Categories
National

జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ

మూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యలను పరామర్శించారు. జైట్లీకి నివాళులర్పించారు. మోడీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. అనారోగ్య కారణాలతో శనివారం(ఆగస్టు-24,2019)జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే.

మోడీకి జైట్లీ అత్యంత ఆప్తుడన్న విషయం ప్రత్యేకంగా. మోడీ కేబినెట్ 1.0లో ఐదేళ్లపాటు అరుణ్ జైట్లీ కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ నుంచే జైట్లీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 

జైట్లీ మరణవార్త వినగానే  విదేశాల్లో ఉన్న మోడీ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. జైట్లీ కుటుంబసభ్యలకు ఫోన్ చేసి మాట్లాడారు. తన పర్యటన రద్దు చేసుకుని భారత్ కు రావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జైట్లీ కుటుంబసభ్యల సూచన మేరకు విదేశీ పర్యటనను కొనసాగించారు. ఢిల్లీ వచ్చిన వెంటనే జైట్లీ ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. గొప్ప నాయకుడుని కోల్పోయామంటూ రెండు రోజుల క్రితం బహ్రెయిన్ లో భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో జైట్లీని మోడీ గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే.

Categories
National

జైట్లీ అంత్యక్రియల్లో ఫోన్ల దొంగతనం..బీజేపీ ఎంపీది కూడా

ఆదివారం ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు,కార్యకర్తలు,వివిధ పార్టీల ప్రముఖులు హాజరయ్యి జైట్లీకి కడసారి వీడ్కోలు పలికారు. అయితే ఆ సమయంలో అనేకమంది తమ ఫోన్లు పోగొట్టుకున్నారు.

ఆదివారం నిగమ్ బోధ్ ఘాట్ లో 11మంది ప్రముఖులు తమ ఫోన్లు పోగొట్టుకున్నారు. పతంజలి ప్రతినిధి ఎస్ కే తజరవాలా, బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో తదితరులు తమ ఫోన్ దొంగలించబడినట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆ రోజు మొత్తం ఏయే ప్లేస్ లలో ఉందో గూగుల్ మ్యాప్  ట్రాకింగ్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వనున్నట్లు తెలిపారు

Categories
National

జైట్లీ అంత్యక్రియలు పూర్తి

ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జైట్లీకి కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు,ప్రముఖులు నిగమ్ బోద్ ఘాట్ కు వెళ్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,హోంమంత్రి అమిత్ షా,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ సీనియర్ నాయకులు, ఎంపీలు,వివిధ పార్టీల నాయకులు నిగమ్ బోద్ ఘాట్ కి వెళ్లి జైట్లీకి కడసారి వీడ్కోలు పలికారు

Categories
National

సమస్య వచ్చినప్పుడల్లా… జైట్లీ అండగా నిలబడ్డారన్న అమిత్ షా

తన జీవితంలో సమస్య ఎదుర్కొన్నప్పుడల్లా అరుణ్ జైట్లీ తనకు అండగా నిలబడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన మనతో లేడన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగత నష్టం అని షా అన్నారు. దేశానికి ఆయన గొప్ప సేవ చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జైట్లీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైట్లీ కుటుంబసభ్యులకు,బీజేపీ కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

జైట్లీ మరణం బీజేపీ కార్యకర్తలకు పూడ్చలేని లోటన్నారు. ఓ విద్యార్థి నాయకుడిగా,ఎమర్జెన్సీ సమయంలో 19నెలలు జైల్లో గడిపిన వ్యక్తిగా,ఓ పార్లమెంటేరియన్ గా ప్రజల తరపున గళం వినిపించేవాడని,అవినీతి పట్ల కఠినంగా ఉండేవాడని అమిత్ షా అన్నారు.

Categories
Sports

జైట్లీకి నివాళిగా…నల్లని బ్యాండ్లు ధరించిన టీమిండియా

మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల టీమిండియా సంతాపం ప్రకటించింది. ఆయనకు నివాళిగా ఈ రోజు టీమిండియా ఆటగాళ్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి వెస్టిండీతో తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ఆడుతున్నారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా,ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అరుణ్ జైట్లీ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా,బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన సేవలు మరువలేనివని టీమిండియా ఆటగాళ్లు గుర్తు చేసుకున్నారు. ఆయనకు నివాళిగా భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి వెస్టిండీతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పాల్గొన్నారు. పలువురు క్రీడాకారులు కూడా జైట్లీ మృతి పట్ల సంతాపం తెలిపారు. దేశం ఓ గొప్ప వ్యక్తి కోల్పోయిందన్నారు. 
నా పితృ సమానుడైన అరుణ్‌ జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుందని టీమిండియా మాజీ ఆటగాడు,ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. జైట్లీ ప్రజా జీవితంలోనే కాకుండా చాలామంది ఢిల్లీ క్రికెటర్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించేలా కీలక పాత్ర పోషించారని,డీడీఏసీలో ఆయన నాయకత్వంలో తనతో సహా ఎంతోమందికి అవకాశాలు వచ్చాయని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.

Categories
Hyderabad

బడ్జెట్ మీటింగ్స్ : ఫిబ్రవరిలో తెలంగాణ బడ్జెటె్ సమావేశాలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించాలని అనుకుంటున్నట్లు టాక్. ఒక వన్..టు డేస్‌లో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఇందులో రాష్ట్రాలనికి గల కేటాయింపులు తెలుస్తాయి. తెలంగాణకు కూడా కేటాయింపులు ఎంతున్నాయనే దానిపై క్లారిటీ వస్తుంది. ఫిబ్రవరి 14 నుండి 16వ తేదీల్లో కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి రానుంది. కమిషన్ ద్వారా సాయం ఎంతొస్తుంది ? దానిపైన కూడా ఒక స్పష్టత వస్తుంది. అందుకే ఫిబ్రవరి మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశ పెడితే…బాగుంటుందని సర్కార్ యోచిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో చర్చల సందర్భంగా బడ్జెట్ సమావేశాల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. ఇప్పటికే శాఖల వారీగా ప్రతిపాదనలు చేయాలని సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించంది. దీనికంటే ముందుగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.