Categories
National

ఢిల్లీలో అల్లర్లు :మానవహారంగా నిలబడి విద్యార్ధుల్ని స్కూల్స్‌కు ఎలా పంపుతున్నారో చూడండీ

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీ అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ అల్లర్లతో విద్యార్ధులు స్కూల్ కు వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఏం జరగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో స్కూల్ కు సెలవులు కూడా ఇచ్చారు. పరీక్షల సమయం కావడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు ఢిల్లీలోని యమునా విహార్‌లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. 

దీంతో విద్యార్ధులు సురక్షితంగా స్కూల్స్ కు వెళ్లటానికి ఢిల్లీలోని యమునా విహార్ వాసులు మానవ హారంగా నిలబడ్డారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యంగా తమని తాము రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అల్లర్లు చేయడానికి వస్తున్న ఆకతాయి గుంపులను తరిమికొడుతున్నారు. విద్యార్ధులకు ప్రొటక్షన్ గా నిలబడి విద్యార్ధులకు స్కూళ్లకు పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు.

యమునా విహార్ వద్ద మంచితనం మానవహారం రూపంలో నిలబడింది. ఆ మంచితనం విద్యార్ధులకు సురక్షితంగా స్కూళ్లకు పంపిస్తోంది.  ఆచుట్టు పక్కల పరిసరాల్లో ఎక్కడా పోలీసులు కనిపించటంలేదు..మంచితనమే మానవహారంగా నిలబడింది..ఆ మంచితనానికి వందనం.. అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. కాగా..సీఏఏకు నిరసనగా కొన్ని రోజులుగా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తో సహా ఏడుగురు మృతి చెందారు. 

See Also>>వీడియో : మొండి ధైర్యం.. మోకాలు విరిగినా మ్యాచ్ ఆడిన మహిళా కెప్టెన్