Categories
Business Jobs

మైక్రోసాఫ్ట్ లో 1500 కొత్త ఉద్యోగాలు

ప్రపంచం మంతా కరోనా క్రైసిస్ తో వణుకుతుంటే  సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్ధ మైక్రోసాఫ్ట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.  ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌, క్లౌడ్ స్పేస్ ల‌లో 1500 కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు సంస్ధ ప్ర‌ణాళిక‌లు ర‌ూపోందిస్తోంది.  ఇందుకోసం 75 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డితో 523,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాల‌యం రూపుదిద్దుకోనున్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. 

వచ్చే ఏడాదికల్లా అట్లాంటాలో మైక్రోసాఫ్ట్ కార్యాల‌యం సిధ్దం కానుంది. జార్జియాలో మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గ‌జం పెట్టుబ‌డులు పెట్ట‌డంపై ఆ రాష్ర్ట గవ‌ర్న‌ర్ బ్రియ‌న్ పి. కెంప్ ఆనందం వ్య‌క్తం చేశారు. దీని ద్వారా కంపెనీకి, రాష్ర్టానికి ఇరువురికి ప్ర‌యోజ‌నం చేకూరుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

అట్లాంటాలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ప‌ట్ల మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ టెర్రెల్ కాక్స్ మాట్లాడుతూ..”టెక్ కంపెనీ సంస్థ‌ల‌కు కేంద్ర‌మైన అట్లాంటాలో మేము పెట్టుబ‌డులు పెట్ట‌డం ఆనందంగా ఉంది. దీని ద్వారా ఇత‌ర ప్రాంతాల‌కు మా ఉనికి విస్త‌రించ‌డానికి అవ‌కాశం ఉంది. మేం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల సంస్థ‌కి   సాంకేతికంగా, ఆర్థికంగా మ‌రింత లాభం చేకూరుతుంది” అని టెర్రెల్ కాక్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక క‌రోనా క్రైసిస్‌లోనూ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ మూడ‌వ త్రైమాసికంలో భారీ లాభాల‌ను, ఆదాయాన్ని సాధించిన‌ట్లు సంస్థ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Categories
National

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై బిల్ గేట్స్, ఎలొన్ మస్క్ సూచించిన బుక్స్

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి తెలుసుకోవాలి. ప్రస్తుతమున్న టెక్నికల్ యుగంలో తాము హవా కొనసాగించాలి. ఎంతో కొంత ప్రత్యేకత చూపించుకోవాలి అని తపన పడుతుంది యువత. అలాంటి వారికోసం సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్ గేట్స్, ఎలొన్ మస్క్ కొన్ని పుస్తకాలు సూచిస్తున్నారు. బిల్ గేట్స్ లాంటి వ్యక్తి సూచించిన బుక్స్ లో సమాచారం ఏ పాటి ఉంటుందో అనే ఆసక్తి ఉండటం సహజమే. వారి కోసమే ఈ టాప్ 10 బుక్స్..

సూపర్ ఇంటిలిజెన్స్: మార్గాలు, ప్రమాదాలు, అంచనాలు
అమెజాన్ రివ్యూ సెక్షన్‌లో ఈ పుస్తకానికి బిల్ గేట్స్ అత్యుత్తమ రివ్యూ రాశారు. ‘నేను ఈ పుస్తకాన్ని అత్యధికంగా రికమెండ్ చేస్తాను’ అని పేర్కొన్నారు. 
 టెస్లా కంపెనీ యజమాని ఎలొన్ మస్క్ రాసిన రివ్యూలో బొస్ట్రమ్ రాసిన సూపర్ ఇంటలిజెన్స్ పుస్తకం విలువైనదని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అగ్ని శిఖలం కంటే ప్రమాదకరమైనది. అని రాసుకొచ్చారు. 

Top 10 Books on AI recommended

ద సింగ్యులారిటీ ఈజ్ నియర్: మనుషులు బయాలజీలోకి రూపాంతరం చెందితే

రే కుర్జ్‌వీల్ ఈ పుస్తకంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ భవిష్యత్ లో ఎలా ఉండబోతుందనేది స్పష్టంగా వివరించారు. మానవత్వం బయాలజీలోకి రూపాంతరం చెందితే మనుగడ ఎలా ఉంటుందనేది ఇందులో వివరించారు. 

Top 10 Books on AI recommended

 

లైఫ్ 3.0: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కాలంలో మనిషిగా బతకడమెలా:

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది. ఇటువంటి కాలంలో మనుషులుగా బతకడమెలా అని తెలియజేయడంతో పాటు.. లైఫ్ 3.0ప్రమాదకరమైన బేస్ లైన్‌తో సబ్జెక్ట్ పై చక్కటి పరిజ్ఞానం పెంచేదిలా ఉంది. 

