Categories
Crime National

బాలికపై అత్యాచారం..పలువురు బాలికలను లైంగికంగా వేధిస్తున్న జూడో కోచ్ 

ఆత్మరక్షణ కోసం కరాటే..జూడో వంటి బాలికల చాలా ఉపయోగపడతాయి. కానీ ఆ విద్యలు నేర్చే వ్యక్తే బాలికలపై కామపు కన్నేస్తే..వారి పరిస్థితి ఏంటీ?ఆత్మరక్షణ కోసం కరాటే జూడో వంటివి నేర్చుకుంటే తమను తాము కాపాడుకోవటమే కాక ఇతరులకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్ధేశంతో పలువురు బాలికలు కరాటే జూడోలు నేర్చుకుంటున్నారు.  కానీ ఆ విద్యలు నేర్పే కోచ్ బాలికలపై కన్నేశాడు. ఓ బాలికపై అత్యాచారం చేశాడు.మరో ఐదుగురు బాలికలను తన కోరిక తీర్చమని వేధిస్తున్నాడు. దీంతో బాధిత బాలికలు పోలీసులకు చెప్పగా వారు సదరు కామాంధుడిని అరెస్ట్ చేసిన ఘటన యూపీలోని కురుక్షేత్ర జిల్లా షాహబాద్ సిటీలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే..షాహబాద్ సిటీలోని ఓ స్కూల్లో 27ఏళ్ల గుర్మైల్ సింగ్ జుడో కోచ్‌ గా పనిచేస్తున్నాడు.  5 నుంచి 12 క్లాస్ బాలికలకు జూడో నేర్పిస్తుంటాడు. అతా తన దగ్గర కటాటే నేర్చుకోవటానికి వచ్చే బాలికలకు అశ్లీల వీడియోలు పంపించి వారిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాలికపై సంవత్సరం నుంచి  అత్యాచారం చేస్తున్నాడు. మరో ఐదుగురు బాలికలను కూడా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ  విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు.

దీంతో వారు మార్చి 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్మైర్ సింగ్ తమను పదే పదే వేధిస్తున్నాడనీ..తాను చెప్పినట్లుగా వినకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు చెప్పారు బాధిత బాలికలు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆ విషయం నిజమేనని తేలింది. దీంతో కోచ్ గర్మైల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫోన్ తీసుకుని పరిశీలించగా దాంట్లో బాలికల ఫోటోలు..పలు అశ్లీల వీడియోలు ఉన్నాయనీ..అవి బాలికలకు పంపించినట్లుగా నిర్ధారణ చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

స్కూల్లో బాలికలకు సంబంధించిన ఫోన్ నంబర్లు తీసుకుని..వాట్సాప్ గ్రూప్ తయారు చేసి వాటిలో అశ్లీల చిత్రాలు..వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా వేధించాడని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గుర్మైల్ సింగ్ పై ఐపీసీ సెక్షన్ 67, ఐటీ, 120 బి, 384, 452, పోస్కో, 506 చట్టాల కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.