Categories
International National

ట్రంప్ కోసం బియ్యం గింజల ఆర్టిస్టు స్పెషల్ గిఫ్ట్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. పర్యటన సందర్భంగా బియ్యం గింజల ఆర్టిస్టు వెంకటేశ్ శ్యానువోగ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. సోమవారం నుంచి రెండు రోజులు పర్యటనలో ఉండనున్న ట్రంప్‌కు వందల్లో బహుమతులు రావడం సహజమే. వాటన్నిటి కంటే భిన్నంగా ఉండేలా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 3సైజ్ పేపర్ మీద.. బియ్యం గింజలతో ఆర్ట్ వర్క్ 5వేల బియ్యం గింజలతో తయారుచేసి ట్రంప్-మోడీ కలిసి ఉన్నట్లుగా ఫొటోను ఇవ్వనున్నాడట. 

గతంలో ఏ లీడర్‌కు ఇలాంటి ఆర్ట్ వర్క్ ఇవ్వలేదు. అందుకే అమెరికా ప్రెసిడెంట్ ఇది ఇద్దామనుకుంటున్నా. కుదిరితే పర్సనల్ గా కలిసి ట్రంప్ కు అందచేద్దామని.. లేనిపక్షంలో యూఎస్ ఎన్వాయ్‌కు ఇస్తానని అనుకుంటున్నాడట. ఒక్కడే చేయాల్సి వస్తే 15నుంచి 20రోజుల సమయం పడుతుందని.. గ్రూపు సహకారంతో 2రోజుల్లో పూర్తి చేసేయగలనని అంటున్నాడు. 

కాఫీ గింజల వ్యాపారి అయిన వెంకటేశ్.. తనకున్న పాషన్ మేరకే బియ్యం గింజల ఆర్టిస్టుగా మారాడు. కొన్నేళ్ల నుంచి ఇదే పనిలో ఉన్న ఈయన ఒక్క గింజపై 578అంశాలను ప్రస్తావించగలడు. 

సోమవారం భారీ ఆశలతో ట్రంప్ భారత్‌కు రానున్నారు. పది మిలియన్ ప్రజలతో సభ ఏర్పాటు చేస్తానని మోడీ మాటిచ్చారని దాని కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నట్లు పలుమార్లు చెబుతూనే ఉన్నారు. ఆయన రాకకోసమే మోటేరా క్రికెట్ స్టేడియంను సిద్ధం చేసిన మోడీ అక్కడా లక్ష మంది ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది. 

Categories
National

బడ్జెట్ కవర్ పై గాంధీ హత్య ఫొటో….కేంద్రంపై కేరళ డైరక్ట్ ఎటాక్

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ 2020-21 బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. బడ్జెట్‌ కవర్ పేజీపై మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన చిత్రాన్ని ముద్రించారు. దీంతో ఈ బడ్జెట్ తీవ్ర రాజకీయ దుమారం రేపింది.

అయితే  ఇది పూర్తిగా రాజకీయపరమైన ప్రకటనేనని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి చెప్పారు. మహాత్మా గాంధీ హత్య దృశ్యాన్ని ఓ మళయాళ ఆర్టిస్ట్ చిత్రించారని, దానిని కవర్ పేజీపై ముద్రించామని చెప్పారు. మలయాళం ఆర్టిస్టు వేసిన ఈ చిత్రంలో బుల్లెట్‌ గాయాల కారణంగా బాపు రక్తపు మడుగులో పడిఉన్నారు. మద్దతుదారులు ఆయన చుట్టూ చేరి రోదిస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ….మహాత్మా గాంధీని ఎవరు బలితీసుకున్నారనేది తాము మరిచిపోలేదని చాటేందుకు ఇది తాము పంపిన సంకేతమని స్పష్టం చేశారు.

మహాత్మా గాంధీ హిందూ మతవాదుల చేతుల్లో హత్య చేయబడ్డారని,అలాంటి హిందూ మతవాదులను ఇవాళ బీజేపీ,కేంద్రప్రభుత్వం చేత గౌరవించబడుతున్నారన్నారు. చరిత్రను తిరగరాస్తున్నారని, జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ)ని దేశాన్ని మతపరంగా విభజించేందుకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. చరిత్రను తిరగరాస్తున్న సమయంలో ఇటువంటివి చాలా ముఖ్యమని చెప్పారు.

కొన్ని ప్రసిద్ధ గుర్తులను చెరిపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేరళ సమైక్యంగా నిలుస్తుందన్నారు. ప్రజలు మరచిపోని సంఘటనను సీపీఐ(ఎం)-ఎల్‌డీఎఫ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మరొకసారి దేశ ప్రజలకు సందేశం పంపదలచిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేరళకు నిధులను మంజూరు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన మండిపడ్డారు.

మోడీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను కేరళ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమంటూ,కేంద్రం ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం కూడా పాస్ చేసింది. కేరళ సీఏఏ వ్యతిరేక తీర్మాణం చేసిన అనంతరం మరికొన్ని రాష్ట్రాలు కూడా కేరళ తరహాలో సీఏఏ వ్యతిరేక తీర్మాణాలు పాస్ చేశాయి.

Categories
International Viral

ఏం టాలెంట్ గురూ : పవర్ ఔట్ లెట్ లో టీవీ, కంప్యూటర్, ఫ్రిడ్జ్

జపనీస్ ఆర్టిస్ట్ మోజూ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ అయ్యాడు. అతడి టాలెంట్ కు జనాలు నీరాజనం పడుతున్నారు. ఏం టాలెంట్ గురూ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

జపనీస్ ఆర్టిస్ట్ మోజూ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ అయ్యాడు. అతడి టాలెంట్ కు జనాలు నీరాజనం పడుతున్నారు. ఏం టాలెంట్ గురూ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కుర్రాడి ప్రతిభకు ఫిదా అవుతున్నారు. జస్ట్ 21 ఏళ్లకే.. చెయ్యి తిరిగిన కళాకారుడిగా గుర్తింపు పొందాడు. మోజూ మినియేచర్ క్రియేషన్ నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా మోజూ తయారు చేసిన ఓ మాస్టర్ పీస్.. అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఓ పవర్ ఔట్ లో మినీ రూమ్ ని తయారు చేశాడు. అందులో ఫ్రిడ్జ్, టీవీ, కంప్యూటర్, వైఫై రూటర్.. ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు మోజూ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఏం టాలెంట్ గురూ అని కితాబిస్తున్నారు.

అసలు.. పవర్ ఔట్ లెట్.. వేలంత ఉంటుంది. అందులో మినీ రూమ్ ను ఏర్పాటు చేయడం నిజంగా అద్భుతం అంటున్నారు. మోజూ కళకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మోజూ టాలెంట్ ఏంటో తెలియాలంటే.. ఈ వీడియోనూ చూడాల్సిందే. అప్పుడు మీరు కూడా.. ఏం ఆర్టిస్ట్ గురూ అనకుండా ఉండలేరు.

Categories
National

దీపోత్సవ వేడుకల్లో అయోధ్య :ఆకట్టుకుంటున్న కళాకారులు 

దీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించి అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.  శ్రీరాముడు 14 సంవత్సారల వనవాసం ముగించుకుని సీతా సమేతుడై అయోధ్యకు వచ్చి  పట్టాభిషిక్తుడు అయిన శుభ వేడుక సందర్భంగా అయోధ్య వాసులంతా దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేసుకున్నారనీ పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం యోగీ ప్రభుత్వం చేపట్టింది. ఐదు రోజుల పాటు యూపీ వాసులంతా దీపావళి వేడుకలు జరుపుకుంటారు. 

ఈ దీపోతవ్సం గురించి అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే వేద ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ..అయోధ్య పర్యాటక రంగం పెంపొందించడానికి దీపావళి పండుగ సందర్భం మంచి అవకాశమని అన్నారు. అక్టోబర్ 26 శనివారం సాయంత్రం  5.50 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగిస్తారని తెలిపారు. ఈ దీపోత్సవానికి ప్రభుత్వం రూ.130 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. దీపోత్సవ్ వెనుక ఉన్న దృష్టి ఆధ్యాత్మికం మాత్రమే కాదు..పర్యాటకాన్ని కూడా పెంచుతుందని గుప్తా అన్నారు.  

14 సంవత్సరాల వనవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడాన్ని సూచిస్తున్న సందర్భంగా  ఐదు రోజుల పాటు దీపావళి పండుగకు విస్తృతమైన ప్రణాళికలు చేసింది. ఈ ఉత్సవాన్ని తిలకించటానికి భక్తులు భారీగా తరలిరానున్నారని దీని కోసం తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వేడుకల్లో వేలాదిమంది కళాకారులు పాల్గొన్నారు. పలు విధాల కళలను ప్రదర్శించి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. రకాల వేషధారణలతో ఆట పాటలతో అలరిస్తున్నారు. 

Categories
Hyderabad

మౌలాలిలో అంత్యక్రియలు, ఫిల్మ్ ఛాంబర్ కు భౌతికకాయం

వేణు మాధవ్ ఈ పేరు వినగానే తెలుగు సినిమాల్లో మనకు గుర్తుకు వచ్చే పేరు బాలు..నల్లబాలు.. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్ సంబంధ వ్యాధితో బాధపడుతూ, సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 25, బుధవారం మధ్యాహ్నం 12.21 నిమిషాలకు మరణించారు. ఆయన అంత్యక్రియలు  గురువారం మౌలాలి లోని ఆయన ఎస్టేట్ లోనే నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ ప్రముఖుల సందర్శనార్ధం వేణుమాధవ్ భౌతిక కాయాన్ని గురువారం సెప్టెంబర్26 మధ్యాహ్నం 12 గంటలకు ఫిలిం ఛాంబర్ కు తరలించనున్నారు. 

