Categories
Telangana

పోలీస్‌ స్టేషన్లలో థర్మల్‌ స్క్రీనింగ్‌

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కూడా కరోనా బారిన పడటంతో పోలీస్‌ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు థర్మల్‌ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. హోంగార్డు నుంచి సీపీ వరకు అందరూ పరీక్షించుకోవాల్సిందే. జ్వరం 100 దాటితే స్టేషన్‌లోనికి అనుమతిలేదు. అలాగే స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న పోలీస్‌ డిపార్టుమెంట్‌లో ఇప్పుడు కరోనా కలవరం రేపుతోంది. ఎవరు తుమ్మినా, దగ్గినా, జ్వరం అని చెప్పినా ఉలిక్కిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుశాఖలో ఇప్పుడు హెల్త్‌ డీఎస్‌ఆర్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఉదయం, సాయం త్రం కచ్చితంగా పోలీసులు.. తమ ఆరోగ్య స్థితిగతులను నమోదు చేసుకోవాలి. ఇందుకు ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ను  ఏర్పాటు చేశారు. ఉదయం విధులకు వచ్చినప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు కచ్చితంగా చెక్‌ చేసుకొని.. ఆ వివరాలను హెల్త్‌ డీఎస్‌ఆర్‌ యాప్‌లో పొందుపర్చాలి. 

అంతేకాకుండా వారికి జ్వరం అనిపించినా, గొంతు నొప్పి, దగ్గు,  జలుబు ఉన్నా..  ఆ వివరాలను యాప్‌లో రాయాలి. వీటిని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలోని ఎస్బీ(స్పెషల్‌ బ్రాంచి) విభాగం పరిశీలిస్తుంది. థర్మల్‌ స్క్రీనింగ్‌ మీటర్‌లో టెంపరేచర్‌ 100 దాటితే హాస్పిటల్ కు వెళ్లాలని సూచిస్తున్నారు. హోంగార్డు నుంచి సీపీ వరకు… పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అన్ని పోలీస్‌ స్టేషన్‌లు, ఇతర సిబ్బందికి చెక్‌ చేస్తున్నారు. సిబ్బందికే కాకుండా స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ కూడా థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా పరీక్షిస్తున్నారు. 99, 100 టెంపరేచర్‌ వస్తే … వారిని స్టేషన్‌లోకి అనుమతించకుండా.. దవాఖానకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఎవరూ కరోనా బారిన పడకుండా  రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సిబ్బంది ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతిరోజు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. రెండు రోజులకు ఒక్కసారి స్టేషన్‌ను శానిటైజ్‌ చేస్తున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌తో  పాటు ప్రధాన పోలీస్‌ కార్యాలయాల్లో చేతులను కడుక్కునేందుకు కూడా ప్రత్యేక వాష్‌ బేసిన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మొదట చేతులు కడుక్కొని, థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజ్‌ చేసుకోవడంతో పాటు కచ్చితంగా మాస్కును ధరించాలని పోలీసులు కోరుతున్నారు. 

Categories
Telangana

మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ 

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం (ఏప్రిల్ 20, 2020) మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 11 కరోనా కేసులు ఉన్నప్పటికీ తర్వాత వ్యాప్తి చెందకుండా నియంత్రించ కలిగామని చెప్పారు. కరోనా నివారణకు జిల్లా కలెక్టర్ తోపాటు పోలీస్, మున్సిపల్ సిబ్బంది కలిసి కట్టుగా పని చేస్తున్నట్లు తెలిపారు. 

మహబూబ్ నగర్ కు కరోనా టెస్టింగ్ బూత్ మంజూరు చేయాలని కోరిన వెంటనే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. 12 గంటల్లో మంజూరు చేశారని తెలిపారు. అందుకుగానూ కేటీఆర్ కు మంత్రి అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ శాంపిల్స్ టెస్టింగ్ కేంద్రం వల్ల శాంపిల్స్ సేకరణ తీసుకునే ల్యాబ్ టెక్నీషియన్, శాంపిల్స్ ఇచ్చే వారికి కూడా ఎలాంటి భయం లేకుండా ఉంటుందని చెప్పారు. జిల్లా ప్రజలు లాకౌడౌన్ నిబంధనలు పాటించాలన్నారు. సామాజిక దూరం పాటించి ఎవరికి వారు స్వీయ నియంత్రణలో ఉండాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డా.సునందిని, మున్సిపల్ కమిషనర్ సురేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.జీవన్, ఆర్ఎంవో వంశీకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ వో సౌభాగ్యలక్ష్మీ, డా.శశికాంత్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Also Read | చేతిలో మహాభారతం బుక్ తో… మధ్యప్రదేశ్ గుహలో ముంబై ఇంజినీర్

Categories
National

అంధుల కోసం : రైల్వే స్టేషన్‌లో బ్రెయిలీ లిపిలో సైన్ బోర్డులు

ఛండీగఢ్ రైల్వే స్టేషన్‌లో అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ఇండికేటర్లు ఏర్పాటు చేసింది. అంధులు కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రెయిలీ ఇండికేటర్ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశంలో మొదటిది.  అంధులు రైల్వే స్టేషన్‌కు వచ్చినప్పుడు వారు ఎవరిపైనా ఆధారఖపడకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఈ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 

రైల్వే స్టేషన్ లోని అన్ని ప్లాట్‌ఫారాలలో బ్రెయిలీ లిపిలో బోర్డులను అధికారులు ఏర్పాటు చేసిన అంబాలా మండలి డీఆర్ఎం గురిందర్ మోహన్ సింగ్ ప్రారంభించారు. 
స్టేషన్‌లో ఎంట్రీలోను..ప్లాట్‌ఫారం, డ్రింకింగ్ వాటర్ ఉండే ప్లేసులు, లిఫ్టు, ఎక్స్‌లేటర్, మెట్లు వంటి అన్ని చోట్ల బ్రెయిలీ లిపిలో సైన్ బోర్డుల్ని అందుబాటులో ఉంచారు. 

దేశంలో అంధుల కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రెయిలీ లిపి బోర్డుల్ని  ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని బెంగళూరు, కోయంబత్తూరు, బోరీవలీ, మైసూరు రైల్వే స్టేషన్లలో బ్రెయిలీ లిపి బోర్డులు ఉండగా చండీగఢ్ లో తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు.