Categories
Telangana

ఒకే చితిపై భార్యాభర్తలకు అంత్యక్రియలు…మరణంలోనూ వీడని బంధం

కలకాలం తోడుంటానని పెళ్లి మండపంలో ఏడడుగుల సాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు మరణంలోనూ భార్యాభర్తల బంధాన్ని వీడలేదు. ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు జరిపారు. కృష్ణ జిల్లా జగ్గయ్యపేట పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. 

ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందగా వీరందరికీ గురువారం దహన సంస్కారాలు నిర్వహించారు. వీరిలో భార్యా, భర్తలిద్దరినీ ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో మరణంలోనూ వారి బంధం విడిపోలేదని, చావులోనూ ఒక్కటయ్యారంటూ చూసినవారు కన్నీటి పర్యంతమయ్యారు. 

మృతుల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి బంధువుల రోధనలతో ఊరంతా తల్లడిల్లిపోయింది. 

Read: కరోనా దెబ్బ : తెలంగాణలో డిగ్రీ పరీక్షలు రద్దు ?

Categories
Andhrapradesh Latest

క‌రోనా వేళ ఏపీ అసెంబ్లీ..ఏర్పాట్లు ఎలా చేశారో తెలుసా

క‌రోనా వేళ ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు 2020, జూన్ 16వ తేదీ మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే..స‌భ‌లో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తుండ‌డంతో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఉన్న నిబంధ‌న‌లు తు.చ త‌ప్ప‌కుండా పాటించే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నారు. శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లిలో అడుగ‌డుగునా..శానిటైజేష‌న్ చేశారు. అసెంబ్లీ, మండ‌లిలో ఉండే ప్ర‌తి సీటును శానిటైజేష‌న్ చేశారు.

ప్ర‌త్యేక ప‌రిస్థితుల దృష్ట్యా..శాస‌న‌స‌భా ప్రాంగ‌ణం, లాబీల్లో ర‌ద్దీని త‌గ్గించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. స‌భ్యులంద‌రికీ వైద్య ప‌రీక్ష‌లు చేయ‌డంతో పాటు..ఇత‌రుల‌ను ఎవ‌రినీ అనుమ‌తించ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. భౌతిక దూరం పాటిస్తూ..స‌మావేశాల నిర్వాహ‌ణ  జ‌రుగ‌నుంది. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా…2020, జూన్ 15వ తేదీ సోమ‌వారం స్పీక‌ర్ అధ్య‌క్ష‌త‌న అసెంబ్లీ ప్రాంగ‌ణంలో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జ‌రిగింది. 

ఉభ‌య‌స‌భ‌ల నిర్వాహ‌ణ‌, భ‌ద్ర‌త, స‌భ్య‌లు ఆరోగ్యం త‌దిత‌ర ప‌రిస్థితుల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు భారీ బందోబ‌స్తు నిర్వ‌హించ‌నున్నారు. 

గుంటూరు రూరల్‌ ఎస్పీ, గుంటూరు అర్బన్ పర్యవేక్షణలో 17 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 

గుంటూరుతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిగోదావరి జిల్లాల నుంచి మొత్తం 3,080 మంది పోలీసులు, 105 మంది మార్షల్సు భ‌ద్ర‌త‌ను చేప‌ట్ట‌నున్నారు. అసెంబ్లీ ఆవరణలోను, అసెంబ్లీకి వెళ్లే మార్గంలోను పటిష్ట బందోబస్తు. 
చెక్‌పోస్టుల‌లో అనుమతి ఉన్న వాహనాలకే దారి. 
అసెంబ్లీ ప్రాంతంలోను, సమీప ప్రాంతాల్లో సెక్షన్‌ 144 అమలు. 
అన్ని ఛానెళ్ల‌కు అసెంబ్లీ లైవ్ ఫీడ్ ఇవ్వ‌నున్నారు. 
పత్రికా విలేకరుల గ్యాలరీలోకి 20 మందిని మాత్రమే అనుమతి. 

మీడియా పాయింట్‌ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిషేదం. 
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకులు, గన్‌మెన్లకు బయట ప్రత్యేక ఏర్పాట్లు. 
మంత్రులు, క్యాబినెట్‌ హోదా ఉన్న వారికి ఇద్ద రు సహాయక సిబ్బందిని అనుమతి. 
బడ్జెట్, పద్దుల వివరాలను పంపిణీ చేసే ఆర్థిక శాఖ సిబ్బంది కూడా త్వరగా పని ముగించుకుని వెళ్లి పోయే విధంగా ఏర్పాట్లు 
స‌మావేశాలు రెండు రోజులు మాత్ర‌మే.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు.

Categories
Andhrapradesh Latest

తిరుమలకు వెళ్తున్నారా? మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. భక్తులకు దైవ

లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. భక్తులకు దైవ దర్శనం కల్పించనున్నారు. తిరుమలలోనూ శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. గతంలోకంటే భిన్నంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తనిఖీలు, టికెట్ల జారీ విషయంలో పలు మార్పులు చేశారు. ఇప్పటిదాకా భక్తులను అలిపిరి టోల్ గేట్ దగ్గర భద్రతా సిబ్బంది భౌతికంగా తనిఖీ చేసేవారు. ఇకపై అలా జరగదు. భక్తులే స్వయంగా తమ జేబులు పూర్తిగా బయటకు తీసి చూపించాలి. ఇక మహిళలు తమ హ్యాండ్ బ్యాగులను తెరిచి చూపించాలి. టీటీడీ సిబ్బంది హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ తో పరిశీలిస్తారు.

* భక్తుల లగేజీ సహా వాహనాలను అలిపిరి దగ్గరే శానిటైజ్ చేస్తారు. 
* దర్శనం టికెట్లు ఉన్నవారినే కొండపైకి అనుమతిస్తారు.
* అందరినీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. రోజుకు 200 నుంచి 300 మంది నుంచి ర్యాండమ్ గా స్వాబ్ నమూనాలు సేకరిస్తారు.
* అలిపిరి దగ్గర 12 వరుసల్లో ప్రవేశ మార్గాలుండగా.. శానిటైజేషన్ కు వీలుగా ఒక రోజు ఆరు, మరుసటిరోజు మిగిలిన ఆరింటిని తెరిచి వాహనాలను అనుమతిస్తారు.
* జూన్ 11 నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రోజుకు సుమారు 3 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను ఆన్ లైన్ లో ముందుగానే జారీ చేస్తున్నారు. * ముందురోజు తిరుపతికి వచ్చి ఆధార్ కార్డుతో పాటు ఐరిస్ ద్వారా సర్వదర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి. 
* ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 వరకు గంటల వారీగా కోటా మేరకు టికెట్లు వచ్చేలా సాఫ్ట్ వేర్ మార్చారు. 
* గంటకు 500 చొప్పున రోజుకు 6 వేల మందికి దర్శనం కల్పించనున్నారు.
* సర్వదర్శనం టికెట్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్ లోని కౌంటర్ల నుంచి పొందొచ్చు. రద్దీని బట్టి శ్రీనివాసంలోనూ కౌంటర్ తెరిచే అవకాశముంది.
 
తిరుమలకు తొందరపడి రావొద్దు:
శ్రీవారి దర్శనానికి సంబంధించి భక్తులకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక సూచన చేశారు. దూరప్రాంతాల నుంచి భక్తులెవరూ తొందరపడి తిరుమలకు రావొద్దని సూచించారు. ముందే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొని వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దూరప్రాంతాల భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లను బుక్ చేసుకుని వస్తే మంచిదని తెలిపారు. ఇవి ఆన్ లైన్ లో విడుదల చేసిన పది పదిహేను నిమిషాల్లోనే అయిపోతున్నాయని, తిరుపతికి వచ్చాక తీసుకుదాంలే అనుకుంటే దొరక్కపోవచ్చన్నారు. సర్వదర్శనం టిక్కెట్లు కూడా తిరుపతి సమీప ప్రాంతాల వారికే అయిపోవచ్చన్నారు. కాబట్టి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడమే అన్ని విధాలుగా మంచిదన్నారు.

పిల్లలను, వృద్ధులను అనుమతించరు:
ఇక అలిపిరి దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌, వాహనాల తనిఖీల అనంతరం దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారని ఈవో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పదేళ్లలోపు చిన్నారులను, 65 సంవత్సరాలు పైబడిన వృద్దులను ఎట్టి పరిస్థితుల్లో కొండపైకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Categories
Andhrapradesh Latest

జూన్ 11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం, రోజుకు 7వేల మందికి అనుమతి, 6 నుంచి కొండకు బస్సులు

తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8 నుంచి 3 రోజుల

తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8 నుంచి 3 రోజుల పాటు తొలుత టీటీడీ ఉద్యోగులతోపాటు తిరుమల స్థానికులకు ప్రయోగాత్మక(ట్రయల్) దర్శనం కల్పించనున్నారు. 11వ తేదీ నుంచి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. 3 రోజుల పాటు నిర్వహించే ప్రయోగాత్మక దర్శనంలో భాగంగా కరోనా నియంత్రణ చర్యలను ఎలా అమలు చేయాలన్నది పరిశీలిస్తారు. 

