Categories
National

ఈ బామ్మే అందరికి ఆదర్శం : వయస్సు 102.. ఓటు 18 సార్లు

ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని ఎన్నికల సంఘం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. కానీ, కొందరు మాత్రం.. ఓటు వేసే అవకాశం ఉండి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు.

ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని ఎన్నికల సంఘం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. కానీ, కొందరు మాత్రం.. ఓటు వేసే అవకాశం ఉండి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. నేటి తరానికి ఆదర్శంగా 2019లో లోక్ సభ ఎన్నికల్లో కూడా 102ఏళ్ల బామ్మ ఓటేసింది.

తమిళనాడులోని ఎరోడ్ లోక్ సభ స్థానానికి గురువారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ లో కె. అరుకణి (102) అనే వృద్ధురాలు ఓటు వేసి అందరికి ఆదర్శంగా నిలిచింది. ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి.. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు వేసింది. ఈ ఎన్నికల్లో వేసిన ఓటుతో కలిపి తన జీవితంలో మొత్తం 18 సార్లు ఓటు వేసింది.

వయస్సు సహకరించకపోయిన పోలింగ్ బూత్ దగ్గరకు కర్ర పట్టుకుని నడుస్తూ వెళ్లి.. ఓపిగ్గా క్యూలో నిలబడి తన ఓటు వినియోగించుకుంది ఈ బామ్మ. ఈ సందర్భంగా మీడియాతో వృద్ధురాలు మాట్లాడుతూ.. ఎప్పటిలానే ఈ ఎన్నికల్లో కూడా నా ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకున్నానని తెలిపింది.

సాధారణంగా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. తన వయస్సు 102 అంటే.. బహుషా వృద్ధురాలికి ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి.. ఆమె నివసించే నియోజవర్గంలో వచ్చిన మధ్యంతర ఎన్నికలతో కలిపి మొత్తం 18 సార్లు ఓటు వేసి ఉండవచ్చు.