Top 10 Books on AI recommended

సింగులారిటీ రైజింగ్: స్మార్ట్‌, రిచ్‌, ప్రమాదకరమైన ప్రపంచాన్ని తట్టుకుని బతకడమెలా
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై ముందు చూపు, రాబోయే మూడు దశాబ్దాల్లో రాబోయే టెక్నాలజీ సమస్యలను జేమ్స్. డి మిల్లర్ స్పష్టంగా తెలియజేశారు. 

Top 10 Books on AI recommended

ద సెకండ్ మెషీన్ ఏజ్: చురుకైన టెక్నాలజీ సమయంలో పని, పురోగతి, సంపద 
డిజిటల్ టెక్నాలజీ ఆర్థిక సంపదగా ఎలా మార్చుకోవచ్చు. చిత్ర విచిత్రమైన ప్రపంచంలో టెక్నాలజీతో బతికేస్తున్న వారి గురించి క్లియర్‌గా చెబుతుంది.  

Top 10 Books on AI recommended

మెషీన్, ప్లాట్‌ఫాం, క్రౌడ్: డిజిటల్ ఫ్యూచర్‌పై విహారం
టెక్నాలజీలో ఇదో కొత్త తరం. నెట్‌వర్క్‌డ్ రంగంలో కొత్త అధ్యాయం గురించి చెబుతుంది. కంపెనీలు, ప్రభుత్వాలు ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్నాయని పుస్తకం వెల్లడించింది. 

Top 10 Books on AI recommended

ఆర్టిఫిషియల్ ఇంటిజెన్స్ సూపర్ పవర్స్: చైనా, సిలికాన్ లోయతో పాటు కొత్త ప్రపంచ ఆదేశం
భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సామాజిక తిరుగుబాటు అంశాల గురించి మానవ మేదస్సు ఎలా స్పందిస్తుందనేది ఈ పుస్తక సారాంశం.

Top 10 Books on AI recommended

ద సెంటియెంట్ మెషీన్: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రాబోయేతరం

ఈ పుస్తకం చదవితే అసలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే ఏంటి. ఎక్కడ వాడాలి. అనేది అర్థం కావడమే కాకుండా నేటి మార్కెట్‌లో ఎలా ఇమిడిపోవాలనేది తెలుస్తుంది. 

Top 10 Books on AI recommended

అవర్ ఫైనల్ ఇన్వెన్షన్: మానవ అధ్యాయం చివరి దశ మరియు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్

Top 10 Books on AI recommended

ఆర్మీ ఆఫ్ నన్: భవిష్యత్ యుద్ధంపై స్వాయుధాలు

 

Top 10 Books on AI recommended

 

Categories
Education and Job

CBSE విద్యార్థులకు మూడు కొత్త సబ్జెక్టులు

CBSE విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి పాఠ్యాంశాల జాబితాలో మూడు కొత్త సబ్జెక్టులు వచ్చి చేరనున్నాయి. CBSE పాఠశాలల బోధన ప్రణాళికలో కృత్రిమ మేధ, యోగ, చిన్నారుల సంరక్షణ విద్యను పాఠ్యాంశాలుగా బోధించనున్నారు. ఈ మూడు కూడా విద్యలో భాగం కానున్నాయి. ఇటీవల CBSE బోర్డు నిర్వహించిన సమావేశంలో ఈ మూడు సబ్జెక్టులను CBSEలో కొత్తగా చేర్చనున్నట్లు నిర్ణయించిందని CBSE ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2019-20 విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి విద్యార్థులకు 6వ సబ్జెక్టుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌(AI)ను ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు.

CBSEలో ఉన్న నిబంధనల ప్రకారం విద్యార్థులకు ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొనే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రస్తుత ఐదు తప్పనిసరి పాఠ్యాంశాలకు ఈ రెండింటిలో ఒకటి అదనపు పాఠ్యాంశం అవుతుంది. 6వ సబ్జెక్టుగా విద్యార్థి నైపుణ్యాన్ని తీర్చిదిద్దే ఏ సబ్జెక్టునైనా ఎంచుకోవచ్చు. మిగిలిన వాటిలాగే ఆ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలూ రాయాల్సి ఉంటుంది.

మరోవైపు పదోతరగతి విద్యార్థులు సైతం బోర్డు పరీక్షల కోసం ఇప్పుడున్న 5 ప్రధాన సబ్జెక్టులకు అదనంగా కొత్తగా ఒక ఆప్షనల్‌ సబ్జెక్టును ఎంచుకోవాలని కొద్దిరోజుల క్రితం CBSE కోరిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఏదైనా ఓ ప్రధాన సబ్జెక్టులో విద్యార్ధి ఫెయిలైతే, దానికి బదులు అతడికి ఆప్షనల్‌ సబ్జెక్టులో వచ్చిన పాస్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. గతంలోలాగే ఫెయిలైన సబ్జెక్టుకు సప్లిమెంటరీ రాసే అవకాశం ఉంటుంది. ఆసక్తిగల విద్యాసంస్థలు మార్చి31లోగా దరఖాస్తులు ఇవ్వాలని CBSE కోరింది.

