Categories
Sports

అమిత్ షాతో కోహ్లీ-అనుష్క జోడీ భేటీ

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీసమేతంగా కలిశారు.  వారితో పాటుగా ఆ కార్యక్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా పాల్గొన్నారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ స్టేడియం అని పేరు పెడుతున్న సందర్భంగా వీరంతా కలిశారు. 

ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మార్చి అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు పెట్టడమే కాకుండా పెవిలియన్‌కు విరాట్ కోహ్లీ పేరు పెట్టాలనుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి టీమిండియా మొత్తం హాజరైంది. 

ఇటీవలే అస్వస్థతకు గురై చికిత్స తీసుకుంటూనే మరణించిన అరుణ్ జైట్లీ బీసీసీఐలోనూ ఉన్నత పదవిలో పనిచేశారు. దీంతో పాటు ధోనీ రిటైర్ అవుతున్నాడని వచ్చిన వార్తలతో క్రికెట్ అభిమానులు ఆన్ లైన్లో రచ్చ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్కా, రవిశాస్త్రిలు అమిత్ షాతో కలవడంతో నెటిజన్ల ట్రోల్స్‌కు హద్దు లేకుండా పోయింది. ‘స్టేడియం పేరు మారిస్తే వీరంతా ఎందుకు’, ‘కోహ్లీ ఉంటే సరిపోతుంది అనుష్క, రవిశాస్త్రి దేనికి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.