Categories
National

కాంగ్రెస్ కు మోడీ ఆఫర్ : కశ్మీర్ వెళ్లాలనుకుంటే ఏర్పాట్లు చేస్తా

కశ్మీర్ వెళ్లాలనుకునే కాంగ్రెస్ నాయకులు తనకు సమాచారం ఇస్తే తాను వారు కశ్మీర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తానని ప్రధానమంత్రి మోడీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్లిలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశ ప్రజల ఆకాంక్షల దృష్యా  తీసుకున్న ఆర్టికల్ 370రద్దు గురించి చరిత్రలో ప్రస్తావనకు వస్తే ప్రజలు దానిని తిరస్కరిస్తారని,ఆర్టికల్ 370రద్దు తప్పు అని మాట్లాడేవాళ్లకు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. 

కశ్మీర్‌లో హిందువులు ఉంటే బిజెపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నాయకుడు చెప్పారని (ఆర్టికల్ 370 ను రద్దు చేయడం), దేశం  ఐక్యత మరియు సమగ్రతలో మీరు ‘హిందూ-ముస్లిం’ని చూస్తున్నారా అని మోడీ కాంగ్రెస్ ను ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ..ఆర్టికల్ 370రద్దుతో దేశం ముక్కలవుతుందన్నారు.

రద్దు చేసి మూడు నెలల అవుతుందని దేశం ముక్కలైందా అని మోడీ ప్రశ్నించారు. ఆర్టికల్ 370రద్దుతో మనం కశ్మీర్ ను కోల్పోతున్నాం అని మరో కాంగ్రెస్ లీడర్ చెప్పాడని,మనం కశ్మీర్ ను కోల్పోయామా అని మోడీ ప్రశ్నించారు. కశ్మీర్ వెళ్లాలనుకుంటే తనకు చెప్తే తానే స్వయంగా ఏర్పాటు చేస్తానని మోడీ అన్నారు.