వేణుమాధవ్ చదువుకునే రోజుల్లో మిమిక్రీ చేసేవాడు. అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు వేణుమాధవ్‌ చేసిన వెంట్రిలాక్విజమ్ ప్రోగ్రామ్  చూసి  భువనగిరిలో  జరుగుతున్న టీడీపీ సమావేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మహానాడులో ఆయన ప్రదర్శన ఇచ్చారు.  అది ఎన్టీఆర్‌కు నచ్చటంతో ‘మీ సేవలు మాకెంతో అవసరం బ్రదర్’ అంటూ వేణుమాధవ్‌కు మొదట హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీసులోఉద్యోగం ఇచ్చారు. అనంతరం టీడీఎల్పీ ఆఫీసులోనూ, నాచారం ఆశ్రమంలోనూ, ఎన్టీఆర్ ట్రస్టుభవన్ లోనూ వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం ఎస్వీ కృష్టారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి దాదాపు 600 పైగా చిత్రాల్లో నటించారు. 

‘గోకులంలో సీత’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘యువరాజు’ వంటి సినిమాలతో టాలీవుడ్‌‌లో టాప్ కమెడియన్‌‌గా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ అందరితోనూ నటించారు. ‘వెంకీ’, ‘దిల్’, ‘లక్ష్మీ’, సై, ‘ఛత్రపతి’, ‘జై చిరంజీవ’, ‘పోకిరి’,  ‘కృష్ణ’, ‘సింహా’, ‘బృందావనం’, ‘కిక్’, ‘రచ్చ’ వంటి పలు సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు వేణు మాధవ్. ‘నల్లబాలు నల్లతాచు లెక్క’, ‘సనత్ నగర్ సత్తి’, ‘టైగర్ సత్తి’.. ఇలా ఎన్నో క్యారెక్టర్స్‌ని తన స్టైల్ కామెడీతో పండించారాయన. ‘హంగామా’, ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ సినిమాల్లో హీరోగా నటించారు. ప్రేమాభిషేకం చిత్రంతో నిర్మాతగా మారారు. మిమిక్రీ కళాకారుడిగా, బుల్లితెర వాఖ్యాతగా, హాస్యనటుడిగా, హీరోగా,నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమలో పలు విభిన్నమైన పాత్రలు పోషించిన వేణు మాధవ్..భౌతికంగా మన మధ్య లేకపోయినా తను పోషించిన పలు పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎల్లప్పుడూ నవ్విస్తూనే ఉంటారు.

Categories
Crime

టీడీపీ పెయిడ్ ఆర్టిస్టు శేఖర్ అరెస్టు 

విజయవాడ: వరద సహాయక  చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని  ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం వేయటంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యాడ్ ఫిల్మ్‌లో నటించిన నటుడు శేఖర్‌ ని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే పెయిడ్‌ పబ్లిసిటీలో ఇతడు కీలకంగా వ్యవహరించాడు. వరద సమయంలో రైతు వేషం కట్టి తానే ఒక రైతును అని ప్రజలను నమ్మించడం ద్వారా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న భావన కలిగించేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నటించాడు. కుడితిపూడి శేఖర్ తన తప్పులను ఒప్పుకున్నాడని  పోలీసులు చెబుతున్నారు. తనతో పాటు ప్రభుత్వంపై బురద జల్లేందుకు పలువురిని టీడీపీ ఉపయోగిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. 

శేఖర్‌ ప్రభుత్వాన్ని తిట్టిన వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వైసీపీ కార్యకర్తలు పలు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.  శేఖర్‌ చేసిన వీడియోపై తాజాగా ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ దేవేంద్రరెడ్డి గుర్రంపాటి  గురువారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేసారు. మరోవైపు గుంటూరు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో  శేఖర్ పై ఫిర్యాదు చేశారు.

శేఖర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వరదలపై ప్రభుత్వాన్ని నిందిస్తూ వీడియో తీసింది ఎవరు.. స్క్రిప్ట్‌ రాసింది ఎవరు… అన్న అంశాలపై  పోలీసులు అత్యంత గోప్యంగా  విచారణ జరుపుతున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ చిత్రీకరించిన పలు యాడ్స్‌లో శేఖర్‌ నటించాడు. వివిధ వర్గాల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులే ప్రభుత్వాన్ని తిట్టిపోసి, ఆ వీడియోలను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రను అతడు బయటపెట్టినట్టు తెలుస్తోంది.

tdp paid artist sekhar chowdary arrest