Categories
National

క్వారంటైన్ టిప్స్ కావాలంటే చెప్తా…విడుదల తర్వాత ఒమర్ అబ్దుల్లా ట్వీట్

నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 242 రోజుల తర్వాత ఇవాళ(మార్చి-24,2020)విడుదల చేశారు. కరోనా కట్టడి సందర్భంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న ఈ సమయంలో ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లానే కశ్మీర్ కూడా లాక్ డౌన్ లో ఉంది. 

23రోజుల తర్వాత నిర్భందం నుంచి విడుదలై చివరకు హరి నావాస్ వదిలిపెట్టాను. ఆగస్టు-5,2019న ఉన్నదానికంటే ఇవాళ ఇది చాలా ప్రత్యేకమైన ప్రపంచం అని విడుదల అనంతరం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశాడు. మార్చి-10న 50వ వసంతంలోకి అడుగుపెట్టిన అబ్దుల్లా…ఇవాళ ఇప్పటివరకు నిర్భందంలో ఉన్న శ్రీనగర్ లోని హరి నివాస్ నుంచి దగ్గర్లోని తన అధికారిక ఇంటికి వెళ్లారు.

అయితే గంలో ఎప్పుడూ క్లీన్ షేవ్ తో ప్రజలకు కనిపించే ఒమర్ అబ్దుల్లా..ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తెల్ల గడ్డం గుబురుగా పెరిగిపోయింది. తన నిరసనకు గుర్తుగా తాను విడుదలయ్యేంతవరకు గడ్డం తీయబోనని ఒమర్ తీర్మాణించుకున్న విషయం తెలిసిందే. అయితే తనతో పాటు అరెస్ట్ చేసిన మాజీ సీఎం,పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీని కూడా విడుదల చేయాలని ఒమర్ విజ్ణప్తి చేశారు. ఇటీవల ఒమర్ తండ్రి ఫరూక్ అబ్దుల్లాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

విడుల అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ గురించి ఒమర్ ప్రస్తావించారు. ఇవాళ మనమంతా చావుబ్రతుకు యుద్ధం చేస్తున్నామని నేను రియలైజ్ అయ్యాను అని ఒమర్ అన్నారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో అదుపులోకి తీసుకున్నవాళ్లందరినీ ఇవాళ విడుదల చేయాలన్నారు. కరోనా పోరాటంలో భారత ప్రభుత్వ సూచనలను అందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలని ఒమర్ ప్రజలకు విజ్ణప్తి చేశాడు. అయితే ఎవరికైనా క్వారంటైన్ సమయంలో బతకడం గురించి లేదా లాక్ డౌన్ అవ్వడం గురించి చిట్కాలు కావాలనుకుంటే నతన వద్ద నెలల అనుభవం ఉందని ఒమర్ చేసిన ట్వీట్  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒమర్ ట్వీట్ చేసిన 15నిమిషాల్లోనే 1000రీట్వీట్లు,5వేల లైక్ లు వచ్చాయి.

See Also |  ప్రపంచమంతా లాక్ డౌన్…వైరస్ వెలుగులోకి వచ్చిన వూహాన్ లో ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత!

Categories
National

7 నెలల తర్వాత… విడుదలైన ఫరూక్ అబ్దుల్లా

ఏడు నెలల కస్టడీ నుంచి జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విడుదలయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మాట్లాడడానికి నా దగ్గర పదాల్లేవ్…ఈ రోజు నేను ఫ్రీ అయ్యాను..నేను ఫ్రీగా ఉన్నాను అని ఫరూక్ అన్నారు. అందరూ విడుదలయ్యేవరకు తాను రాజకీయ విషయాల గురించి మాట్లాడనని ఫరూక్ చెప్పారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యే ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టులో కేంద్రప్రభుత్వం రద్దు చేసే సమయంలో కశ్మీర్ లో ఎలాంటి అల్లర్లు జరుగకుండా ముందుజాగ్రత్తగా ఫరూక్ ని కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత కొన్ని రోజులకు సెప్టెంబర్ 2019లో ఫరూక్ పై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రయోగించారు. పబ్లిక్ స్టేఫ్టీ యాక్ట్ ప్రకారం ఎటువంటి విచారణ లేకుండానే రెండేళ్ల వరకు నిర్భంధంలోకి తీసుకోవచ్చు. ఈ చట్టం కింద ఇల్లే .. అనుబంధ జైలుగా పరిగణిస్తారు. ఫరూక్ పై పీఎస్ఏ చట్టంలోని “డిస్ట్రబింగ్ పబ్లిక్ ఆర్డర్”(దీని ద్వారా తక్కువగా మూడు నెలల నిర్భందం)ప్రకారం శ్రీనగర్ లోని ఆయన ఇంటిలోనే ఆయనను నిర్భందించారు.

అయితే ఆ తర్వాత మరో మూడు నెలల ఆయన నిర్భందంను పొడించారు. దీంతో ఇవాళ పొడిగించబడిన కస్టడా చివరి రోజు. ఇక ఫూరూక్ ని నిర్భందాన్ని పొడిగించకుండా ఆయనను విడుదల చేశారు. ఒక ప్రధాన స్రవంతి రాజకీయనాయకుడిపై,ముఖ్యంగా ఓ మాజీ సీఎం, లోక్ సభ ఎంపీపై పీఎస్ఏ యాక్ట్ ప్రయోగించబడింది మొదటిసారిగా ఫరూక్ పైనే. సాధారణంగా టెర్రరిస్టులపై,వేర్పాటువాదులపై,లోయలో రాళ్లు విసిరేవారిపై ఈ చట్టం ప్రయోగిస్తుంటారు. 

ఆర్టికల్ 370రద్దు సమయంలో వందలాది మంది నేతలను నిర్భంధంలోకి తీసుకోగా పలువురిని విడతల వారీగా వదిలిపెడుతూ వచ్చారు. ఏడు నెలల తర్వాత ఇవాళ(మార్చి-13,2020)ఫరూక్ అబ్దుల్లాను రిలీజ్ చేశారు. అయితే జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీ ఇంకా నిర్భందంలోనే ఉన్నారు.

See Also | 37రోజుల వరకు శరీరంలో కరోనా వైరస్ జీవించగలదట

Categories
National

మా పాలన మెచ్చి మళ్లీ పట్టం : యూపీఏలా పని చేయలేము

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు కోరుకున్నారని, అందుకే తమకు పట్టం కట్టారని ప్రధాని చెప్పారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పుని ప్రధాని కొనియాడారు. సమయంతో పోటీ పడి పని చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల 70 ఏళ్ల పాలన దారుణంగా సాగిందన్నారు. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్నారు.

యూపీఏలా మేము పని చేయలేము అని ప్రధాని న్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు భద్రత కల్పించామన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశామన్నారు. ప్రతిపక్షాల మాదిరి ఆలోచిస్తే రామ మందిరం వివాదం ఇప్పటికీ కొనసాగేదన్నారు. సవాళ్లపై వెనకడుగు వేస్తే అలానే ఉండిపోతామన్నారు. మా ఐదేళ్ల పాలన మెచ్చి ప్రజలు మళ్లీ పట్టం కట్టారని ప్రధాని చెప్పారు.

13 కోట్ల పేదల ఇళ్లలో గ్యాస్ వెలుగులు నింపామని ప్రధాని మోడీ అన్నారు. ఐదేళ్లలో ఢిల్లీని ఈశాన్య ప్రజలకు చేరువ చేశామన్నారు. ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. చాలా కాలంగా దేశాన్ని సమస్యలు వేధిస్తున్నాయన్న ప్రధాని మోడీ.. వాటికి పరిష్కారాలను చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్ బాటలో వెళ్లి ఉంటే ట్రిపుల్ తలాక్ కొనసాగేదన్నారు ప్రధాని మోడీ.

Categories
National

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాజీ సీఎం

దేశంలో అత్యంత చిన్నవయస్సులో సీఎంగా పనిచేసిన ఈ మాజీ సీఎం ను గుర్తుపట్టారా అంటూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుబురు గడ్డం,ముడతల కళ్లు,వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్న ముఖం,నిరాశతో కూడిన ఓ నవ్వు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఫోటో.

ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో స్మార్ట్‌గా కనిపించే ఒమర్ అబ్దుల్లా.. ఇలా గుర్తుపట్టరాకుండా మారిపోయాడా..? అని చాలామంది నెటిజెన్స్ ఆయన ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు. నిర్బంధం కారణంగా ఆయన ముఖంలో వృద్దాప్య లక్షణాలు కనిపిస్తున్నాయని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఆర్నెళ్లుగా ఆయన నిర్బంధంలో ఉన్నప్పటికీ.. ఆ ఫోటోని చూస్తుంటే 30 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్నట్టు అనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు.

ఒమర్‌ అబ్దుల్లా ఫోటోపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా  ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన వైరల్ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆమె.. ఒమర్ అబ్దుల్లాను తొలుత చూడగానే తాను కూడా గుర్తుపట్టలేకపోయానన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు (గృహ నిర్బంధం) జరగడం దురుదృష్టకరమని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎప్పుడు ముగింపు పలకాలని ప్రశ్నించారు. ఒమర్‌ తాజా ఫోటోపై పీడీపీ నాయకురాలు,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహాబూబా ముఫ్తితో పాటు పలువురు విపక్ష నేతలూ స్పదించారు. ఆయన్ని ఇలా చూసి నివ్వెరపోయారని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్‌ 370)ని కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి కశ్మీర్‌ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్‌ కూడా ఉన్నారు. అప్పట్నుంచి గడ్డం తీయకపోవడంతో ఒమర్‌ ఇలా కొత్త వేషంలో కనిపించారు. అయితే ఆరునెలల నుంచి కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో ఇన్ని రోజులు ఈ ఫోటో బయటకు రాలేదు.

ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే నిర్బంధం నుంచి విముక్తి కలిగేంతవరకు అబ్దుల్లా గడ్డం తీయబోయరని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆయన 50వ వడిలోకి అడుగుపెట్టబోతున్నారు.

Categories
National Political

RSS ఇద్దరు పిల్లల ప్లాన్..జనాభాను నియంత్రించడానికంట

భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లల చట్టం తీసుకరావాలని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. కేవలం ప్రచారంపై ఆధారపడకుండా..చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం యూపీలో మొరదాబాద్‌లో సంఘ్ పరివార్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

ఇద్దరు పిల్లల నిబంధనపై చట్టం చేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని, దీనిపై మాత్రం కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జనాభా పెరగడం దేశానికి ఇబ్బందికరంగా మారిపోతోందని, మతాలకతీతంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ట్రస్టు ఏర్పాటైతే..సంఘ్ పరివార్ పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. పౌరసత్వ చట్ట సవరణకు ఆర్ఎస్ఎస్ మద్దతిస్తుందని, దీనిపై దేశ వ్యాప్తంగా చట్ట అవసరాన్ని సంఘ్ కార్యకర్తలు ప్రచారం చేయాలని సూచించారు. 

Read More : మోడీ, షా మధ్య విబేధాలున్నాయా – చత్తీస్ ఘడ్ సీఎం

Categories
National Political

కార్గిల్ లో 145 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుధ్దరణ

జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ లో ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుధ్దరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం  రద్దు చేసింది. దీంతో  ఆరోజు  నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. 

ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. 145 రోజుల తర్వాత కార్గిల్‌లో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గత నాలుగు నెలల నుంచి కార్గిల్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అయితే ఇంటర్నెట్‌ సేవలను దుర్వినియోగం చేసుకోవద్దని పలు మతాల పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

పరిస్థితులను బట్టి జమ్మూ రీజియన్‌తో పాటు కశ్మీర్‌ వ్యాలీలో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించనున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత, నాలుగు నెలలపాటు జమ్మూకశ్మీర్‌లో మోహరించిన 7 వేల కేంద్ర పారామిలటరీ బలగాలను ఇటీవలే కేంద్రం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 

కార్గిల్ లో బ్రాడ్ బ్యాండ్ సేవలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. లడఖ్ లోఇంటర్నెట్ సేవలు పునరుధ్దరించబడినప్పటికీ  కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు పూర్తిగా  పునరుధ్దరించబడతాయి అనే దానిపై స్పష్టత రాలేదు. అలాగే కాశ్మీర్ లోయలో అదుపులోకితీసుకున్ననాయకులను ఎప్పుడు విడుగదల చేస్తారో కూడా అర్ధంకాని పరిస్ధితి ఉంది. 

Categories
International National

‘Kalapani’ మాది : ఇండియా మ్యాప్ పై నేపాల్ అబ్జెక్షన్

కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం..జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం‌శాఖ ఇండియాకు సంబంధించిన కొత్త మ్యాప్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ మ్యాప్ విషయంలో నేపాల్ ప్రభత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
 
నేపాల్ దేశానికి చెందిన ‘Kalapani’ ప్రాంతం భారతదేశంలో ఉన్నట్లు కొత్త మ్యాప్‌ను రూపొందించారని ఆరోపించింది. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్యలు జరపుతామని కూడా ప్రకటించింది. అంతేకాదు..భారత్-నేపాల్ సరిహద్దులకు సంబంధించిన విషయాలపై కూడా భారత్ తో చర్చిస్తామని వెల్లడించింది. 

Kalapani నేపాల్ లో అంతర్భాగమని..ఈ విషయంలో భారత్ చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. ఖాట్మండు నుండి వస్తున్న పరిణామాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది. 

Categories
National

ప్రతిపక్షాలకు మోడీ సవాల్ : దమ్ము ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో పెట్టండి

జమ్మూకశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రతిపక్షాలు చేసిన కంప్లెయింట్ లపై ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ(అక్టోబర్-13,2019) సవాల్ చేశారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్నారు. ప్రతిపక్షాలకు దమ్ము ఉంటే ఖచ్చితమైన వైఖరి తీసుకుని ముందుకు రావాలని మోడీ సవాల్ విసిరారు.

