Categories
National Technology

సరికొత్త ఆవిష్కరణ : కృత్రిమ మానవులు

అచ్చం మనష్లుల్లానే మాట్లాడుతాయి..సాటి వారిపై సానుభూతి కూడా చూపిస్తాయి. కానీ మనుషులు కాదు..వారే కృతిమ మానవులు. అవును నిజం. టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. అందులో భాగంగా కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చేస్తున్నాయి. శామ్ సంగ్ ల్యాబ్స్ నియాన్ పేరిట కొత్తది సృష్టించింది.

 

అచ్చం మనుషుల్లాగే మాట్లాడగలిగే ఉన్న ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ డిజిటల్ రూపాలు మాట్లాడుతాయని కంపెనీ వెల్లడించింది. నియాన్లు మన ఫ్రెండ్స్ అని, అంతేగాకుండా సహచరులని వ్యాఖ్యానించారు. ల్యాబ్స్ ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ప్రణవ్ మిస్త్రీ. 

లాస్ వెగాస్‌లో 2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో ప్రారంభమైంది. ఈ సందర్భంగా శామ్ సంగ్ యూనిట్ స్టార్ ల్యాబ్స్‌లో ఉత్పత్తి చేసిన నియాన్ వివరాలను కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. పరస్పర చర్యల వల్ల జ్ఞాపకాలు ఏర్పడడమే కాకుండా పదిలంగా ఉంటాయని,  న్యూరల్ నెట్ వర్క్‌లు, కంప్యూటేషనల్ రియాల్టీతో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో నియాన్లను సృష్టించడం జరిగిందని తెలిపారు. 

 

ఇదిలా ఉంటే..దీనిపై కొందరు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. నియాన్‌లో చెప్పుకోదగిన రహస్యం ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. అంతర్లీనంగా వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏఐతో రూపొందిన ఒక డిజిటల్ అవతారమంటున్నారు. ఇప్పటికే ఉన్న కృతిమ మనిషిరి ‘సిరి’లాగే ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

Read More : యుద్ధ మేఘాలు : పెట్రోల్ దాచుకోవాల్సిందేనా!

Categories
National Technology

‘ఆటోమేషన్‌’తో ఉద్యోగాలకు ఎసరు

ఢిల్లీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు మారిపోతోంది. ఆయా రంగాల్లో మానవ వనరులు తక్కువై పోతున్నాయి. హై టెక్నాలజీ ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని అంచనా. యాస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ -2018 పేరిట ఓ నివేదిక రూపొందించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్‌దేనని వెల్లడించింది. 

ఆటో మెషిన్ కారణంగా ఢిల్లీలో అత్యధికంగా 45.1 శాతం, తెలంగాణలో 37.5 శాతం, ఏపీలో 37.2 శాతం ఉద్యోగాలు పోయాయని నివేదిక పేర్కొంది. ఏఐ, రోబోటిక్స్‌తో నూతన శకం రాబోతోందని అంచనా వేసింది. ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో సుమారు 42 శాతం ఆటోమేషిన్ ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది. సివిల్, మెకానికల్ వంటి సబ్జెక్టుల కోర్ ఇంజినీరింగ్ చదివిన వారికి 7 శాతమే జాబ్స్ లభిస్తాయని నివేదిక వెల్లడించింది. లేబర్ మార్కెట్‌లోని 30 రకాల ఉద్యోగాల్లో మానవ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంటుందని, బిజినెస్ అభివృద్ధి, ఆదాయ వృద్ధిలో, సేల్స్ రంగంలో 12 శాతం ఉద్యోగాలు లభిస్తాయని నివేదిక అంచనా వేసింది. కస్టమర్ సర్వీస్‌లో ఆటో మెషిన్ పాత్ర మరింత పెగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2020 నాటికి 85 శాతం మేర ఆటోమేషిన్ ప్రక్రియ ద్వారానే కస్టమర్ ఇంటరాక్షన్ జరుగుతుందని వెల్లడించింది. అకౌంటింగ్స్, బ్యాంకింగ్ రంగాల్లో మరింత ఈ విధానం మరింత పెరుగుతుందని తెలిపింది.