Categories
Movies

విజయ్ ఆంటోనితో అక్షర హాసన్

విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్, షాలిని పాండే, అక్షర హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘జ్వాల’ రష్యాలో షూటింగ్ జరుపుకుంటోంది..

విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, తనకొచ్చిన గుర్తింపుని నిలబెట్టుకోవడంలో మాత్రం       విఫలమయ్యాడు. వరస ఫ్లాపులతో తెలుగులో అతని మార్కెట్ అమాంతం పడిపోయింది. ఇప్పుడు విజయ్ ఆంటోని ఫస్ట్ టైమ్ తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు.

అమ్మ క్రియేషన్స్, శరవంత్ రామ్ క్రియేషన్స్, నవీన్ దర్శకత్వంలో, విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ హీరోలుగా, ‘జ్వాల’ అనే సినిమాని నిర్మిస్తున్నాయి. టి.శివ నిర్మాత. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్, షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్షర హాసన్ కూడా నటిస్తుంది. రష్యాలో పది రోజుల పాటు జరుగబోయే షెడ్యూల్‌‌లో అక్షర పాల్గొనబోతోంది.

Read Also : చాణక్య – రివ్యూ..

మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ‘జ్వాల’ విజయ్ ఆంటోనికి తెలుగులో ఫస్ట్ ఫిలిం కాగా,  ‘బ్రూస్‌లీ’, ‘సాహో’ తర్వాత అరుణ్ విజయ్ నటిస్తున్న సినిమా కావడం విశేషం. తమిళ్‌‌లోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నాజర్, ప్రకాష్ రాజ్, మీరా మిథున్, కలైయరసన్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. 
 

Categories
Movies

నువ్వు సింగం అయితే నేను హైనా : మాఫియా చాప్టర్ -1 టీజర్

అరుణ్ విజయ్, ప్రసన్న, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘మాఫియా చాప్టర్ – 1’ టీజర్ విడుదల..

కోలీవుడ్‌లో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ‘మాఫియా చాప్టర్ – 1’ అనే మూవీ తెరకెక్కుతోంది. అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తుండగా, ప్రసన్న విలన్‌గా కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తుండగా, ‘ధురువంగల్ పతినారు’ (తెలుగులో 16) ఫేమ్, కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. అరుణ్ విజయ్ అడవికి రాజు సింగంతో పోలుస్తూ తన క్యారెక్టర్‌ గురించి చెప్తుండగా, ప్రసన్న తన క్యారెక్టర్‌ను హైనాతో కంపేర్ చేస్తూ చెప్పడం టీజర్‌లో హైలెట్ అయ్యింది. త్వరలో మాఫియా చాప్టర్ – 1 విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

మ్యూజిక్ : జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ : గోకుల్ బినోయ్, ఎడిటింగ్ & డిఐ : శ్రీజిత్ సారంగ్, ఆర్ట్ : శివ శంకర్, స్టంట్స్ : డాన్ అశోక్. 

 

Categories
Movies

బాక్సర్ టైటిల్ లుక్ పోస్టర్‌

అరుణ్ విజయ్, రితికా సింగ్ జంటగా నటిస్తున్న బాక్సర్ మూవీ టైటిల్ లుక్ పోస్టర్‌ రిలీజ్..

సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్, రామ్ చరణ్ బ్రూస్‌లీలో నటించాడు.  ప్రభాస్ సాహోలోనూ కీ రోల్ చేస్తున్నాడు. కోలీవుడ్‌లో అరుణ్ విజయ్, రితికా సింగ్ జంటగా బాక్సింగ్ నేపథ్యంలో ‘బాక్సర్’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

బాక్సింగ్ రింగ్, చుట్టూ క్రౌడ్‌, కంప్లీట్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌‌తో డిజైన్ చేసిన బాక్సర్ టైటిల్ లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీ కోసం అరుణ్ బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. వి.మథియలాగన్ నిర్మాణంలో, వివేక్ దర్శకత్వంలో రూపొందున్న ఈ సినిమాకి సంగీతం : డి.ఇమాన్, డీఓపీ : మార్కస్ ఎ.ఎల్.జంగ్‌‌‌బర్గ్, ఎడిటింగ్ : మదన్, స్టంట్స్ : పీటర్ హెయిన్, ఆర్ట్ : సి.ఎస్.బాలచందర్.