Categories
Latest Telangana

24 Hrs Rain : లోతట్టు ప్రాంత వాసులు భయపడొద్దంటున్న GHMC

రాగల 24 గంటల్లో నగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. దీంతో GHMC అలర్ట్ అయ్యింది. చినుకుపడితే..నగరంలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో అందరికీ తెలిసిందే. ఇక 24 గంటల పాటు వర్షం పడితే..ఎలాంటి సీన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా..లోతట్టు ప్రాంతాల వాసుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఈసారి నిశ్చింతంగా ఉండొచ్చని బల్దియా భరోసా ఇస్తోంది. వర్షం కారణంగా వచ్చే వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి. ముంపు నుంచి వెంటనే తేరుకొనే విధంగా సర్కిల్, జోనల్ స్థాయిలో సహాయక సిబ్బందిని అప్రమత్తం చేసింది. చెట్లు కూలడం, ఇతర విపత్తులు సంభవిస్తే..వెంటనే స్పందించే విధంగా సిబ్బందిని అలర్ట్ చేసింది. మూడు షిప్టుల్లో విధులు నిర్వహించేందుకు బల్దియా సిద్ధమౌతోంది. 

ముంపు సమస్య వచ్చే ప్రాంతాలు
రాణిగంజ్ క్రాస్ రోడ్, ఆలుగడ్డ బావి, ఖైరతాబాద్ రాజీవ్ గాంధీ విగ్రహం, లక్డీకాపూల్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, రాజ్ భవన్ విల్లామేరీ కాలేజీ, పంజాగుట్ట మోడల్ హౌస్, జూబ్లీహిల్స్ నీరూస్ షోరూం, జూబ్లీ హిల్స్ అపోలో క్రెడిల్ వైద్య శాల, కేసీపీ జంక్షన్, బల్కంపేట ఆర్‌యూబీ, నాంపల్లి టీ జంక్షన్, హిమాయత్ నగర్ మినర్వా హోటల్ తదితర ప్రాంతాలున్నాయి. 

మొత్తంగా హైదరాబాద్ లో 30 ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో వరద నీటిని తోడిపోసేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయక చర్యల కోసం జోనల్, సర్కిల్ స్థాయిల్లో మొబైల్ టీమ్ లను రంగంలోకి దింపారు. డీసీఎం వాహనాలతో కూడిన 87 మినీ మొబైల్ బృందాలు, జేసీబీలతో కూడిన 79 మొబైల్ మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఇందులో ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడు షిప్టుల్లో పనిచేసేందుకు 101 స్టాటిక్ లేబర్ టీమ్ లను ఏర్పాటు చేశారు. వరద నివారణ చర్యల కోసం ఈ సంవత్సరం రూ. 24.53 కోట్లు కేటాయించారు. 

Read: ఇక వానలే వానలు..తెలంగాణలో రుతుపవనాల ఎంట్రీ

Categories
National Political

భోపాల్ చేరుకున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

కొన్ని రోజులుగా బెంగళూరులోని ఓ రిసార్ట్ లో ఉంటూ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన 19మంది మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఇవాళ(మార్చి-13,2020)భోపాల్ చేరుకున్నారు. భోపాల్ చేరుకున్నవారిలో  ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా భోపాల్ కు చేరుకున్నవారిలో ఉన్నారు. యితే భోపాల్ విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బీజేపీ నాయకులు దాదాపు రెండు బస్సుల్లో కార్యకర్తలను భోపాల్‌ విమానాశ్రయానికి తరలించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు ఘర్షణ జరిగింది. భోపాల్ ఎయిర్ పోర్ట్ లో 144సెక్షన్ విధించారు.

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో 6 గురు కేబినెట్ మంత్రులు సహా  కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, సీఎం కమల్‌నాథ్ సర్కారును సంక్షోభంలో నెట్టేసిన విషయం తెలిసిందే. సీఎం కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని సంక్షోభంలో నెట్టేసి, గద్దె దించాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శల నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. 

మరోవైపు మంగళవారం(మార్చి-10,2020) రాజీనామాలు చేసిన ఆరుగరు మంత్రులతో సహా 22మందిలో,13మందికి స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం లేదా శనివారం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు తనను కలిసి రాజీనామాలు సమర్పించాలని స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. చట్టం ప్రకారం రాజీనామాలు చేసే ఎమ్మెల్యేలు మొదటగా స్పీకర్ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని,ఆ తర్వాత కేసు యొక్క యోగ్యత ప్రకారం నిర్ణయించే ముందు స్పీకర్ అందుబాటులో ఉన్న సాక్ష్యాలను లేదా వాస్తవాలను పరిశీలిస్తారని స్పీకర్ ప్రజాపతి తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరూ చేజారిపోకుండా కాంగ్రెస్,బీజేపీలు జాగ్రత్త పడ్డాయి. కాంగ్రెస్ 94మంది ఎమ్మెల్యేలను జైపూర్ కి తరలించగా,బీజేపీ  తమ 102మంది ఎమ్మెల్యేలను గురుగావ్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి తరలించింది.

230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 116గా ఉంది. ఒకవేళ 22మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే మెజార్టీ మార్క్ 104గా ఉంది. ప్రస్తుతం బీజేపీ దగ్గర 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బకవేళ బలపరీక్ష జరిగితే కమల్ నాథ్ సర్కార్ కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Categories
National

పారిస్ లో మోడీకి ఘన స్వాగతం

ఐదు రోజుల పాటు మూడు దేశాల్లో అధికారిక పర్యటనలో భాగంగా మొదటగా ఇవాళ(ఆగస్టు-22,2019) పారిస్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. పారిస్ లోని చార్లెస్ డీ గాలే ఎయిర్ పోర్ట్ లో మోడీకి ఫ్రెంచ్ విదేశాంగ శాఖ మంత్రి జేవై లీడ్రెయిన్, అక్కడి అధికారులు,నాయకులు ఘనస్వాగతం పలికారు. భారత సంతతి ప్రజలకు మోడీకి ఘన స్వాగతం పలికారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రోన్,ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎడోర్డ్ ఫిలిప్పీతో మోడీ సమావేశమై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. యూఏఈ,బహ్రెయిన్ లో కూడా మోడీ పర్యటించనున్నారు. ఆయా దేశాల అధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.