Categories
International Latest Technology

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘George Floyd Challenge’ హ్యాష్ ట్యాగ్ 

నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అట్టుడుకుతోంది. తెల్ల పోలీసు అధికారి జార్జ్ ఫ్లాయిడ్ మెడపై కాలి పెట్టడంతో ఊపిరాడక మరణించినట్టు అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు కస్టడీలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జార్జ్ ఫ్లాయిడ్ ఛాలెంజ్ ఒకటి ట్రెండ్ అవుతోంది. జార్జ్ ఘటనను అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జార్జ్ మెడపై కాలి పెట్టి చంపిన పోలీసు అధికారిలా అనుకరిస్తూ ‘George Floyd Challenge’ పేరుతో హ్యాష్ ట్యాగ్ జత చేస్తూ ఆన్ లైన్‌లో పోస్టులు చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో చాలామంది సోషల్ యూజర్లు పాల్గొంటున్నారు. 

ఫొటోలు, వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ అన్ని సోషల్ ప్లాట్ ఫాంల్లో George Floyd Challenge హ్యాష్ టాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఉల్లంఘించడంతో ఈ హ్యాష్ ట్యాగ్ ను బ్లాక్ చేశాయి కంపెనీలు. ఆన్ లైన్ ప్లాట్ ఫాంల్లో ఇతర సోషల్ యాప్స్ లోనూ జార్జ్ ఫ్లాయిడ్ ఛాలెంజ్ కు సంబంధించి పోస్టులను డిలీట్ చేయాల్సిందిగా ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది.

దాంతో టిక్ టాక్ సహా అన్ని ప్లాట్ ఫాంల్లో #George Floyd Challenge కు సంబంధించి ఫొటోలు, వీడియోలను తొలగించారు. ఎవరైనా యూజర్లు ఈ హ్యాష్ ట్యాగ్ తో సెర్చ్ చేస్తే పోలీసుల చర్యను ఖండిస్తు నిరసన చేస్తున్న వీడియోలు మాత్రమే కనిపిస్తున్నాయి.

Read:  న్యూజిలాండ్ బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ : ప్రధాని జసిందా ఆర్డెర్న్

Categories
Hyderabad

కాయ్ రాజా కాయ్ : IPL 2019 బెట్టింగ్‌లు..అరెస్టులు

క్రికెట్‌ జరుగుతుందంటే చాలు బెట్టింగ్‌ల జోరందుకుంటుంది. అది ఐపీఎల్‌ అయినా, ప్రపంచకప్‌ అయినా చివరికి వన్డే సిరీస్‌ అయినా బెట్టింగ్‌లు మాత్రం ఆగవు. బుకీలు బెట్టింగ్స్‌ను నిర్వహిస్తూ.. కోట్లాది రూపాయలు కొళ్లగొడుతుంటారు. ఏపీలో నిన్నమొన్నటి వరకు ఎన్నికలపై జోరుగా బెట్టింగ్స్‌ సాగాయి. ఏపీలో ఎవరు సీఎం అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, కీలకమైన నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారంటూ బెట్టింగ్‌లకు మాఫియా తెరలేపింది. దీంతో బెట్టింగ్‌ రాయుళ్లు ఫలానా చోట ఫలానా వారు గెలుస్తారంటూ జోరుగా బెట్టింగ్స్‌ కాచారు. ఈ సమయంలోనే వచ్చిన ఐపీఎల్‌ మ్యాచ్‌ను బుకీలు వదల్లేదు. ప్రతి మ్యాచ్‌పైనా బెట్టింగ్స్‌ వేస్తూనే ఉన్నారు. మే 12వ తేదీ ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారంటూ పలుచోట్ల బెట్టింగ్స్‌ జరిగాయి.

కడప జిల్లాలో : – 
కడప జిల్లా జమ్మలమడుగులో ఐపీఎల్‌ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ముంబై, చెన్నై మధ్య జరుగుతుండడంతో బెట్టింగ్స్‌ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నాగులకట్ట వీధిలో సోదాలు నిర్వహించారు. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రెండు లక్షల 30వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ కోలా కృష్ణన్‌ తెలిపారు. ముందుగా అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. మిగిలిన ఆరుగురి సమాచారం తెలిసిందన్నారు. వీరిని మే 13వ తేదీ సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

గుంటూరు జిల్లాలో : – 
గుంటూరు జిల్లాలోనూ ఐపీఎల్‌ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్స్‌ జరిగాయి. సత్తెనపల్లిలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తోన్న కోల్‌కతాకు చెందిన అబీర్‌చంద్‌ అనే బుకీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థులే లక్ష్యంగా వారితో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అబీర్‌చంద్‌ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న ఏడు లక్షల రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌ సాఫ్ట్‌వేర్‌ తయారు చేస్తున్న ప్రధాన సూత్రధారి సైన్‌ఘోష్‌ కోసం గాలింపు ముమ్మరం చేసినట్టు గుంటూరు రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్‌, టెన్నిస్‌, హార్స్‌ రేసింగ్‌ తదితర ఆరు ఆటల్లో జోరుగా బెట్టింగ్‌ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ బెట్టింగ్‌లో కనీసం వందమంది పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌‌లో : – 
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్‌ క్రికెట్‌ ఫైనల్ మ్యాచ్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీమాన్‌, సన్నీకుమార్‌ జైస్వాల్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 25వేల నగదు, రెండు కంప్యూటర్‌ సిస్టమ్స్‌, రెండు మొబైల్‌ ఫోన్స్‌, పోర్టబుల్‌ టీవీ, సెటప్‌బాక్స్‌లు స్వాధీనం చేసుకున్నారు. 

Categories
National Technology

పబ్‌జీ ఆడినందుకు 10మంది అరెస్ట్

పాపులర్ ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్‌ జీ(PUBG) ఆడినందుకు 10మంది యువకులను అరెస్ట్ చేశారు రాజ్ కోట్ పోలీసులు. పబ్‌జీకి యువత అడిక్ట్ అవుతుండడంతో వారిని అరెస్ట్ చేసినట్లుగా రాజ్‌కోట్ పోలీస్ కమీషనర్ మనోజ్ అగర్వాల్ పబ్‌జీ ఆడరాదంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు గవర్నమెంట్ పబ్‌జీని బ్యాన్ చేసినట్లుగా ప్రకటించింది. అయినా కూడా ఆడిన 10మందిని రాజ్‌కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి మీద సెక్షన్ 188కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు బెయిల్ ఇచ్చుకునే అవకాశం ఉండడంతో వారిని అరెస్ట్ చేసిన వెంటనే విడుదల చేశారు. ఈ కేసులో వాళ్లు కోర్టుకు నేరుగా హాజరుకావలసి ఉంటుందని పోలీస్ కమీషనర్ మనోజ్ అగర్వాల్ వెల్లడించారు. అయితే పట్టుకున్న వారిలో జాబ్‌ చేసే వాళ్లు ముగ్గురు ఉండగా.. గ్రాడ్యుయేట్ చేసి జాబ్ వెతుక్కుంటున్న వ్యక్తి ఒకరు.. ఆరుగురు కాలేజ్ విద్యార్ధులు ఉన్నారు. వారి ఫోన్‌లను తదుపరి విచారణ కోసం పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు.

అరెస్ట్ అయినవారి ఫోన్‌లోని హిస్టరీని చెక్ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. పబ్‌జీకి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. పబ్‌జీ గేమ్‌ని భారత్ లో నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.