Categories
National Political

జనాభాలెక్కలడిగితే.. ‘రంగా-బిల్లా’ అని చెప్పండి : అరుంధతి రాయ్

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జనాభా పట్టిక (NPR), జాతీయ పౌర పట్టిక (NRC)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రెండు నమోదు పట్టికలను సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. CAA, NRC ప్రక్రియను నిరసిస్తూ ఢిల్లీ యూనివర్శిటీ నిర్వహించిన ఆందోళనలో రచయిత, సామాజికవేత్త అరుంధతి రాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ పౌరసత్వానికి సంబంధించి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను ఎండగట్టారు.

NRC ప్రక్రియలో భాగంగా ఎవరైనా ఇంటికి వచ్చి పేరు, వివరాలు అడిగితే వారికి తప్పుడు వివరాలు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. ‘NPR కోసం అధికారులు మీ ఇంటికి వచ్చి మీ పేరు అడిగితే.. రంగా-బిల్లా (#RangaBilla), కుంగ్ ఫూ-కట్టా అని పేరు చెప్పండి’ అని #ArundhatiRoy అన్నారు.

అవసరమైతే.. ప్రధాని నివాసాన్ని (7 RCR) తమ నివాసంగా అంగీకరిస్తూ ఒక మొబైల్ నెంబర్ కూడా ప్రతిఒక్కరూ అధికారులకు ఇవ్వాల్సిందిగా సూచించారు. దేశంలోని ముస్లింలే లక్ష్యంగా ప్రభుత్వం NRCని అమల్లోకి తీసుకొచ్చిందంటూ రాయ్ విమర్శించారు.

‘NRC నమోదు కోసం అధికారులు మీ ఇంటికి వస్తారు. మీ పేరు, ఫోన్ నెంబర్ సహా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని అడుగుతారు. NRC డేటాబేస్ ఆధారంగా NPR ప్రక్రియ పూర్తి అవుతుంది. దీనిపై ప్రతిఒక్కరూ పోరాడాల్సి ఉంది. దీనికో ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉంది’ అని రాయ్ చెప్పారు.

అంతేకాదు.. NPR కోసం వచ్చే అధికారులకు మీ అసలైన పేరుకు బదులుగా మరో పేరును ఇవ్వండి.. చిరునామా అడిగితే 7 RCR అని చెప్పండి. లాఠీ దెబ్బలు, బుల్లెట్లను ఎదుర్కొవడానికి మనం పుట్టలేదు కదా’ అని రాయ్ ప్రజలకు పిలుపునిచ్చారు.