* ప్రతి ఇద్దరు భక్తుల మధ్య తప్పనిసరిగా 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు. 
* రోజుకు 7వేల మందిని దర్శనానికి అనుమతించేలా చర్యలు. 
* గంటకు 300 మంది వంతున రోజుకు 15 గంటల పాటు భక్తులను అనుమతించేందుకు ప్రణాళిక. 
* టీటీడీలో 7,400 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 14వేల మంది వరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సేవల సిబ్బంది ఉన్నారు. స్థానికులు 5 వేల మంది వరకు ఉన్నారు. వారందరికీ అవకాశం కల్పించినా 3 రోజుల్లో దర్శనాలు పూర్తవుతాయని అధికారులు అంచనా.
* సర్వదర్శనాలకు కూడా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం.
* 10 రోజులు గడిచాక భక్తుల సంఖ్యను పెంచాలని భావన.
* ఆర్జిత సేవలకు అప్పుడే భక్తులను అనుమతించకూడదని భావన. 
* ఇప్పటికే క్యూలైన్లలో పలు మార్పులు. 
* ఇనుప కమ్మీలు ఏర్పాటు చేసి క్యూలైన్లలో గీతలు. 
* దర్శనాలు పూర్తి స్థాయిలో ప్రారంభమైతే బయటి ప్రాంతాల్లో లడ్డూల విక్రయాన్ని నిలిపేసేందుకు కార్యాచరణ.
* 6 లేదా 7వ తేదీ నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చర్యలు. వాటిల్లోనూ వ్యక్తిగత దూరం. 
* తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం. 

లాక్ డౌన్ 5వ దశలో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాల్లో దర్శనాలకు కేంద్రం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 8 ప్రముఖ ఆలయాలు, రద్దీ ఎక్కువగా ఉండే మరో 12 పుణ్యక్షేత్రాల్లో కలిపి మొత్తం 20 ఆలయాల్లో భక్తులకు దర్శనాలపై దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సమక్షంలో అధికారులు చర్చించారు. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సూచించిన తేదీ ప్రకారం దర్శనాలను ప్రారంభిద్దామని మంత్రి తెలిపారు. కాగా, 8వ తేదీలోపు ఆలయాల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

తిరుమలేశుని రోజుకు సగటున 60 వేల మందికిపైగా దర్శనం చేసుకునే వారు. దేశ, విదేశాల నుంచి భక్తులు వచ్చేవారు. అలాంటిది కరోనా లాక్ డౌన్ కారణంగా 2 నెలలకుపైగా వెంకన్న దర్శనం భక్తులకు కరువైంది. 128 సంవత్సరాల తిరుమల చరిత్రలో ఏడుకొండల వాని దర్శనం భక్తులకు లభించకపోవడం ఇదే తొలిసారి. ఇన్ని రోజుల తర్వాత శ్రీవారి దర్శనానికి అనుమతి లభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు శ్రీవారిని దర్శించుకుంటామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read: ఏపీలో రైలు సర్వీసులు-ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవు

Categories
Andhrapradesh

ఏపీలో క్వారంటైన్ ఏర్పాట్లు సూపర్బ్..మెచ్చుకున్న బ్రిటన్ ప్రోఫెసర్

కరోనా వైరస్ వ్యాపించకుండా..కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటన్ ప్రోఫెసర్ మెచ్చుకున్నారు. విదేశాల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు చూడలేదని, స్టార్ హోటల్స్ లను తలపించేలా ఉన్నాయని కితాబిచ్చారు. అసలు ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆమెకెలా తెలిసింది ? ప్రభుత్వాన్ని మెచ్చుకోనడానికి గల కారణాలేంటీ ? అనేగా మీ సందేహం.

