Categories
National

ఉగ్రవాదం నాశనం చేస్తామంటే మా ఆర్మీని పంపిస్తాం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి కశ్మీర్ విషయంలో చిచ్చు రగులుతూనే ఉంది. పాక్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచేందుకు సిద్ధంగా ఉంటే తాము భారత ఆర్మీని  పంపేందుకు రెడీ అని సవాల్ విసిరారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతున్న ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను రాజకీయ ప్రచారంలో బీజేపీ వాడేసుకుంటుంది. ఈ కోణంలో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ ఇలా..

‘పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కి ఓ సలహా ఇద్దామనుకుంటున్నాను. మీరు సీరియస్ గా పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని అనుకుంటే మేం సహాయం అందిస్తాం. మా ఆర్మీని పంపిస్తాం’ అని బహిరంగ సభలో ప్రసంగించారు. కశ్మీర్ విషయం మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 

‘ఇమ్రాన్ ఖాన్ మాటలు వింటూనే ఉన్నా. కశ్మీర్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకూ పోరాటం ఆపేది లేదని అంటున్నారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫోరం వరకూ తీసుకెళతారట. కశ్మీర్ గురించి మరిచిపోండి. ఎంతమంది ముందు చెప్పినా జరిగేదేం లేదు. మాపై ఎలాంటి బలాలు పనిచేయవు’ కశ్మీర్ అంశంలో తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.