Categories
National Slider

అంబులెన్స్ లో స్ట్రెచర్‌పై వచ్చి ఓటేసిన ఎమ్మెల్యే

గుజరాత్‌లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ ఎమ్మెల్యే కేసరిసిం జేసాంగ్‌భాయ్ సోలం అంబులెన్సులో వచ్చి మరీ ఓటేశారు.  ఆయనను స్ట్రెచర్ పైన మోసుకెళ్లి మరో ఓటు వేయించారు. మతార్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసరిసిం జేసాంగ్‌భాయ్ సోలం కొన్నాళ్లుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 

ఈ రోజు పోలింగ్ కావడంతో ఆయనను అంబులెన్సులోనే అసెంబ్లీకి పట్టుకొచ్చారు. స్ట్రెచర్ పై పడుకునే ఆయన ఓటు వేశారు. గుజరాత్ లో మొత్తం నాలుగు పోస్టులుకు ఎన్నికలు సాగుతున్నాయి. 

రాజ్యసభలో ఖాళీగా ఉన్న 18 స్థానాలను భర్తీ చేయటానికి ఎన్నికలు ఓటింగ్ ప్రారంభమైంది. మార్చి 26న జరగాల్సి ఉండగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంలో వీటిని వాయిదా వేసిన ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి.  

పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకుంటున్నారు. ఈ కరోనా కాలంలో జరుగుతున్న ఈ రాజ్యసభ ఎన్నికలకు ఓటు వేయటానికి వచ్చినవారు కరోనా జాగ్రత్తలూ పాటిస్తూ ఓట్లు వేస్తున్నారు.

Read: సూర్యగ్రహణం : కురుక్షేత్రలో నిబంధనలు..holy dip bannned