ఎందుకంటే కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో ఆమె ఏపీలోని తిరుపతిలో ఉన్నారు. ఇంకేముంది కరోనా ఆమెకు సోకింది. వెంటనే అధికారులు క్వారంటైన్ కు తరలించారు. కొన్ని రోజులు కేంద్రంలో చికిత్స తీసుకుని ఆరోగ్యవంతురాలిగా బ్రిటన్ కు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆమె అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తిరుపతి శ్రీ వారి దర్శనం కోసం బ్రిటన్ ప్రోఫెసర్ క్లైవ్ కుల్లీ వచ్చారు. కానీ కరోనా వైరస్ సోకడంతో తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 22 రోజుల పాటు చికిత్స అందించారు. 2020, ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. 

తాను ఊహించిన దానికన్నా..బెస్ట్ ఏర్పాట్లు చేశారు. స్టార్ హోటల్స్ తలపించేలా క్వారంటైన్ లో వసతి సౌకర్యాలున్నాయని చెప్పారు. వైద్యులు, సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారని ప్రశంసించారు. హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. మరోసారి భారత్‌కు వచ్చినప్పుడు వారిని తప్పకుండా కలుస్తానని తెలిపారామె. రోజుకు రెండుసార్లు స్నాక్స్, బిస్కెట్లు ఇచ్చారని, వైద్యులు సూచించిన పౌష్టికాహారాన్ని గది వద్దే అందించారన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బ్రిటన్ వెళ్లేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. 

Categories
Andhrapradesh Political

వైకుంఠ ఏకాదశి : తిరుమల ముస్తాబు..ఏర్పాట్ల వివరాలు

తిరుమ‌ల‌లో వైకుంఠ ఏకాద‌శికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. రేపు తెల్లవారుజామున ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని టీటీడీ తెలిపింది. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకున్నామ‌ని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. వైకుంఠ ఏకాదశి గత అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి వీఐపీలకు, సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేప‌ట్టింది టీటీడీ.

 

2020, జనవరి 06వ తేదీ సోమవారం ఉదయం ధ‌నుర్మాస కైంక‌ర్యాల తరువాత 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ముందు ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలను దర్శనానికి అనుమతిస్తారు. తరువాత ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభిస్తామ‌ని చెప్పారు. వీఐపీల‌తోపాటు సామాన్య భ‌క్తుల‌కు మ‌హాల‌ఘు ద‌ర్శనం ఉంటుంద‌ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. 
 

వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చే భక్తులను ఇప్పటికే క్యూలైన్లలోకి అనుమతించారు. 
ఆళ్వార్ ట్యాంక్ విశ్రాంతి గృహం వ‌ద్ద ఉన్న ప్రవేశమార్గం ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోనికి, ఆ త‌రువాత నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లలోకి పంపుతారు. 
ఆ త‌రువాత వ‌చ్చే భ‌క్తుల‌ను మేద‌ర‌మిట్ట వ‌ద్ద గ‌ల ఎన్‌1 ప్రవేశ‌మార్గంలో డ‌బ్ల్యూ-7 గేటు ద్వారా మాడ వీధుల్లోకి అనుమ‌తిస్తారు. 
ద‌క్షిణ మాడ వీధిలో 6500 మంది, ప‌డ‌మర మాడ వీధిలో 14 వేల మంది, ఉత్తర మాడ వీధిలో 19 వేల మంది, తూర్పు మాడ వీధిలో 4వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు అవ‌కాశం ఉంది. 
చివ‌ర‌గా వ‌చ్చే భ‌క్తుల‌ను క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద అనుమ‌తిస్తారు. 

 

క్యూలైన్లలో ఎక్కువ సేపు నిల‌బ‌డ‌కుండా త‌గిన జాగ్రత్తలు తీసుకున్నారు. భ‌క్తుల‌కు అన్నప్రసాదాలు, అల్పాహారం, తాగునీరు, టీ, కాఫీ పంపిణీకి ప్రణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేశారు. 172 ప్రాంతాల్లో 3 ల‌క్షల తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచారు. 9 ల‌క్షల ల‌డ్డూలు నిల్వ ఉంచిన‌ట్టు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, క‌ల్యాణ‌వేదికలో క‌లిపి 85 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. షెడ్లకు అనుబంధంగా మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
 

శ్రీ‌వాణి ట్రస్టుకు విరాళాలు అందించిన దాత‌ల‌కు వైకుంఠ ఏకాద‌శికి 2500 మందికి, ద్వాద‌శికి 2500 మందికి అవ‌కాశం క‌ల్పించనుంది టీటీడీ. 
వీరు ఉద‌యం 10 గంట‌ల‌కు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వ‌ద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 
వారికి మ‌హాల‌ఘు ద‌ర్శనం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. 

