Categories
National

చైనాకి చెక్… భారత్ కు పూర్తి అండగా అమెరికా

ఇండియా , చైనా సరిహద్దు వివాదం ముదురు పాకాన పడుతోంది . ఒక పక్క చర్చలు సాగుతుండగానే చైనా సరిహద్దుల్లోకి భారీగా సైనిక దళాలను తరలిస్తోంది . చైనా కు ధీటుగా భారత్ కూడా సైనిక దళాలను తరలించింది . పైగా భారత వైమానిక దళం యుద్ధ విమానాలు సరిహద్దు గగన తలం పై నిత్యం చక్కర్లు కొడుతున్నాయి . పెట్రోలింగ్ చేస్తున్నాయి . మరో వైపు అగ్ర రాజ్యం అమెరికా భారత్ కు అండగా రంగం లోకి దిగుతోంది . ఆసియాలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆగడాలకు చెక్ పెట్టక తప్పదని అమెరికా తేల్చి చెప్పింది .

జర్మనీ నుంచి పది వేల మంది సైనిక దళాలను అమెరికా వెనక్కు తీసుకు వస్తోంది . చైనా కమ్మూనిస్టు పార్టీ నుంచి ఇండియాకు ప్రమాదం పొంచి ఉందని … అందుకే ఐరోపా దేశాల నుంచి సైనిక దళాలను వెనక్కు తీసుకు వస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో ప్రకటించారు. సౌత్ చైనా సముద్రం సరిహద్దుగా గల అనేక దేశాలను చైనా ఇక్కట్ల పాలు చేస్తోందన్నారు. ఐరోపా నుంచి అమెరికా సైనిక దళాలను వెనక్కు రప్పించడం మన సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది 

 చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉందని కూడా పొంపియో చెప్పారు. ఇండియా , దక్షిణ ఆసియా దేశాలకు చైనా నుంచి ప్రమాదాలు పెరిగాయన్నారు . ఈ కారణంగానే ఐరోపాలో తమ దళాలను తగ్గిస్తున్నట్లు అయన గురువారం చెప్పారు . ఐరోపా నుంచి తన సైనిక దళాలను వెనక్కు రప్పించాలని , వాటిని ఆసియా లో మోహరించాలని అమెరికా రెండేళ్ల క్రితమే నిర్ణయించింది . కానీ , ఇప్పుడు ఇండియా సరిహద్దుల్లో చైనా ఆగడాలు మితిమీరడం తో వెంటనే దళాలను వెనక్కి రప్పిస్తోంది.

 ఐరోపా నుంచి వెనక్కు తీసుకొచ్చే దళాలను అమెరికా సౌత్ చైనా సముద్ర ప్రాంతంలో మోహరించే అవకాశాలున్నాయి. మన సరిహద్దులో చైనా దూకుడు మితిమీరితే , ఆ వైపు నుంచి చైనా ను కట్టడి చేయాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది . సౌత్ చైనా సముద్ర ప్రాంతం లో ఇప్పటికే చైనా తో విసిగిపోయిన దేశాలకు అమెరికా నిర్ణయం ఒక పెద్ద ఊరట కావచ్చు . చైనా సైన్యాన్ని ధిక్కరించే స్థాయి లేక ఈ దేశాలు ఇన్నాళ్లూ మిన్నకుండి పోయాయి . ఇప్పుడు అమెరికా నేరుగా రంగం లోకి దిగుతోంది . అటు జపాన్ , దక్షిణ కొరియా కూడా దీన్ని ఆహ్వానిస్తాయి . 

నాటో దేశాలతో ఒప్పందం లో భాగంగా 3,20,000 మంది అమెరికా సైనికులు ఐరోపా దేశాల్లో ఉన్నారు . మొత్తం నాటో దళాల్లో ఇది పది శాతం . ఒక్క జర్మనీ లోనే 34,500  మంది అమెరికా సైనికులున్నారు. ఇప్పుడు జర్మనీ నుంచి పది వేల మంది సైనికులను అమెరికా వెనక్కు రప్పిస్తోంది . ఇందుకు నాటో దేశాలు అభ్యంతరం చెప్పాయి. కానీ, ఆసియాలో ఏర్పడ్డ భద్రతా కారణాల రీత్యా దళాలను తగ్గించవలసి వస్తోందని అమెరికా నాటో దేశాలకు నచ్చచెబుతోంది. 

చాలాకాలంగా సౌత్ చైనా సముద్రంలో చైనా ఆగడాలు మితిమీరుతున్నాయని ఆ ప్రాంత దేశాలు ఆరోపిస్తున్నాయి . ముఖ్యంగా వియత్నాం , ఇండోనేషియా , మలేసియా , ఫిలిప్పీన్స్ ఈ విషయం పై అమెరికాకు ఫిర్యాదు చేశాయి. వియత్నాం ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు కూడా వేసింది. తీర్పు వియత్నాంకు అనుకూలంగానే వచ్చింది . కానీ, చైనా అడ్డం తిరిగింది. అంతర్జాతీయ న్యాయ స్థానం తీర్పును తోసిపుచ్చింది.

ఆనాటి నుంచి సౌత్ చైనా సముద్రంలో చైనా ఆక్రమణలు బాగా పెరిగాయి. ఒక పక్క ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతుంటే సౌత్ చైనా సముద్రం లో వియత్నాం, ఇండోనేషియా ఫిషింగ్ ట్రాలర్లను చైనా కోస్ట్ గార్డ్ దళాలు దాడి చేసి ముంచేశాయి. ఇప్పుడు ఇండియా సరిహద్దుల్లోకి చైనా దళాలు చొచ్చుకు రావడంతో ఆసియాలో పరిస్థితులు విషమించాయి. ఇదే ఇప్పుడు అమెరికాకు పెద్ద సవాలుగా మారింది. ఆసియాపై పట్టు సంపాదించిన చైనా రేపు మరో చోట తన ఆధిపత్యానికి సవాలుగా మారదన్న గ్యారంటీ లేదు. ఆ విషయం అమెరికాకు బాగా తెలుసు . అందుకే ఆసియాలోనే చైనాను నిలువరించాలన్నది అమెరికా వ్యూహం . అందుకు అన్ని వనరులూ సిద్ధం చేశామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో స్పష్టం చేశారు. ఐరోపా నుంచి అమెరికా తన సైనిక దళాలను వెనక్కు రప్పించడానికి ఇదే కారణం.

