Categories
International Viral

వరల్డ్ రికార్డ్ : రూ.177 కోట్లు పలికిన కార్టూన్

అది ఓ కార్టూన్. అందులో ఓ అమ్మాయి సీరియస్ గా చూస్తున్నట్టుగా ఉంది. ఇందులో పెద్ద వింతేముంది అని అనిపించొచ్చు. కానీ.. విషయం తెలిస్తే షాక్ తింటారు. ఈ కార్టూన్ రికార్డ్

అది ఓ కార్టూన్. అందులో ఓ అమ్మాయి సీరియస్ గా చూస్తున్నట్టుగా ఉంది. ఇందులో పెద్ద వింతేముంది అని అనిపించొచ్చు. కానీ.. విషయం తెలిస్తే షాక్ తింటారు. ఈ కార్టూన్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. వేలంలో ఏకంగా రూ.177 కోట్లు పలికింది. ఓ జపనీస్ ఆర్టిస్ట్ ఈ కార్టూన్ వేశాడు. హాంగ్ కాంగ్ లో వేలం వేశారు. వేలం పాట ప్రారంభించిన 10 నిమిషాల్లోనే కార్టూన్ అమ్మడుపోవడం విశేషం. 2000 సంవత్సరంలో జపాన్ ఆర్టిస్ట్ నారా ఈ కార్టూన్ వేశాడు.

హాంగ్‌ కాంగ్‌ ఆందోళనలతో అట్టుడుకుతోంది. హాంగ్ కాంగ్ నుండి ‘నేరస్తుల’ను చైనాకు అప్పగించేందుకు ఉద్దేశించిన ముసాయిదా చట్టంపై నిరసన తెలుపుతున్నారు. ఈ చట్టంలో లోపాలు ఉన్నాయని ఆందోళనకారులు చెబుతున్నారు. పోలీసు, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హాంగ్ కాంగ్ న్యాయ వ్యవస్థ, స్వాతంత్ర్యం ఇంకా తరిగిపోతుందని వాదిస్తున్నారు. ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు. టియర్‌ గ్యాస్‌, రబ్బర్ బుల్లెట్లు, వాటర్‌ కెనన్లను ప్రయోగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.