Categories
Hyderabad

ఆర్టీసీ సమ్మె కుట్రపూరితం : ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సక్సెస్ : మంత్రి పువ్వాడ

ఆర్టీసీ సమ్మె చేపట్టడం కుట్రపూరితమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితిని గమనించాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్టోబర్ 12వ తేదీ శనివారం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీకి లక్ష కోట్ల ఆస్తులున్నాయని వ్యాఖ్యానిస్తున్నారని, దీనికి సంబంధించిన డేటా ఉందా ? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..(2014 నాటికి) రూ. 4 వేల 416 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. 

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ఏనాడైనా చెప్పామా అని నిలదీశారు. ఆర్టీసీ బతలకాలంటే..మెరుగైన సేవలు అందించాలంటే..50 శాతం ఆర్టీసీ బస్సులు, 30 శాతం హైర్ బస్సులు, 20 శాతం రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లను స్టేజ్ క్యారియర్లుగా అనుమతినిస్తామని చెప్పడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో ఆర్టీసీని లాభాల బాటలో తేలేదని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..కేసీఆర్..సంస్థను లాభాల్లోకి తెచ్చారని, 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడం..మొన్న 16 శాతం హైఆర్ ఇవ్వడం జరిగిందన్నారు. 2004 కంటే ముందు..ప్రభుత్వాలు ఎలాంటి సపోర్టు ఇవ్వలేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామన్నారు. 

ఆర్టీసీని నడపాల్సిన కార్మికులు, కార్మిక నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. తప్పకుండా కొత్త కోణంలో ఆర్టీసీ ఉండబోతోందని, అక్టోబర్ 04వ తేదీన చెప్పిన విధంగా..విధుల్లో హాజరు కావాలని చెప్పినా.. కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మొత్తంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజల అవసరాలను తీరుస్తామన్నారు. డిపోలో ఉన్న బస్సులను బయటకు తీసుకొస్తామని, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తామన్నారు. కుట్రపూరిత ఉద్దేశ్యంతో టికెట్ మెషిన్ ఇస్యూ చేయకుండా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి తీసుకెళ్లారన్నారు. కండక్టర్లకు ట్రైనింగ్ ఇచ్చి టిమ్ మెషిన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. బస్సు ఛార్జీలు అధికంగా వసూలు చేస్తే..మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇష్యూ చేసిన బస్ పాస్‌లు అనుమతించడం జరుగుతోందన్నారు 

Categories
Hyderabad

ఆర్టీసీ కార్మికులకు నోటీసులు : పోలీసుల రక్షణలో అద్దె బస్సులు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం..కార్మికులు బెట్టు వీడడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్టోబర్ 05వ తేదీ శనివారం నుంచి సమ్మెలోకి వెళుతామని కార్మిక సంఘాలు ప్రకటించడంతో ప్రభుత్వం..ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఆర్టీసీ కార్మికులకు సంస్థ ఇంచార్జి ఎండీ సునీల్‌ శర్మ నోటీసులు (అక్టోబర్ 04వ తేదీ శనివారం) జారీ చేశారు. సమ్మెకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు అన్ని బస్‌ డిపోలకు నోటీసులు పంపించారు అధికారులు. త్రిసభ్య కమిటీ నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదన్న జేఏసీ నేతలు… కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది త్రిసభ్య కమిటీ. 2100 అద్దె బస్సులను నడుపుతామని, 3 వేల మంది డ్రైవర్లను నియమిస్తామని వెల్లడించింది. తాత్కాలిక అనుమతులతో స్కూల్ బస్సులను రహదారురలపై తిప్పుతామని, పోలీసు రక్షణలో అద్దె బస్సులను నడుపుతామని వెల్లడించారు త్రిసభ్య కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించినట్లు, 26 అంశాలపై నివేదిక రూపొందించాల్సి ఉందని..రాతపూర్వక హామీ ఇవ్వాలని కార్మిక నేతలు కోరినట్లు తెలిపారు. పండుగ సమయంలో సమ్మెకు వెళ్లడం సరికాదని వారికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బడ్జెట్లో కేటాయించిన దానికంటే ఆర్టీసీకి ఎక్కువ నిధులు ఇచ్చామనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు యత్నించాలని, సమ్మెకు వెళితే..ఆర్టీసీకి మరింత ఆర్థిక నష్టం వస్తుందని చెప్పారు. ఎస్మా చట్టం ప్రకారం సమ్మెకు వెళ్లడం చట్ట విరుద్ధమన్నారు. 

