Categories
National Viral

అమ్మకు బొమ్మ రూపంలో నివాళి అర్పించిన ఆర్టిస్ట్..ఎంత అద్భుతంగా ఉందో చూడండీ

అమ్మపై అపారమైన ప్రేమ ఉన్న ఓ ఆర్టిస్ట్ తన అమ్మకు బొమ్మ రూపంలో ఘనమైన నివాళి అర్పించాడు. తల్లి వంటగదిలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా  బొమ్మను మట్టితో ఎంతో చక్కగా మలిచాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి ప్రయత్నంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అమ్మ బిడ్డలపై చూపే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. దానికి ఏ భాషలోను ఉన్న అక్షరాలు సరిపోవు. తల్లీ బిడ్డల  ప్రేమకు  మించినది  ఏదీ  ఉండదు.  పిల్లల  గురించి  తల్లికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పిల్లలకు ఏమి ఇష్టమో.. వారికి కష్టమొస్తే ఎలా బుజ్జగించాలో కూడా ఆ తల్లికే తెలుసు. అటువంటి తల్లికి హృదయాలను దోచుకునే నివాళి అర్పించిన ఈ అద్భుత కళాకారుడికి కచ్చితంగా హ్యాట్పాఫ్ చెప్పాల్సిందే. 

Read: లోషన్ ఆర్డర్ చేస్తే…రూ. 19 వేల ఇయర్ బడ్స్ డెలివరీ