Categories
International Latest Political

సోలైమాని హత్య ఘటనపై ట్రంప్‌కు ఇరాన్ అరెస్ట్ వారెంట్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. టాప్ జనరల్ ఖాసీం సోలేమానీ హత్య ఘటనపై ప్రతికారంతో రగిలిపోతున్న ఇరాన్.. ట్రంప్ సహా 35 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇరాక్‌లోని అమెరికన్ లక్ష్యాలపై క్షిపణులను పేల్చడం ద్వారా ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడంతో సోలైమాని హత్య అమెరికా, ఇరాన్‌ పరస్పరం యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ విషయంలో ఇంటర్ పోల్ సాయాన్ని కోరినట్టు టెహ్రాన్ ప్రాసిక్యూటర్ ఆలీ Alqasimehr Fars ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి వారెంట్‌పై చర్య తీసుకోవాలనే ఆలోచనను యునైటెడ్ స్టేట్స్, ఇంటర్‌పోల్ రెండూ తోసిపుచ్చాయి.

జనవరి 3న ఇరాక్‌లో డ్రోన్ దాడితో రివల్యూషనరీ గార్డ్స్ కుడ్స్ ఫోర్స్ నేత సోలైమానిని యునైటెడ్ స్టేట్స్ హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో యుఎస్ బలగాలపై ఇరాన్-సమలేఖన మాస్టర్ మైండ్ దాడులకు సోలిమాని సూత్రధారి అని వాషింగ్టన్ ఆరోపించింది. సోలైమాని హత్య, హత్య, ఉగ్రవాద చర్యల ఆరోపణలపై వారెంట్లు జారీ చేసినట్లు అల్కాసిమెహర్ తెలిపారు. సోలైమాని హత్యలో ట్రంప్ ప్రమేయం ఉందని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆరోపిస్తోంది. దీంతో ట్రంప్ సహా ఇతర వ్యక్తులను అరెస్టు చేయాలని రెడ్ నోటీసులు జారీ చేసి ఇరాన్ ఇంటర్ పోల్‌ను కోరిందని ఆయన అన్నారు.

ఈ బృందంలో ఇతర యుఎస్ మిలటరీ, పౌర అధికారులు ఉన్నారని, కానీ మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని Alqasimehr చెప్పారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ సమావేశంలో వారెంట్ అనేది ఒక ‘ప్రచార స్టంట్’ అని యుఎస్ ఇరాన్ రాయబారి Brian Hook అన్నారు. తమ అంచనా ప్రకారం.. ఇంటర్ పోల్ ఇందులో జోక్యం చేసుకోదు. రెడ్ నోటీసులు జారీ చేయదయని ఆయన అన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడ. దీనికి జాతీయ భద్రత, అంతర్జాతీయ శాంతి లేదా స్థిరత్వాన్ని ప్రోత్సహించడం వంటివి ఉండవు. దీన్ని ఎవరూ తీవ్రంగా పరిగణించని ప్రచార స్టంట్ అంటూ హుక్ కొట్టి పారేశారు.

రాజకీయ, సైనిక, మత లేదా జాతి స్వభావం ఏదైనా జోక్యం లేదా కార్యకలాపాలను చేపట్టడానికి దాని రాజ్యాంగం నిషేధించిందని ఇంటర్ పోల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అందుకే ఇలాంటి అభ్యర్ధనలను జనరల్ సెక్రటేరియట్‌కు పంపించాలా వద్దా అనేది నిర్ణయం తనదేనని అన్నారు. ఇంటర్ పోల్ ఈ అభ్యర్థనలను అసలే పరిగణించదని తెలిపారు. ట్రంప్ పదవీవిరమణ చేసిన తర్వాత ఇరాన్ ఈ విషయాన్ని కొనసాగిస్తుందని Alqasimehr అన్నారు.

Categories
National Sports

క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్: 15రోజుల్లో లొంగిపోవాల్సిందే

వెస్టిండీస్ తో ప్రస్తుతం ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ లో ఆడుతున్న టీమిండియా బౌలర్ షమీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గృహహింస కేసులో షమీకి అతని సోదరుడు హసీద్ అహ్మద్‌కు వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 15 రోజుల లోపు కోర్టుముందు లొంగిపోవాలంటూ ఆదేశించింది.

పలువురు అమ్మాయిలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన భర్త, అతడి కుటుంబ సభ్యులు తనని వేధిస్తున్నారంటూ షమీ భార్య హసీన్ జహాన్ కేసు పెట్టగా.. గతేడాది ఐపీఎల్‌కు ముందు ఈ వార్త హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద కోల్ కతా పోలీసులు షమీపై గృహహింస కేసు పెట్టి చార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే షమీ ఇంటికి వెళ్లిన జహాన్..అత్తారింట్లో హంగామా చేసి, షమీ తల్లిదండ్రులతో గొడవ పడింది. కూతురితో కలిసి వచ్చిన హసీన్ తనను తాను ఒక గదిలో నిర్భంధించుకోగా.. షమీ తల్లిదండ్రులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అక్కడకు వచ్చిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకుని వెళ్లి తర్వాత బెయిల్ పై విడిచిపెట్టారు. ఈ క్రమంలోనే ఆమె షీమీ, అతని కుటుంబంపై పెట్టిన కేసులో విచారణ జరిపిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Categories
Movies

స్టార్ హీరోకి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన హైకోర్టు!

స్టార్ హీరో సుదీప్‌కు క‌న్న‌డ‌లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల‌లో న‌టించిన సుదీప్ సైరాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆయ‌న చాలా ఇబ్బందుల‌లో ఉన్నారు. గ‌త కొంత కాలంగా హైకోర్టులో విచార‌ణ సాగుతున్న కాఫీ ఎస్టేట్ వివాదంలో కోర్టుకి హాజ‌రు కాకుండా త‌ప్పించుకు తిరుగుతున్నాడ‌నే ఆరోప‌ణ రావ‌డంతో.. అక్క‌డి హైకోర్టు సుదీప్‌ను అరెస్ట్ చేయ‌ల‌ని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల మే 22 లోగా సుదీప్ ఎక్క‌డ ఉన్నాడో అచూకి తెలుసుకుని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించింది JMFC కోర్టు. 

అసలు ఏం జరిగిందంటే..? సుదీప్ 2016లో వార‌స‌దార అనే టీవీ షో నిర్వ‌హించాడు. దాని షూటింగ్ కోసం దీపక్ పటేల్ అనే వ్యక్తికి చెందిన కాఫీ ఎస్టేట్‌ను అద్దెకు తీసుకున్నారు. దీని కోసం రూ.80 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్న సుదీప్ ముందుగా 50 వేలు అడ్వాన్స్ ఇచ్చి మిగ‌తా అమౌంట్‌ను ఎగ్గొట్టార‌ని కర్ణాటక చిక్‌ మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ యజమాని దీపక్ పటేల్ ఫిర్యాదు చేశారు. 

ఒప్పందం ప్ర‌కారం ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వ‌కుండా త‌న‌ని మోసం చేశార‌ని జిల్లా SP స‌ల‌హా మేర‌కు కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసారు కాఫీ ఎస్టేట్ ఓనర్ దీపక్‌. సుదీప్‌, ఆయ‌న‌కు చెందిన ప్రొడక్షన్‌ హౌస్‌ కిచ్చా క్రియేషన్స్‌ పైనా, డైరెక్టర్ మహేష్‌లపై కేసు నమోదైంది. ప్ర‌స్తుతం సుదీప్‌కి అరెస్ట్ వారెంట్ జారీ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది.