Categories
National

ఆర్టికల్ 371ని కేంద్రం టచ్ చేయదు

ఆర్టికల్ 371రద్దుపై వస్తున్న ఊహాగానాలకు కేంద్రహోం మంత్రి అమిత్ షా చెక్ పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే ఆర్టికల్ 371ను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయదని అమిత్‌షా తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈశాన్య రాష్ట్రాల వంతు రాబోతోందంటూ కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. 

ఇవాళ(సెప్టెంబర్-8,2019) గౌహతిలో జరిగిన నార్త్ ఈస్ట్రన్ కౌన్సిల్(NEC) 68వ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన అమిత్ షా…ఆర్టికల్ 370,ఆర్టికల్ 371కి చాలా వ్యత్యాసం ఉన్నారు. ఆర్టికల్ 370 స్వభావరీత్యా తాత్కాలికమైనదని, 371 అనేది ప్రత్యేక ప్రొవిజన్ అని ఆయన అన్నారు.

బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 371ను గౌరవిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానిలో మార్చులు చేయమని చెప్పారు. ఆర్టికల్ 371ను రద్దు చేయమని పార్లమెంటులో కూడా చెప్పిన విషయాన్ని షా గుర్తుచేశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 మంది సీఎం సమక్షంలో ఇప్పుడు మరోసారి సృష్టం చేస్తున్నట్లు షా తెలిపారు.