలిట నేరమైంది. అగ్రవర్ణాల వారి ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఠాకూర్ కోలి వర్గానికి చెందిన వారు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు ఉన్నా వారు భయపడలేదు. రాళ్ల వర్షం కురిపించారు. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) ఉదయం 11 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. 

గుర్రం ఎక్కితే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్:
వివాహ వేడుకలో భాగంగా గ్రామంలో ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితి. అయితే దళితుడు కావడంతో గుర్రం ఎక్కడానికి వీల్లేదని ఠాకూర్ సామాజికవర్గానికి(Thakor Koli community) చెందిన వారు ఆదేశించారు. ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వరుడిని బెదిరించారు. దీంతో తనకు రక్షణ కావాలని వరుడు ఆకాశ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఏడుగురు సిబ్బందిని ఇచ్చారు. పోలీసులు ఉన్నా దాడిని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ దాడిపై స్పందించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన 11మందిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాఫ్తు చేస్తున్నామని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. 

ఆర్మీ జవాన్ కిచ్చే గౌరవం ఇదేనా?
దళితుడు అన్న ఒకే ఒక్క కారణంతో.. అగ్రవర్ణానికి చెందిన వారు ఇలా దాడి చేయడం చర్చకు దారితీసింది. వారి తీరుని అంతా తప్పు పడుతున్నారు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లో ఇంకా కుల వివక్ష ఏంటని మండిపడుతున్నారు. ఆకాశ్.. ఆర్మీ జవాన్ అనే విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న యువకుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. దళితుడు గుర్రం ఎక్కడం నేరమని ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పాలన్నారు.

కాగా, వివాహంలో భాగంగా దళిత వరుడు గుర్రం ఎక్కితే దాడి జరగడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. దేశవ్యాప్తంగా గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. 2018 ఏప్రిల్ లో రాజస్థాన్ బిల్ వారాలో గుర్రం ఎక్కాడాని వరుడిపై దాడి జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 2017లో హర్యానాలో, 2015లో మధ్యప్రదేశ్ లోని రత్లామ్ ఇలాంటి దాడులు జరిగాయి. 

Read More>>  సింగర్ సూసైడ్ – ఎవ్వరినీ వదలొద్దంటూ విన్నపం

Categories
Hyderabad National

ఆర్మీ జవాన్ ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే ఆర్మీ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లి గ్రామానికి చెందిన కిరణ్ అనే ఆర్మీ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

కిరణ్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కిరణ్ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేటి రాత్రికి కిరణ్ మృతదేహం స్వగృహానికి చేరే అవకాశం ఉంది.