మూడు సార్లు కార్మికులతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయినప్పటికీ.. సయోధ్య మాత్రం కుదరలేదు. కార్మికుల డిమాండ్లకు.. ప్రభుత్వం చెబుతున్న విషయాలకు మధ్య పొంతన కుదరడం లేదు. శుక్రవారం(అక్టోబర్ 4,2019) ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. చర్చలను బహిష్కరించిన కార్మిక సంఘాలు సమావేశం నుంచి బయటకు వచ్చేశాయి. శనివారం(అక్టోబర్ 05,2019) నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని జేఏసీ ప్రకటించింది.
Read More : చర్చలు విఫలం : సమ్మెకు వెళ్తామన్న ఆర్టీసీ కార్మికులు

Categories
Hyderabad

గణేష్ నిమజ్జనం ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి : డీజీపీ

గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు.

గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు. దేశవ్యాప్తంగా అలర్ట్ కొనసాగుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు డీజీపీ ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు డీజీపీ సూచించారు.

గణేష్ నిమిజ్జన ఏర్పాట్లపై డీజీపీ మహేందర్ రెడ్డి అధికారులతో బుధవారం (సెప్టెంబర్ 11, 2019) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా వినాయక విగ్రహాలు నెలకొల్పారన్నారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పటిష్టంగా ఏర్పాట్లు చేశామన్నారు.

భద్రతకు మూడు కమిషనరేట్లలో కలిపి 35 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి విజయవంతంగా నిమజ్జనాలను పూర్తి చేస్తామన్నారు. సాధారణ పౌరులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. శోభాయాత్రలు జరగని వేరే మార్గాల మీదుగా వాహనాల దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం పూర్తైన విషయాన్ని మండపం నిర్వాహకులు పోలీసులకు తెలియజేయాలన్నారు. పోలీసులంతా అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. దాడుల గురించి ఏ సంస్థ నుంచి కూడా హెచ్చరికలు రాలేదని డీజీపీ తెలిపారు.
 

Categories
Hyderabad

గణపతి బప్పా మోరియా : ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవరాత్రులు భక్తుల పూజలందుకున్న లంబోదరుడు ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. పదేళ్లుగా నిమజ్జనం చేస్తున్న ఎన్టీఆర్ మార్గ్‌లోనే ఈసారి కూడా మహా గణపతి నిమజ్జనం జరగనుంది. చివరి రోజు పూజలు అందుకుంటున్న మహాగణపతిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం ఖైరతాబాద్కు తరలి వచ్చారు. శోభాయాత్రను చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నట్లు అంచనా వేస్తున్నారు.

సెప్టెంబర్ 12వ తేదీ గురువారం ఉదయం 6గంటలకు శోభాయాత్ర ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే వినాయకుడిని తీసుకెళ్లే భారీ ట్రక్కు వినాయక మంటపానికి చేరుకుంది. వెల్డింగ్ వర్క్ కూడా ముగిసింది. మరోవైపు గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది పోలీసు యంత్రాంగం. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. వేల మందితో పహారా కాస్తూ… చిన్న అవాంఛనీయ ఘటన జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పటికే హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో నిమజ్జనానికి తెలంగాణ పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 21వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3లక్షల సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలను సిటీ కమీషనర్, డీజీపీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్స్ కు అనుసందానం చేశారు. దీనితో పాటు రూఫ్ టాప్ వాచ్ లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో సాయుధ బలగాలు ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు. మూడు కమిషనరేట్లలోని సిబ్బంది అందరికీ సెలవులు రద్దు చేశారు.

స్టాండ్ టూ స్టేని ప్రకటించి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులను బట్టి ఏ ప్రాంతానికైనా  తరలించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేక బలగాలను రిజర్వ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోని సిబ్బంది, ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్లు ఎప్పటిప్పుడు సమీక్షిస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ఆంక్షలు విధించారు. వినాయక శోభయాత్రి కొనసాగే రూట్లలో ఉదయం 6 గంటల నుంచి ప్రైవేటు వాహనాలకు  అనుమతి ఉండదని, మొత్తం 30 గంటలపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్ తెలిపారు. శోభాయాత్ర జరిగే 17 ప్రధాన రహదారుల్లో పూర్తిగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ రూట్ మ్యాప్ ను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్  కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు.