Categories
Movies

‘సింగం’ కలయికలో సూర్య 39 – శేష్ సినిమాలో శోభిత ధూళిపాల

తమిళస్టార్ హీరో సూర్య, దర్శకుడు హరి ఆరోసారి కలిసి పనిచేయనున్నారు.. అడవి శేష్ ‘మేజర్’ సినిమా షూటింగులో శోభిత ధూళిపాల జాయిన్ అయింది..

తమిళ స్టార్ హీరో సూర్య గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. సుధ కొంగర దర్శకత్వంలో నటిస్తున్న ‘ఆకాశం నీ హ‌ద్దురా’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. త‌ర్వాత సినిమాను కూడా లైన్లో పెట్టాడు. హ‌రితో సూర్య 39వ సినిమా చేయనున్నాడు. వీళ్ల  కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అయిదు సినిమాలు రూపొందాయి.

అందులో సింగం సీక్వెల్స్ (మూడు సినిమాలు) సౌత్ ఇండియాలో భారీ విజ‌యాల‌ను సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ‘ఆరు’ ‘వేల్’ (దేవా) సినిమాలు కలిసి చేశారు. ఇప్పుడు ఆరోసారి వీరిద్ద‌రు జతకలిసారు. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై సూర్య కజిన్ జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘అరువా’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. ‘అరువా’ అంటే క‌త్తి అని అర్థం. ఏప్రిల్ నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతమందిచనున్నారు.

26/11..ముంబై తాజ్ హోటల్‌పై ముష్క‌రులు జరిపిన దాడిలో ఎన్ఎస్‌జీ కమెండో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌ను ప్రాణాల‌ను కాపాడిన సంగతి తెలిసిందే. ఈ రియ‌ల్ హీరో ఉన్ని కృష్ణ‌న్ పాత్ర‌లో టాలెంటెడ్ యాక్టర్ అడివిశేష్ హీరోగా న‌టిస్తున్న సినిమా.. ‘మేజ‌ర్‌’. తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ సినిమాను ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేశ్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చ‌ర్స్‌, ఎప్ల‌స్ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా శోభితా ధూళిపాల షూటింగులో జాయిన్ అయింది. గూఢ‌చారి త‌ర్వాత శేష్‌తో ధూళిపాల క‌లిసి న‌టిస్తోన్న రెండో సినిమా ఇది. ఆమె పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా, ఎమోష‌న‌ల్‌గా ఆక‌ట్టుకోనుందని ఆమెపై క్లాప్ నిస్తున్న ఫోటో షేర్ చేసాడు శేష్. ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ‘మేజర్’ షూటింగ్ జ‌రుగుతుంది. 
Surya - Hari

Major