Categories
National

‘ఏఐ’ బాటలో బ్యాంకులు : చిటికెలో సర్వీసులు!

ఢిల్లీ : టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ హవా నడుస్తోంది. బ్యాంకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో కస్టమర్లకు చిటికెలో సర్వీసులను అందించాలని ప్రయత్నిస్తున్నాయి. చాట్‌బాట్స్, వాయిస్‌బాట్స్ ద్వారా సత్వర సేవలను అందించేందుకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ రంగ బ్యాంకులే దూసుకుపోతున్నాయి. 
 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యస్‌ బ్యాంకులు వంటి ప్రయివేటు బ్యాంకులు తమ కస్టమర్ల సేవలకు చాట్‌బాట్స్, వాయిస్‌ బాట్స్‌ను వినియోగించుకుంటున్నాయి. ఏడాదిన్నర క్రితమే బాట్స్‌ వినియోగాన్ని ప్రారంభించామని..ఇప్పటి వరకు 80 లక్షల విచారణలను పూర్తి చేశామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్‌ హెడ్‌ నితిత్‌చుగ్‌ తెలిపారు. బ్యాంకింగ్‌ సేవలే కాక చాట్‌బాట్‌ అప్లికేషన్‌ ‘ఎవ’ ద్వారా బిల్లుల పేమెంట్స్..సినిమా టికెట్స్ బుకింగ్..ఇతర సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

2018 ఫిబ్రవరిలో చాట్ బాట్ సేవలు ప్రారంభించామని, 16 లక్షల ప్రశ్నలకు చాట్‌బాట్‌ సమాధానాలు ఇచ్చినట్టు కోటక్‌ మహీంద్రా బ్యాంకు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ కపూర్‌ తెలిపారు. 

ఆటోమేషన్ మార్గంలో ఎస్‌బీఐ
ఇక దేశీ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ కూడా ఆటోమేషన్ మార్గంలోకి వస్తోంది. సియా రూపంలో చాట్‌బాట్ సేవలు ప్రారంభించగా..బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు ఇతర ప్రభుత్వ బ్యాంకులు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.

బెనిఫిట్స్ ఇలా 
కాగా బ్యాంకింగ్ వ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వల్ల సేవలు సులభతరం అవుతున్నాయి. బ్యాంకుల వ్యయాలు కూడా దిగివస్తాయి. అయితే అదేసమయంలో ఉద్యోగాల తగ్గింపు కూడా ఉంటుంది.

Categories
Education and Job

ఇండియా ఫస్ట్: ఐఐటీ హైదరాబాద్.. ఏఐలో బీటెక్ కోర్సు 

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ పూర్తిస్థాయిలో బిటెక్ ప్రొగ్రామ్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే అకాడమిక్ (2019-2020) నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో బీటెక్ ప్రొగ్రామ్స్ ను పూర్తిస్థాయిలో తీసుకరానున్నట్టు వెల్లడించింది.

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ పూర్తిస్థాయిలో బిటెక్ ప్రొగ్రామ్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే అకాడమిక్ (2019-2020) నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మిషన్ లెర్నింగ్ విభాగంలో బీటెక్ ప్రొగ్రామ్స్ ను పూర్తిస్థాయిలో తీసుకరానుంది. ఏఐలో పూర్తిస్థాయి బీటెక్ ప్రొగ్రామ్ ను ప్రవేశపెట్టనున్న తొలి భారతీయ విద్యాసంస్థగా ఐఐటీ హైదరాబాద్ రికార్డులెక్కనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా యూఎస్ తరువాత మూడో విద్యాసంస్థగా ఐఐటీ హైదరాబాద్ అవతరించనుంది. 

తొలుత బీటెక్ కోర్సులో 20 మంది విద్యార్థులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బీటెక్ కోర్సుకు అర్హత సాధించాలంటే ముందుగా జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష ద్వారా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ ఏఐ మిషన్ లెర్నింగ్ విభాగంలో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. ఇప్పటికే యూఎస్ లో మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), కార్నెజీ మెలాన్ యూనివర్శిటీ (సీఎంయూ) వంటి టెక్నాలజీ, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో పూర్తిస్థాయి బీటెక్ ప్రొగ్రామ్ అందుబాటులో ఉన్నట్టు ఓ అధికారిక ప్రకటనలో వెల్లడైంది.