Categories
Movies Slider Telangana

దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంట్లో ఆస్తి తగాదాలు..ఆస్తుల కోసం కొట్టుకుంటున్న కొడుకులు

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఓ తత్వవేత్త చెప్పిన మాట అక్షర సత్యాలని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. ఆస్తుల కోసం జరిగిన గొడవలు..హత్యలు దానికి సాక్ష్యాలు. ఆస్తిగొడవలు సామాన్యులకే కాదు సెలబ్రిటీల ఇళ్లల్లో కూడా సర్వసాధారణమే. ప్రముఖ సినీ దర్శకులు దర్శక రత్న దాసరి నారాయణ రావు ఇంట్లో ఆస్తి తగాదాలు ఇపుడు హాట్ టాపిక్ గానిలిచాయి. దాసరి నారాయణ రావు కొడుకులు దాసరి అరుణ్ కుమార్..దాసరి ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తెరపైకి వచ్చాయి.

దాసరి నారాయణ రావు చిన్న కొడుకు అర్థ రాత్రి సమయంలో నా ఇంటికి గోడ దూకి వచ్చాడని అన్న దాసరి ప్రభు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి దాసరి ప్రభు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి సమయంలో నా ఇంటి గేటు దూకి ఇంటిలోకి ప్రవేశించి బీరువా తలుపులు బలవంతంగా తెరిచేందుకు యత్నించారని ఫిర్యాదులో  ప్రభు పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ పుటేజ్ కూడా ఉందని అరుణ్ కుమార్ గేటు దూకి వచ్చినట్లుగా ఉందని తెలిపారు. 
 
సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు అంటే గాడ్ ఫాదర్ అనే పేరు పొందారు. ఎంతోమందికి సీని అవకాశాలను కల్పించటమేకాకుండా..ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు దాసరి నారాయణ రావు. ఎంతోమందికి ఉపాధిని చూపెట్టారాయన. అటువంటి సినీ దిగ్గజం పరువు పోతోందనీ..మా నాన్న పేరు బజారు పాలు కాకుండా సీని ప్రముఖులు కల్పించుకుని మా తగాదాలు పరిష్కరించాలని దాసరి ప్రభు కోరుతున్నారు.

ఇప్పటి వరకూ చాలామంది సినీ ప్రముఖుల వద్దకు వెళ్లి తమ పరిస్థితి చెప్పామని కానీ ఎవ్వరూ తమ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ముందుకు రాలేదని ప్రభు వాపోయారు. ఇప్పటికైనా తన తమ్ముడికి తనకు ఉన్న ఆస్తి తగాదాల విషయం కల్పించుకుని పరష్కరించాలని కోరుతున్నారు. నా తమ్ముడు అరుణ్ కుమార్ నుంచి నాకు ప్రాణహాని ఉందని తెలిపారు ప్రభు. 

దాసరి అరుణ్ కుమార్ పలు సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఈక్రమంలో దాసరి కొడుకుల మధ్య నెలకొన్ని ఆర్థిక సమస్యలు వీదికెక్కాయి.వీరికి సంబంధించిన ఆస్తుల విషయం కోర్టులో కొనసాగుతున్నా..తాజాగా అరుణ్ కుమార్ ప్రభు ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి దౌర్జాన్యానికి దిగటంతో దాసరి ఇంటి ఆస్తి గొడవలు రచ్చకెక్కాయి. 

Read: పాప్ సంగీతపు రారాజు : Michael Jackson’s Death Anniversary