Categories
Viral

శవ పేటికలో పెళ్లి కూతురు: షాక్ అయిన అతిథులు

పెళ్లి చేసుకోవటం పెద్ద విషయం కాదు. కానీ ఆ పెళ్లి చిత్రంగా..విచిత్రంగా..వినూత్నంగా..విశేషంగా జరుపుకోవటానికి కొంతమంది ఇష్టపడతారు. అటువంటివాటి గురించి వింటున్నాం. ఆకాశంలో పెళ్లి..సముద్ర గర్భంలో పెళ్లి..పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గెటప్ లోను..పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గెటప్ లోను వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయటం వంటివి చూస్తున్నాం. అహా..వీరందరికీ ఫుల్ డిఫరెంట్ గా..కాస్త వైల్డ్ గా పెళ్లి మండపానికి వచ్చింది ఓ పెళ్లి కూతురు. శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చి అందరినీ షాక్ కు గురి చేసింది పెళ్లి కూతురు. 

పెళ్లి వేడుక జరిగే చోటికి నల్లని వస్త్రం కప్పిన ఓ శవపేటికను తీసుకొచ్చారు. ఇదేంటి పెళ్లి జరగబోతోంది. పెళ్లి కూతురు ఇంకా రాలేదు అనుకుంటూ ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎవరో పెళ్లి మండపానికి పెళ్లి కూతురు శవ పేటిలో వస్తుందని చెప్పారు. దీంతో అందరూ ఆతృతగా చూస్తు ఉన్నారు. అలా వారు చూస్తుండగానే.. పెళ్లికూతురు శవపేటిక రానే వచ్చింది. దీంతో పెళ్లి కొడుకు డాన్సులు వేస్తూ తానే స్వయంగా కేరింతల మధ్య ఆ నల్ల వస్త్రాన్ని తొలగించాడు. శవపేటిక పూతను నెమ్మదిగా పైకి ఎత్తాడు. దాంట్లో పెళ్లి కూతరు నవ్వుతూ పైకి లేచింది. సర్ ప్రైజ్ ఇచ్చాను కదూ అన్నట్లుగా తెగ నవ్వుతూ సిగ్గుపడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. 

వెర్రి వెయ్యి విధాలు అంటారు. పిచ్చి పలు రకాలు అంటారు కూడా. ఇటువంటిదే ఈ పెళ్లి కూతురి పద్ధతి చూస్తే అలా అనుకోక తప్పదు.ఏది ఏమైనా ఎవరి ఇష్టం వారిది..తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవటానికి ఇటువంటివి చేస్తుంటారని అనుకోవాలి.