మహారాష్ట్రలోని జల్ గాన్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రతిపక్షాలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడానికి ఎవరికైనా ధైర్యం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా ధైర్యం చేస్తే వారి రాజకీయ జీవితం మనుగడ సాగిస్తుందా? అని మోడీ అన్నారు. జమ్మూకశ్మీర్,లడఖ్ విషయంలో దమ్ము ఉంటే ప్రతిపక్షాలు తమ ప్రభుత్వం తొలగించిన ఆర్టికల్ 370,35A ని తిరిగి ప్రవేశపెడతామని తమ మేనిఫెస్టోలో ఉంచాలని తాను సవాల్ చేస్తున్నానని మోడీ అన్నారు. మోడీ వ్యాఖ్యలు మహారాష్ట్రలో ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ప్రత్యక్ష సవాల్ గా ఉన్నాయి. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు అక్టోబర్-21,2019న ఎన్నికలు జరనున్నాయి. అక్టోబర్-24,2019న ఫలితాలు వెలువడనున్నాయి.

ఈ ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ కు ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని మోడీ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ ని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లడఖ్ ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతగా  పునర్విభజించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్,ఏఐఏడీఎంకే,ఆర్జేడీ,పీడీపీ,ఎన్సీ తదితర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కశ్మీరీల మనోభావాలను గౌరవించకుండా మోడీ సర్కార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

Categories
National

ఆంక్షలు ఎత్తివేత…కశ్మీర్ కి టూరిస్టులకు రావచ్చు

గురువారం(సెప్టెంబర్-8,2019)నుంచి జమ్మూకశ్మీర్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తియేయనున్నారు. రెండు నెలలకు పైగా కశ్మీర్‌ లోయలో కొనసాగిన భద్రతాపరమైన ఆంక్షలను ఎత్తివేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులను సోమవారం ఆదేశించారు. కశ్మీర్‌ను పర్యాటకులు వీడాలని జారీ చేసిన ఆంక్షలను తక్షణం ఎత్తివేయాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నెల 10 నుంచి పర్యాటకులను కశ్మీర్ లోకి అనుమతించనున్నారు.  గవర్నర్ సలహాదారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇంతకుముందు ఉగ్ర ముప్పు ఉన్నందున పర్యాటకులు, అమర్‌నాథ్ యాత్ర భక్తులు సాధ్యమైనంత త్వరగా కశ్మీర్ లోయను వీడాలని ఈ ఏడాది ఆగస్టు 2న జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఆదేశించడం, ఆ తర్వాత ఆగస్టు ఐదో తేదీన ఆర్టికల్  370  రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగుతోంది.

అయితే కశ్మీర్ లో కర్ఫ్యూ కారణంగా సందర్శకుల సంఖ్య గణనీయంగా పడిపోవటం వలన తాముతీవ్రంగా దెబ్బతిన్నామని టూరిస్ట్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక సమాచారం ప్రకారం…ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 5 లక్షలకు పైగా ప్రజలు కశ్మీర్ లోయను సందర్శించారు. అంతేకాకుండా, ఉగ్రవాద హెచ్చరిక కారణంగా అమర్‌నాథ్ యాత్ర నిలిపివేయబడటానికి ముందు జూలైలో 3.4 లక్షల మంది యాత్రికులు కూడా వ్యాలీని సందర్శించారు.

Categories
Viral

నవరాత్రి వేడుకల్లో…సూరత్ మహిళల వినూత్న టాటూలు

తెలుగు రాష్ట్రాల్లో బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే పిల్లలు, మహిళలు ఈ వేడుకలను కొత్త బట్టలు, పిండి వంటలు, పూజలతో పండుగ జరుపుకుంటుంటే.. గుజరాత్‌లోని సూరత్‌ కు చెందిన మహిళలు మాత్రం ఈ నవరాత్రుల్ని కాస్త వింతగా జరుపుకుంటున్నారు. శరీరాలపై టాటూలను వేయించుకుంటున్నారు. అదేంటి అనుకుంటున్నారు.. అవునండి మీరు విన్నది నిజమే.

వివరాలు.. సూరత్ లోని మహిళలంతా పండుగ సందర్భంగా అక్కడి మహిళలంతా టాటులు వేసుకుంటున్నారు. ఒకరేమో చంద్రయాన్ 2 అని వేసుకుంటే, ఇంకొకరేమో మరో మహిళ జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ.. బిజెపి ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 ను రద్దు నిర్ణయాన్ని టాటూగా వేయించుకుంది. మరొకరేమో ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటూ.. ఈ మధ్యనే అమలైన ట్రాఫిక్ నిబంధనలను పచ్చబొట్టు వేయించుకుంటున్నారు.

ఇలా సూరత్ మహిళలంతా పండుగను మరింత స్పెషల్ గా చంద్రయాన్ -2 నుంచి ఆర్టికల్ 370 వరకు పలు అంశాలపై పచ్చబొట్లు వేయించుకుంటూ.. అందరికి మంచి విషయాలను తెలుపుతున్నారు.