Categories
International Latest National

10మంది భారత జవాన్లను చైనా ఆర్మీ 3రోజుల పాటు తన కస్టడీలో ఎలా ఉంచింది, గాల్వన్ ఇన్ సైడ్ స్టోరీ

తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంతో జూన్ 15న రాత్రి చైనా-ఇండియా సైనికుల మధ్య హింసాత్మక

తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంతో జూన్ 15న రాత్రి చైనా-ఇండియా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకి చెందిన 43మందికిపైగా జవాన్లు మృతి చెందారు. కాగా, ఈ ఘర్షణలో చైనీస్ ఆర్మీ 10మంది భారత జవాన్లను కస్టడీలోకి తీసుకుంది. మూడు రోజుల పాటు తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆ తర్వాత భారత్ నుంచి వచ్చిన ఒత్తిడితో, సుదీర్ఘ చర్చల తర్వాత మన జవాన్లను చైనా ఆర్మీ విడుదల చేసింది. అసలు మన వాళ్లను చైనీస్ ఆర్మీ ఏ విధంగా కస్టడీలోకి తీసుకుంది? మూడు రోజుల పాటు వారిని ఎక్కడ ఉంచింది? ఏం చేసింది? ఎలా వ్యవహరించింది?

చైనా తన కస్టడీలోకి తీసుకున్న 10మంది భారత జవాన్లలో నలుగురు ఆఫీసర్లు కూడా ఉన్నారు. చైనీస్ ఆర్మీ వారిని వెంటనే విడుదల చేయలేదు. ఇండియా-చైనా అధికారుల మధ్య సుదీర్ఘమైన మంతనాల తర్వాత, భారత్ ఒత్తిడి తేవడంతో మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు చైనీస్ ఆర్మీ తమ కస్టడీలో ఉన్న 10మంది భారత జవాన్లను క్షేమంగా విడిచిపెట్టింది. 

సుదీర్ఘ చర్చల తర్వాత 10మంది భారత జవాన్లు విడుదల:
తమ కస్టడీలో భారత జవాన్లు ఉన్నారనేది నిజమే అని, వారంతా క్షేమంగా ఉన్నారని చెప్పిన చైనా వారిని విడుదల చేయడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తూ వచ్చింది. ప్రొసీజర్ పేరుతో చైనా మన వాళ్లను తన ఆధీనంలో ఉంచుకుంది. అయితే ఇదంతా చైనా మైండ్ గేమ్ అని ఆర్మీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జూన్ 16,17,18 తేదీల్లో ఇరు దేశాలకు చెందిన మేజర్ జనరల్స్ మధ్య చర్చలు జరిగాయి. చివరికి జూన్ 18న అంటే ఘర్షణ జరిగిన మూడు రోజుల తర్వాత భారత జవాన్లను చైనీస్ ఆర్మీ విడిచిపెట్టింది. అయితే భారత జవాన్లు చైనీస్ ఆర్మీ కస్టడీలో ఉన్నారనే విషయాన్ని భారత ఆర్మీ వర్గాలు అధికారికంగా ప్రకటించలేదు.

ఘర్షణకు కారణం ఇదే:
భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్‌ దగ్గర జరిగిన గొడవే కారణమని సమాచారం. వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 అనే చోట చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్‌ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. జూన్ నెల ప్రారంభంలోనే ఈ టెంట్‌ వేశారు.

పథకం ప్రకారమే చైనా దాడి:
గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్‌ కమాండర్‌ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. జూన్‌ 6న భారత్‌, చైనా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ర్యాంకు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో టెంట్‌ తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే పథకం ప్రకారం చైనా జవాన్లు దాడి చేశారు. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. పదునైన మేకులు చుట్టిన ఇనుప రాడ్లతో దాడికి దిగారు. 

సింహాల్లా పోరాడిన భారత జవాన్లు:
ఆరు గంటలపాటూ జరిగిన తోపులాటలోపక్కనే ఉన్న గాల్వన్‌ లోయలో కూడా కొందరు సైనికులు పడిపోయారు. ఎముకలు కొరికే చలి, హైపోథెర్మియాతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 గాల్వన్, ష్యోక్‌ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో తెలంగాణకు చెందిన క‌ల్న‌ల్ సంతోష్ బాబు స‌హా 20 మంది భార‌త సైనికులు అమరులయ్యారు. వాళ్లు 300మంది, మనోళ్లు 100.. ఒళ్లంతా గాయాలు, చుట్టూ శత్రుబలగాలు.. అయినా మన జవాన్లు సింహాల్లా గర్జించారు. చైనా జవాన్లపై తిరగబడ్డారు. భారత జవాన్ల నుంచి ఊహించని రీతిలో ప్రతిఘటన ఎదురుకావడంతో చైనా జవాన్లు బిత్తరపోయారు.

Read: ప్లీజ్..మోదీజీ..పాకిస్థాన్ అమ్మాయితో నా పెళ్లి చేయండి..భారత యువకుడి కోరిక

Categories
International Latest National

వీడియో, సిక్కింలో చొరబాటుకు యత్నించిన చైనా సైనికులను తరిమికొట్టిన భారత జవాన్లు

చైనా సైనికుల తీరు మారలేదు. మరోసారి మన భూభాగంలో చొరబాటుకు యత్నించారు. వారిని మన భారత

చైనా సైనికుల తీరు మారలేదు. మరోసారి మన భూభాగంలో చొరబాటుకు యత్నించారు. వారిని మన భారత జవాన్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. అంతేకాదు అడ్డంగా వాదనకు దిగిన చైనా సైనికులను తరిమికొట్టారు. తొలుత వెనక్కి వెళ్లాలని చైనా సైనికులకు మనవాళ్లు ఎంతో మర్యాదగా చెప్పారు. అయితే మనోళ్ల విజ్ఞప్తులను పట్టించుకోని చైనా సైనికులు మాటల యుద్ధానికి దిగారు. ఓ చైనా సైనికుడు మనోళ్ల పైపైకి దూసుకొచ్చాడు. దీంతో మన జవాన్లలో కోపం కట్టలు తెంచుకుంది. వారిని బలంగా వెనక్కి నెట్టేశారు. ఓ భారత జవాను చైనా సైనికుడిని ఉతికి ఆరేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ”గో బ్యాక్, డోంట్ ఫైట్” అని మనవాళ్లు పదే పదే అంటుండటం ఉంది. సైనికులు ఒకరినొకరు తోసుకోవడం ఈ వీడియోలో ఉంది. 

మనపైకి దూసుకొచ్చిన చైనా సైనికుడిని ఉతికేసిన భారత జవాను:
గల్వాన్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగకముందే సిక్కింలో ఇరుదేశాల సైనికులు గొడవ పడ్డారు. మన భూ భాగంలోకి చొరబడేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. వారిని మనోళ్లు నిలువరించారు. ‘వెనక్కు వెళ్లండి.. గొడవ వద్దు..’ అన్న మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి. మన జవాను చేతిలో దెబ్బలు తిన్న చైనా సైనికుడి గురించి భారత అధికారి అడుగుతున్నది కూడా రికార్డు అయింది. ఈ వీడియో ఎప్పుడు తీశారన్న కచ్చితమైన సమాచారం లేకున్నా.. గల్వాన్‌ ఘర్షణ తర్వాత, మిలిటరీ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణ వాతావారణాన్ని తగ్గించేందుకు ఇండియా-చైనా దేశాల మధ్య దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే చైనా సైనికులు మరోసారి చొరబాటుకు యత్నించడం ఉద్రిక్తతలను పెంచింది.

చైనా సైనికుల కవ్వింపులు:
గాల్వన్ ఘటన తర్వాత ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మే నెల మొదటి నుంచి సిక్కింలో పలుమార్లు చైనా సైనికులు చొరబాటుకు యత్నించారు. తాజాగా మరోసారి అదే పని చేయగా, మనోళ్లు ధీటుగా నిలువరించారు. నిబంధనలు పట్టించుకోకుండా చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే మన సైనికులు వారిని సమర్థవంతంగా నిలువరిస్తున్నారు. మన భూభాగంలో కాలు పెట్టకుండా చూస్తున్నారు. గాల్వన్ ఘటన తర్వాత సరిహద్దుల్లో చైనా సైనికులు కవ్వింపులకు పాల్పడుతున్నారు. మన భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. భారత జవాన్లు చైనా సైనికుల చర్యలను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ముందు మంచి మాటలు చెప్పి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. వినకపోతే నాలుగు తగిలించి బుద్ధి చెబుతున్నారు. గాల్వన్ ఘటన మర్చిపోకముందే సిక్కింలో చైనా సైనికుల దుశ్చర్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది.

గల్వాన్ లో చైనా దొంగ దాడి:
జూన్ 15న తూర్పు లద్దాఖ్ లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా-భారత్ సైనికుల మధ్య తీవ్రమైన హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా ఆర్మీకి కూడా భారీగానే ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం. 43మందికిపైగా చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. చైనా సైనికులు దొంగ దాడి చేశారు. ముందు మన భూభాగంలోకి చొరబడి టెంట్లు వేశారు. వాటిని తొలిగించేందుకు వెళ్లిన మన సైనికులపై పథకం ప్రకారం రాళ్లు, పదునైన ఆయుధాలు, మేకులు చుట్టిన రాడ్లతో దాడి చేశారు. కొంతమందిని నదిలోకి తోసేశారు. వాళ్లు 300 మంది, మనవాళ్లు 100 మంది. చుట్టూ శత్రు బలగాలు.. అయినా మన సైనికులు భయపడలేదు. సింహాల్లా గర్జించారు. వీరోచితంగా పోరాటం చేశారు. చైనా సైనికులను తీవ్రంగా ప్రతిఘటించి గట్టిగా బుద్ది చెప్పారు. పథకం ప్రకారం దాడి చేసి మనోళ్ల ప్రాణాలు తీసిన చైనాపై భారతీయులు కోపంతో రగిలిపోతున్నారు. డ్రాగన్ ని దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అంటున్నారు. సైనికుల త్యాగాన్ని వృథా కానివ్వం అని ప్రధాని మోడీ సైతం అన్నారు. మొత్తంగా ప్రతీసారి భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు, కవ్వింపులకు దిగుతూ మన సైనికులపై దాడులు చేస్తున్న దృశ్యాలు డ్రాగన్ కుట్రలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Read:  జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

Categories
International Latest National

చైనా ఆదేశాల ప్రకారమే భారత సైనికులపై క్రూర దాడి, అమెరికా ఇంటెలిజెన్స్

తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ ఉద్దేశపూర్వకంగానే జరిగింది? చైనా ప్రభుత్వం ఆదేశాల

తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ ప్రాంతంలో ఘర్షణ ఉద్దేశపూర్వకంగానే జరిగింది? చైనా ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే భారత సైనికులపై దాడి చేశారా? దీని వెనుక కుట్ర కోణం ఉందా? అమెరికాతో భారత్ స్నేహంగా ఉండటం చైనాకు నచ్చడం లేదా? అంటే అవుననే అంటున్నాయి అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు. జూన్ 15న గల్వాన్ లో చైనా-భారత్ సైనికుల మధ్య తీవ్రమైన హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా ఆర్మీకి కూడా భారీగానే ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం. 43మందికిపైగా చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. చైనా సైనికులు దొంగ దాడి చేశారు. ముందు మన భూభాగంలోకి చొరబడి టెంట్లు వేశారు. వాటిని తొలిగించేందుకు వెళ్లిన మన సైనికులపై పథకం ప్రకారం రాళ్లు, పదునైన ఆయుధాలు, మేకులు చుట్టిన రాడ్లతో దాడి చేశారు. కొంతమందిని నదిలోకి తోసేశారు. వాళ్లు 300 మంది, మనవాళ్లు 100 మంది. చుట్టూ శత్రు బలగాలు.. అయినా మన సైనికులు భయపడలేదు. సింహాల్లా గర్జించారు. వీరోచితంగా పోరాటం చేశారు. చైనా సైనికులను తీవ్రంగా ప్రతిఘటించారు.

