Categories
Crime National

సెల్‌ఫోన్లు కొంటానంటూ కొట్టేస్తున్న కిలాడి లేడి!

గుంటూరుకు చెందిన అరవింద అనే యువతి సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడితో కొద్దిరోజులుగా ప్రేమలో పడింది. తన ప్రియుడి కోసం తల్లిదండ్రులకు చెప్పకుండా హైదరాబాద్‌ కు వచ్చేసింది. తీరా ఇక్కడికి వచ్చాక ప్రియుడు మొసం చేశాడు. దీంతో తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్లేందుకు మెహం లేక హైదరాబాద్‌లో ఉండిపోయి ఓ మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగం సాధించి ఎల్బీనగర్ సమీపంలోని హస్తినాపురంలో ఓ గది అద్దెకు తీసుకుంది. స్థానికంగా పరిచయమైన ఓ మహిళ OLX లో పెట్టే ఫోన్ల యజమానులను ఎలా మోసం చేయవచ్చో అరవిందకు చెప్పింది. దానికి ఆకర్షితురాలైన అరవింద చోరీల బాట పట్టింది.  

ఈ క్రమంలో గత నెల నుంచి OLX వెబ్‌సైట్లో అమ్మకానికి పెట్టే ఖరీదైన సెల్‌ఫోన్లను చూసి తాను కొంటానంటూ వాటి యజమానులకు ఫోన్ చేసేది. అంతకుముందే ఓ ఇంటిని చూసుకుని ఆ ఇంటి వెనక నుంచి పారిపోయేందుకు దారి సైతం ఉండేలా జాగ్రత్త పడేది.

ఫోన్ యజమానులకు ఆ ఇల్లు తమదే అనేలా నమ్మించి లొకేషన్‌ షేర్‌ చేసేది. అక్కడికి వచ్చిన వారి వద్ద నుంచి ఫోను తీసుకుని ఛార్జింగ్‌ పెట్టి చెక్‌చేసి డబ్బులిస్తానంటూ లోనికి వెళ్లి మాయమయ్యేది. అంతేకాదు చోరీ చేసిన వాటిని మళ్లీ OLX లోనే అమ్మేసి జల్సాలు చేస్తోంది.  దీంతో ఎల్బీనగర్ పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 
Also Read : రోహిత్ మర్డర్ కేసు : ఎన్డీ తివారీ కోడలు అరెస్ట్