చైనా బలం ఏంటో అమెరికా మిత్ర దేశాలకు చూపించాలని:
జనరల్ జో జోంగి. చైనా వెస్ట్రన్ థియేటర్ కమాండ్. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి పని చేస్తున్నాడు. ఈ ఆపరేషన్ కు అనుమతి ఇచ్చింది ఆయనే అని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. చైనా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జో ఇదంతా చేశాడట. జో హుకుం మేరకు చైనా సైనికుల మనోళ్లను రెచ్చగొట్టి క్రూరమైన దాడులకు తెగబడ్డారు. అమెరికా దాని మిత్రదేశాలు చైనాని బలహీన దేశంగా చూస్తున్నాయని, మన సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతో జనరల్ జో జోంగి ఈ దాడులకు ఆదేశాలు ఇచ్చారట. చైనాని బలహీనంగా భావిస్తున్న అమెరికా, దాని మిత్రదేశాలకు గట్టి హెచ్చరిక పంపాలనే ఉద్దేశ్యంతో ఈ దాడులకు ఆయన ఆర్డర్ ఇచ్చారని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.

భారత్ కు గుణపాఠం నేర్పాలని:
కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికాతో భారత్ సన్నిహితంగా ఉంటోంది. అయితే అమెరికాని శత్రువుగా చూస్తోంది చైనా. ఈ క్రమంలో శత్రువుతో చేతులు కలిపే దేశాలని, సన్నిహితంగా ఉంటున్న దేశాలను కూడా చైనా శత్రువులానే చూస్తోంది. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలని, భారత్ కు ఓ గుణపాఠం నేర్పాలని చైనా ఆర్మీ దాడులకు తెగబడినట్టు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ దాడుల ముఖ్య ఉద్దేశం చైనా బలం ఏంటో భారత్ కు తెలియజేయడమే. మా శత్రువులతో చేతులు కలిపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడమే. అమెరికాతో చేతులు కలిపిన ఇండియా, వారు చెప్పినట్టు వింటోంది అనేది చైనా ఆరోపణ. చైనాకు కాంట్రాక్టులు రద్దు చేయడం, వారి ఉత్పత్తులు బాయ్ కాట్ చేయడం, వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడం… ఇవన్నీ అమెరికా ఆదేశాల మేరకు భారత్ తీసుకుంటోంది అని చైనా విశ్వసిస్తోంది. ఈ క్రమంలో భారత్ పై కోపం పెంచుకున్న చైనా తమ సత్తా ఏంటో చూపించి భయపెట్టాలని భారత్ ఆర్మీపై దాడి చేయించిందని సమాచారం.

Read: సరిహద్దు వివాదం.. భారత్‌పై దూకుడు పెంచిన నేపాల్.. కొత్త పౌరసత్వ చట్టం 

Categories
National Slider

భారత జవాన్ల శరీరాలపై పదునైన ఆయుధంతో చేసిన గాయాలు, విరిగిన ఎముకలు.. బయటపడిన చైనా సైనికుల క్రూర దాడి

తూర్పు లద్దాఖ్ లోని భారత్-చైనా సరిహద్దు గల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా-భారత్ సైనికుల మధ్య

తూర్పు లద్దాఖ్ లోని భారత్-చైనా సరిహద్దు గల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15న చైనా-భారత్ సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో తెలంగాణ సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే చైనా సైనికుల దురాఘతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వారు ఎంత అమానుషంగా వ్యవహరించింది బయటపడుతోంది. చైనా సైనికులు దొంగదెబ్బ తీశారు. పదునైన ఆయుధాలతో మన సైనికులపై అతి క్రూరంగా దాడి చేశారు. అమరులైన భారత జవాన్ల శరీరాలపై పదునైన ఆయుధంతో దాడి చేసిన తీవ్ర గాయాలున్నాయి. వారి దేహంలో అనేక భాగాలు విరిగిపోయాయి. ఇవన్నీ చైనా సైనికుల క్రూర దాడిని బహిర్గతం చేస్తున్నాయి.

శరీరంపై తీవ్ర గాయాలు, అనే చోట్ల ఫ్రాక్చర్స్:
సముద్రానికి 14వేల అడుగుల ఎత్తన ఉన్న లద్దాఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతుంటాయి. మైనస్ డ్రిగీల ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ సరిగా అందకపోవడం, నీళ్లలో మునగడం వల్ల ఎక్కువమంది (12 మంది) సైనికులు చనిపోయారని సైనికాధికారులు తెలిపారు. చైనా సైనికులు మనవాళ్లను నీళ్లలోకి తోసేశారు, ఘర్షణ సమయంలో కొందరు నీళ్లలో పడిపోయారు, అమరులైన సైనికుల దేహాలు చూస్తే, వారు ఎంత గట్టిగా పోరాటం చేస్తారో అర్థమవుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. చైనా సైనికులను చాలామందిని మనవాళ్లు చంపినట్టు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ”మన వాళ్ల శరీరాలపై పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలు ఉన్నాయి. వారి దేహంలో అనేక చోట్ల ఫ్రాక్చర్స్ ఉన్నాయి” అని భారత సైనికుల మృతదేహాలను పరిశీలించిన లేహ్ సోనమ్ నుర్బో మెమోరియాల్ ఆసుపత్రి డాక్టర్ చెప్పారు.

మేకులు చుట్టిన ఇనుప రాడ్లు, కత్తులు, రాళ్లతో క్రూర దాడి:
కల్నల్ సంతోష్ బాబు శరీరంపై గాయాలు లేనప్పటికీ తల భాగంలో మాత్రం తీవ్రంగా కమిలిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. నీట మునగడం వల్ల సంతోష్ బాబుతోపాటు మరో ఇద్దరు సైనికులు చనిపోయారని భావిస్తున్నారు. అమరులైన సైనికుల మృతదేహాలకు లేహ్‌లోని ఎస్ఎన్ఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మరికొంతమంది సైనికుల శరీరం, ముఖంపై తీవ్రగాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికల్లో వెల్లడైంది. 17 మంది సైనికుల మృతదేహాలపైనా తీవ్ర గాయాలున్నాయని గుర్తించారు. మేకులతో కూడిన ఇనుప రాడ్లతో చైనా బలగాలు భారత సైనికులపై దాడి చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

పక్కా పథకం ప్రకారమే డ్రాగన్ ఘాతుకం:
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే చైనా బలగాలు గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి చేశాయనే విషయం పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది. మన సైనికులను రెచ్చగొట్టి ముందుగా తెచ్చుకున్న కత్తులు, ఇనుప రాడ్లు, ఫెన్సింగ్ చుట్టిన ఆయుధాలతో భారత సైనికులపై డ్రాగన్ దళాలు దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ముగ్గురు సైనికుల ముఖాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మరో ముగ్గురి మెడ భాగంలో కోసిన గుర్తులున్నాయి. దాడిలో చైనా దళాలు కత్తులు కూడా ఉపయోగించినట్లు అర్థమవుతోంది. 

నిలువెల్లా గాయాలైనా చైనా సైనికులపై సింహంలా గర్జించిన సంతోష్ బాబు:
భారత ప్రతిఘటన నేపథ్యంలో మన భూభాగానికి దగ్గరగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తొలగించిన చైనా.. ఉద్దేశపూర్వకంగానే మరోసారి ఆ చెక్ పోస్టును పెట్టడంతో వివాదం మొదలైంది. చైనా దళాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలోని భారత సైనికులు. అయితే, అప్పటికే దాడికి కుట్ర పన్నిన చైనా బలగాలు వెంటనే భారత సైన్యంపై రాళ్లు, ఇనుపరాడ్లు, కత్తులు లాంటి పదునైన ఆయుధాలతో దాడులు చేశాయి. వాళ్లు 350మంది, మనం 100మంది.. చుట్టూ శత్రుబలగాలు, రాళ్ల దెబ్బలు, ఒంటి నిండా గాయాలు.. అయినా మన వాళ్లు వెనక్కి తగ్గలేదు. చైనా సైనికులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ ఘర్షణలో భారత్ వైపున 20 మంది సైనికులు అమరులవగా.. చైనాకు చెందిన సుమారు 43 మంది సైనికుల హతమయ్యారని తెలుస్తోంది. తమ వైపు మరణాలపై చైనా ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయలేదు. ఓ వైపు చర్చలంటూనే దాడులు చేయడంపై డ్రాగన్ దేశంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా మన సైనికులను ముందుండి నడిపించిన కల్నల్ సంతోష్ బాబు లోని నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తున్నాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని వీడకుండా చైనా సైనికులపై సింహంలా గర్జించి ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి సెల్యూట్ చేయాలి.

Read: ఇండో-చైనా సైనికుల ఘర్షణ తర్వాత అద్భుతంగా మాట్లాడారు, ప్రధాని మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం

Categories
National Slider Telangana

రాళ్ల దెబ్బలు, నిలువెల్లా గాయాలు, చుట్టూ శత్రు బలగాలు.. అయినా వెనక్కి తగ్గలేదు.. కల్నల్ సంతోష్ బాబు శౌర్య పరాక్రమం

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో జరిగిన హింసాత్మక ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది సైనికులు వీర మరణం పొందారు. నాటి ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మీ వర్గాల ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్‌ సంతోష్‌బాబు, ఆయన నేతృత్వంలోని మన బలగాలు సాగించిన వీరోచిత పోరాటం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

తీవ్రంగా గాయపడినా వెనక్కి తగ్గని సంతోష్ బాబు:
అప్పటికే శరీరంపై తీవ్ర గాయాలు.. చుట్టూ పెద్ద సంఖ్యలో శత్రు బలగాలు.. తన దగ్గర చాలా తక్కువ మంది సైనికులు.. అయినా వెనక్కి తగ్గకుండా సింహంలా గర్జించాడు ఆ తెలుగు యోధుడు. వంద మందితోనే 350 మంది ఉన్న శత్రువుతో పోరు సాగించాడు. శత్రుమూక దురాఘతంపై చివరివరకు పోరాడుతూ భరతమాత రక్షణలో అమరుడయ్యాడు. మృత్యు ముఖంలోనూ ఆయన ప్రదర్శించిన అద్భుత నాయకత్వ పటిమ, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. ఆయనే కల్నల్‌ సంతోష్‌ బాబు. 

16-బిహార్‌ బెటాలియన్‌కు కమాండింగ్ ఆఫీసర్ గా సంతోష్ బాబు:
గల్వాన్ ప్రాంతంలో ఇండియన్‌ ఆర్మీ 16 బిహార్‌ బెటాలియన్‌కు సంతోష్‌ బాబు కమాండింగ్‌ ఆఫీసర్‌ (సీఓ)గా వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల రెండు దేశాలూ పోటాపోటీగా అక్కడికి బలగాలను తరలించాయి. అక్కడ వేడిని చల్లార్చేందుకు జూన్ 6న రెండు దేశాల లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. అందులో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు తమ సరిహద్దుల నుంచి అదనపు బలగాలను వెనక్కి తరలించాలి. ఇందులో భాగంగా గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 (పీపీ-14) నుంచి చైనా సైనిక ఉపసంహరణ జరగాలి. దీన్ని పర్యవేక్షించే బాధ్యతను భారత సైనిక నాయకత్వం.. కల్నల్‌ సంతోష్‌ నేతృత్వంలోని ‘16 బిహార్‌’ దళానికి అప్పగించింది.

ఖాళీ చేసినట్లే చేసి మళ్లీ వచ్చిన చైనా సైనికులు:
చైనా సైనికులు తొలుత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. తమ శిబిరాలనూ తొలగించారు. ఈ అంశంపై స్థానిక చైనా కమాండర్‌తో కల్నల్‌ సంతోష్‌ బాబు చర్చలు కూడా జరిపారు. అయితే అకస్మాత్తుగా జూన్ 14న చైనా సైన్యం అక్కడ ఒక సరిహద్దు పరిశీలన కేంద్రాన్ని, మరికొన్ని గుడారాలను ఏర్పాటుచేసింది. ఒప్పందం మేరకు దీన్ని తొలగించాలన్న సందేశంతో చిన్న గస్తీ బృందాన్ని ‘16 బిహార్‌’ దళం పంపింది. డ్రాగన్‌ దళాలు దీనికి ససేమిరా అన్నాయి. మన గస్తీ బృందం ఈ విషయాన్ని సంతోష్‌ బాబుకు తెలిపింది. భారత బృందం వచ్చి వెళ్లాక.. చైనా సైనికులు అక్కడికి భారీగా అదనపు బలగాలను రప్పించారు.

రంగంలోకి సంతోష్‌ బాబు:
చైనా శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు సంతోష్‌ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలోని బృందం జూన్ 15న చైనా శిబిరం దగ్గరికి వెళ్లింది. అక్కడ స్థానిక చైనా బలగాలు కాకుండా కొత్త ముఖాలు ఉన్నట్లు ఆయన గుర్తించారు. అదనపు బలగాలను చైనా పంపినట్లు ఆయన పసిగట్టారు. వారితో ఎంతో మర్యాదగా మాట్లాడారు. అబ్జర్వేషన్‌ పోస్ట్‌, ఇతర గుడారాలను ఏర్పాటు చేయడం అక్రమమని చైనా కమాండర్‌కు స్పష్టం చేశారు. అయితే చైనా సైనికుడొకరు సంతోష్ ను బలంగా వెనక్కి తోసేశాడు.

మన సైనికుల్లో ఆగ్రహం:
తమ ‘సీవో సాబ్‌’పై జులుం ప్రదర్శించడంతో భారత సైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా సైనికులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ పోరు అర గంటపాటు సాగింది. ఇరుపక్షాలకు చెందిన అనేక మంది గాయపడ్డారు. అంతిమంగా మన బలగాలదే పైచేయి అయింది. భారత సైనికులు.. చైనా గుడారాలను నేలకూల్చడమే కాకుండా, వాటిని కాల్చి బూడిద చేశారు. గత్యంతరం లేక డ్రాగన్‌ దళాలు వెనుదిరిగాయి.

వెనకడుగు వేయని తెలుగు వీరుడు:
ఈ పోరులో కర్నల్‌ సంతోష్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినా వెనక్కి వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. ఘటనా స్థలంలోనే ఉండిపోయారు. తన బలగాన్ని ముందుండి నడిపించారు. గాయపడిన భారత సైనికులను వెనక్కి పంపారు. అదనపు బలగాలను రప్పించారు. ఘర్షణ కారణంగా అక్కడ తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత చైనా సైనికులు పెద్ద సంఖ్యలో అదనపు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. పొడవైన మేకులు కలిగిన ఇనుప రాడ్లతో మన బలగాలపై దాడి చేశారు. భారత సైనికులు బాయ్‌నెట్‌లతో ఎదుర్కొన్నారు. తమ కన్నా చైనా సైనికులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కల్నల్‌ సంతోష్‌బాబు నాయకత్వంలో భారత బలగాలు భీకర పోరాటం చేశాయి.

మనవాళ్లపై రాళ్ల వర్షం:
అప్పటికే అక్కడ బాగా చీకటి పడింది. గల్వాన్‌ నది ఒడ్డున, పర్వతంపైన మాటు వేసిన చైనా బలగాలు అక్కడికి వచ్చాయి. వస్తూనే భారత సైనికులపై పెద్ద రాళ్లతో దాడి చేశాయి. సంతోష్‌ తలపై ఒక పెద్ద రాయి పడింది. దీంతో ఆయన గల్వాన్‌ నదిలోకి పడిపోయారు. తమ కమాండింగ్‌ అధికారి నేలకొరగడంతో భారత సైనికులు ఊగిపోయారు. చైనా సైనికులు 350 మంది. తాము వంద మంది. అయినా లెక్కచేయక వారిపై విరుచుకుపడ్డారు. ఇరు దేశాలకు చెందిన అనేక మంది చనిపోయారు. 

శత్రువు చుట్టుముట్టినా సింహంలా గర్జించాడు:
గల్వాన్‌ లోయలో దాదాపు 3 గంటల పాటు భీకర పోరాటం సాగింది. పోరు ఆగేసరికి భారత్‌, చైనాలకు చెందిన అనేక మంది సైనికుల మృతదేహాలు నదిలో ఉన్నాయి. సంతోష్‌ సహా పలువురు భారత జవాన్ల మృతదేహాలను మన సైన్యం వెనక్కి తీసుకొచ్చింది. మిగతా బృందం మాత్రం ఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షించింది. మరుసటి రోజు ఉదయానికి ఉద్రిక్తతలు కొద్దిగా తగ్గాయి. చైనా సైనికుల మృతదేహాలు ఇంకా అక్కడే పడి ఉన్నాయి. వీటిని మన సైనికులు పొరుగు దేశానికి అప్పగించారు. సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పీపీ14 దగ్గర చైనా శిబిరాన్ని సంతోష్‌ బృందం విజయవంతంగా తొలగించింది.  మన సైనికుల్ని ముందుండి నడిపించిన సంతోష్ లోని నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి సెల్యూట్ చేయాలి. 

Read: షెల్టర్ హోమ్‌లో 57మంది మైనర్ అమ్మాయిలకు కరోనా..

Categories
Latest National Political

చైనా సైనికులు 40 మందికిపైగా చనిపోయారు

లద్దాఖ్ లోని గాల్వన్‌లో జూన్ 15న చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే

లద్దాఖ్ లోని గాల్వన్‌లో జూన్ 15న చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ కూడా ఎదురు దాడికి దిగింది. ఈ హింసాత్మక ఘర్షణలో మన జవాన్లు 20మంది అమరులయ్యారు. అయితే.. చైనా తరఫున జరిగిన ప్రాణ నష్టమెంత అనేదానిపై ఇప్పటివరకు చైనా నోరు మెదపలేదు. అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అఫీషియల్ గా స్టేట్ మెంట్ రాలేదు. కాగా, తొలిసారిగా భారత ప్రభుత్వం ఆ లెక్కను తేల్చింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కు చెందిన 40 మందికి పైగా సైనికులను చైనా కోల్పోయిందని కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధికారి జనరల్‌ వీకే సింగ్‌ తెలిపారు. చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనే విషయంపై ప్రభుత్వం తరఫున స్పందించడం ఇదే తొలిసారి.

సైనికుల మరణాలను చైనా దాచి పెట్టింది:
1962 భారత్‌-చైనా యుద్ధంలో కూడా ఆ దేశం తమ సైనికుల మరణాలను దాచిపెట్టిందని వీకే సింగ్ విమర్శించారు. శనివారం(జూన్ 20,2020) ఆయన ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గాల్వన్ లోని సైనిక పోస్టు-14 భారత్‌ అధీనంలోనే ఉందన్నారు. నిర్బంధించిన కొందరు భారత సైనికులను చైనా విడుదల చేసిందనే వార్తలపై ఆయన స్పందించారు. ‘‘మన భూభాగంలోకి వచ్చిన చైనా సైనికులను మనవాళ్లు కూడా నిర్బంధించారు. ఆ తర్వాత వారిని విడుదల చేశాం’’ అని చెప్పారు.

జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే:
వాస్తవాధీన రేఖ దగ్గర ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణ నష్టం సంభవించడం గత 45ఏళ్లలో ఇదే తొలిసారి. భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్‌ దగ్గర జరిగిన గొడవే కారణమని సమాచారం. వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 అనే చోట చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్‌ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. జూన్ నెల ప్రారంభంలోనే ఈ టెంట్‌ వేశారు.

కల్నల్ సహా 20మంది వీర మరణం:
గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్‌ కమాండర్‌ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. జూన్‌ 6న భారత్‌, చైనా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ర్యాంకు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో టెంట్‌ తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు దొంగ దాడికి దిగారు. మనవాళ్లపై రాళ్లు విసరడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇనుప తీగలు చుట్టిన రాడ్లతో దాడి చేశారు. ఆరు గంటలపాటూ జరిగిన తోపులాటలో పక్కనే ఉన్న గాల్వన్‌ లోయలో కూడా కొందరు సైనికులు పడిపోయారు. ఎముకలు కొరికే చలి, హైపోథెర్మియాతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 

భారత జవాన్ల ఎదురుదాడితో బిత్తరపోయిన చైనా ఆర్మీ:
ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 గాల్వన్, ష్యోక్‌ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో క‌ల్న‌ల్ సంతోష్ బాబు స‌హా 20 మంది భార‌త సైనికులు అమరులయ్యారు. భారత సైనికుల నుంచి అనూహ్యంగా తీవ్రమైన ప్రతిఘటన ఎదురవడంతో చైనా సైనికులు కంగుతిన్నారు. భారత జవాన్ల పరాక్రమాన్ని కళ్లారా చూసి బిత్తరపోయారు. తప్పు చేయడమే కాకుండా తీవ్రంగా దెబ్బతింది చైనా ఆర్మీ. అందుకే, చైనా సైనికుల మరణాల గురించి ఆ దేశం స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి.

సైనికుల త్యాగం వృథా కానివ్వం:
చైనా కావాలనే తరచూ వాస్తవాధీన రేఖను దాటుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రస్తుత పరిస్థితిపై తాము పూర్తి అంచనాతో ఉన్నామని, ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని రక్షణశాఖ తెలిపింది. సైనికుల ప్రాణ త్యాగాన్ని వృథా కానివ్వమని ప్రధాని మోడీ ఇప్పటికే దేశానికి హామీ ఇచ్చారు. గాల్వన్ లోయలో ఎలాంటి చర్యలకైనా భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని భారత వాయు సేన(ఐఏఎఫ్‌) ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా చెప్పారు. గాల్వన్ ఘటన ఫలితం త్వరలోనే చూస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు:
శత్రు దేశ ట్యాంకర్లను ఛిద్రం చేయగల.. ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్‌ అపాచీ, సరికొత్త రాడార్‌ సాంకేతికతతో కూడిన.. మిగ్‌-29 ఫైటర్‌ జెట్‌లు, సత్వరమే ఆయుధాలను చేరవేసే చినూక్‌ హెలికాప్టర్లు.. ఇలా వాయుసేన అమ్ములపొదిలోని ఒక్కో అస్ర్తాన్ని వాస్తవాధీన రేఖ దగ్గర భారత్‌ మోహరిస్తోంది. చైనాతో గాల్వన్ లోయ దగ్గర తీవ్ర ఘర్షణ.. జవాన్ల వీర మరణం నేపథ్యంలో ఇప్పటికే సైన్యం అప్రమత్తం కాగా, వాయు సేన దానికి తోడవుతోంది. అటు పొరుగు దేశం సైతం దీనికి తగ్గట్లే బలగాలు, యుద్ధ విమానాలను మోహరిస్తోంది. దీంతో ప్రస్తుతం బోర్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొంది.

Read: ఫాదర్స్ డే-2020: గూగుల్ డూడుల్.. మీ నాన్నకు ఇలా గ్రీటింగ్ కార్డ్ పంపండి

Categories
Latest National

GalwanValleyClash : రాహుల్ జీ..రాజకీయాలు వద్దు జవాన్ తండ్రి సూచన

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ జవాన్ తండ్రి ఇచ్చిన వీడియో సందేశం వైరల్ అవుతోంది. గల్వాన్ ఘర్షణలపై రాజకీయాలు చేయొద్దని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ లీడర్స్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ దీనికి ఏం సమాధానం చెబుతారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ జవాన్ తండ్రి ఎందుకు రెస్పాండ్ అయ్యారు ? దీనికి కారణం ఏంటీ అని అనుకుంటున్నారా ? దీనికి రీజన్ ఉంది.

ఇటీవలే చైనా – భారత్ సరిహద్దులో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. చైనా సైనికులు చేసిన ఈ దారుణ ఘటనపై సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. భారతీయ సైనికులను నిరాయుధులుగా పంపడం వల్లే చైనా సైనికుల చేతిలో 20 మంది సైనికులు వీరమరణం పొందారని..రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాకు చెందిన జవాన్ సురేంద్ర సింగ్ తండ్రి ఈ విషయం చెప్పారని రాహుల్..కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సురేంద్ర సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈయన కొడుకు..చైనా సైనికులు జరిపిన దాడిలో గాయపడ్డారని సమాచారం. 

భారత సైన్యం బలంగానే ఉందని, చైనాను ఓడించే సత్తా…ఉందని బల్వంత్ సింగ్ అన్నారు. తన కొడుకు సైన్యంలో ఒకడిగా చైనా బలగాలతో పోరాటం చేశాడనే విషయాన్నిగుర్తు చేశారు. ఇక ముందు కూడా పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై కాంగ్రెస్ ఎలాంటి సమాధానం చెబుతుందో వేచి చూడాలి. 

 

Read:  రూ. 50 వేల కోట్లతో కొత్త పథకం ప్రారంభించిన మోడీ

Categories
International Latest National

కాలుకి రింగ్, దానిపై కోడ్.. బోర్డర్ లో పావురం కలకలం, ఇది పాకిస్తాన్ కుట్రేనా

భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ పావురం కలకలం రేపింది. పలు అనుమానాలకు తావిచ్చింది.

భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ పావురం కలకలం రేపింది. పలు అనుమానాలకు తావిచ్చింది. భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ కుట్ర కోణాలను బయటపెట్టింది. గూఢచర్యం సందేహాలను తెరపైకి తెచ్చింది. గూఢచర్యం కోసం పాకిస్తాన్‌ కపోతాల సాయం తీసుకుంటోందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. కరోనా ప్రబలుతున్న వేళ భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఏమైనా ఎత్తులు వేస్తుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

కపోతం కాలికి రింగ్, దానిపై కోడ్:
జమ్మూ-కశ్మీర్‌లోని కథువా జిల్లాలో స్థానికులు ఓ పావురాన్ని పట్టుకున్నారు. ఈ కపోతం.. పాక్ బోర్డర్ నుంచి ఎగురుతూ వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దును దాటి, హీరానగర్‌ సెక్టార్‌లోని మాన్యారి గ్రామాన్ని చేరింది. పావురం తీరును అనుమానించిన స్థానికులు వెంటనే దాన్ని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. తెల్లని పావురానికి కాళ్ళ భాగంలో గులాబీ రంగు పూసి ఉంది. చూడటానికి సాధారణంగా ఉన్నా, దాని కాలికి ఒక రింగ్ ఉంది. దానిపై కోడింగ్ తో కూడిన నెంబర్లు ఉన్నాయి. దీంతో అది పాకిస్థాన్ గూఢచార కపోతంగా కథువా జిల్లా ఎస్పీ శైలేంద్ర మిశ్రా నిర్ధారించారు. దాన్ని వెంటనే ఆర్మీ అధికారులకు అప్పగించారు. రింగ్ పై ఉన్న నెంబర్లు సంకేత సందేశమై ఉండొచ్చని, ఈ రహస్యాన్ని ఛేదించేందుకు భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయన్నారు. గూఢచర్యం కోసం పాకిస్థాన్‌ ఈ కపోతాన్ని వాడినట్లు సందేహాలు వ్యక్తం చేశారు.

కోడ్ ను డీకోడ్ చేసే పనిలో ఆర్మీ:
దీనిపై ఆర్మీ అధికారులు లోతైన దర్యాఫ్తు స్టార్ట్ చేశారు. పావురంపై ఉన్న కోడ్‌ను డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచమంతా కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో నిమగ్నమై ఉంటే.. దాయాది దేశం మాత్రం తన వక్రబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూకశ్మీర్‌లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

కరోనా వేళ భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర:
కరోనా వైరస్ పంజా విసురుతున్న సమయాన్ని అదనుగా చూసి కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి పాక్ వైపు నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో సరిహద్దుల వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్‌ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేగాక భారత్‌లో అంతర్భాగమైన పీఓకేలోని గిల్గిట్‌ బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పాక్ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

పాక్ ప్రయత్నాలను ఎండగట్టడానికి భారత్ సిద్ధమైంది. గిల్గిట్ బాల్టిస్థాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు పాక్ సుప్రీం కోర్టుకు లేదని పాక్ రాయబారికి భారత విదేశాంగ శాఖ అందించిన దౌత్యపరమైన లేఖలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాద సంస్థలు మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.

కశ్మీర్ లో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రయత్నాలు:
కొన్ని ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. కశ్మీర్‌లో కల్లోలం చేయడానికి వచ్చిన హిజ్బుల్ ముజాహిదీన్‌ గ్రూప్ కి చెందిన కొంత మంది టాప్ కమాండర్లను ఇటీవల భారత భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన విషయం తెలిసిందే. భారత్ కరోనా సంక్షోభం నుంచి బయటపడే సమయానికి కశ్మీర్‌లోకి చొచ్చుకుపోవాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులో గూఢచర్యం చేసేందుకు ఓ పావురానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి భారత భూభాగంలోకి పంపించినట్లు అధికారులు భావిస్తున్నారు. కశ్మీర్‌‌లో ఆ పావురం ఎవరిని కలిసింది? అది తెచ్చిన సమాచారం ఏంటి? దానికి బదులుగా పంపిన కోడ్ ఏంటి? తదితర అంశాలను ఆర్మీకి చెందిన నిపుణులు విశ్లేషించే పనిలో ఉన్నారు.

Read:ఆకలికి ఆగలేక.. రైల్వే స్టేషన్‌లో ఫుడ్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లిన వలస కార్మికులు

Categories
National

సాధారణ పౌరులకు సైన్యంలో చేరే అవకాశం

దేశానికి సేవ చేయడానికి సాధారణ పౌరులకు మూడు సంవత్సరాల “టూర్ ఆఫ్ డ్యూటీ”ని అనుమతించే ప్రతిపాదన చేస్తుంది భారత ఆర్మీ. దేశానికి సేవ చేయాలనుకునే సామాన్య ప్రజలు కూడా ఇక నుంచి జవాన్‌గా మారవచ్చు.

ఇప్పటివరకు ఆర్మీలో చేరాలంటే టెస్టులు పాస్ అవ్వాలి. అయితే ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ కింద మూడేళ్లు వివిధ ర్యాంకుల్లో పనిచేసేందుకు సామాన్య ప్రజలకు అవకాశం కల్పించాలని ఆర్మీ యోచిస్తోంది. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంతో పాటు దేశసేవ చేయాలనే తపన యువతలో కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఆర్మీ సన్నాహాలు చేస్తోంది.

షార్ట్ సర్వీస్ కమిషన్ యువతకు మరింత ఆకర్షణీయంగా ఉండటానికి, ఫోర్స్ ఉన్నతాధికారులు ఈ సమీక్షను నిర్వహిస్తున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఎటువంటి కారణాల వల్ల కానీ, సైన్యంలో చేరలేని యువతకు సైన్యం నుంచి అవకాశం లభిస్తుంది.