Categories
National Political

మాకు కావాల్సింది గొప్పలు కాదు.. ప్రాణాలు కాపాడటమే: కేజ్రీవాల్

ఢిల్లీలో కరోనా కేసులు వరుసగా పెరుగుతుండటంతో సీఎం ప్రతి ఒక్కరినీ అలర్ట్ అవ్వాలని కోరారు. గొప్పలు చెప్పుకోవడం మా లక్ష్యం కాదని… ప్రాణాలు కాపాడటమే అని కేజ్రీవాల్ అన్నారు. ‘ప్రాణాలు కాపాడటానికి నా గుండె, ప్రాణాలు కూడా అర్పిస్తా. గొప్పలు చెప్పుకోవల్సిన అవసరం లేదు. దీన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదు’ అని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కరోనావైరస్ ను హ్యాండిల్ చేయడం ఏ ఒక్క ప్రభుత్వం వల్ల కాదు. మరిన్ని ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. ఇటీవల రోజుల్లో మరిన్ని కేసులు పెరిగిపోతున్నాయి. అప్పుడే మేమింకా ఎక్కువ చేయగలం’ అని అన్నారు.

ఊహించిన దానికంటే బెటర్:
కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం.. 5.5లక్షల కేసులు నమోదవుతాయని భావించారు. ప్రజలకు తెలియజేయడం నా బాధ్యత. మా కష్టాలు ఫలిస్తున్నాయని చెప్పడం సంతోషంగా ఉంది. జూన్ 30న మొత్తం 27వేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని బట్టే తెలుస్తుంది అనుకున్నదానికంటే బెటర్ అని..’ సీఎం అన్నారు.

ప్రజలు అంతకుముందులా భయపడటం లేదు. చాలామంది ఇంటి వద్దనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. హాస్పిటల్స్ పై భారం తగ్గుతుంది. సీరియస్ గా ఉన్న పేషెంట్లను కాపాడేందుకు ఢిల్లీ హాస్పిటల్స్ లో సరిపడా బెడ్స్ ఉన్నాయి. మేమేం కూర్చొని ఉండిపోలేదు. పనిచేస్తూనే ఉన్నాం. కలిసి పనిచేయడం అనేది పెద్ద బలం. కరోనా నుంచి రివరీ అయిన పేషెంట్లకు రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రాణాలు కాపాడటానికి వారి ప్లాస్మాను డొనేట్ చేయండి. అది ఇంకొకరి ప్రాణాలు కాపాడవచ్చు’

‘మరో 2రోజుల్లో ప్లాస్మా బ్యాంక్ స్టార్ట్ అవుతుంది. COVID-19పేషెంట్లు వారి ప్లాస్మా డొనేట్ చేయమని అడుగుతున్నాం’ అని వెల్లడించారు.

Read:లడఖ్ ప్రతిష్టంభన : భారత్‌కు ఆయుధాలు, మందుగుండు పంపిస్తున్న మిత్రదేశాలు!

Categories
National

మూడు రెట్లు ఎక్కువ అంటే రోజుకు 18వేల మందికి కరోనా టెస్టులు: ఢిల్లీ సీఎం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన కొద్ది రోజులకే కరోనా వైరస్ కేసులు ఊపందుకున్నాయి. కరోనా వైరస్ టెస్టింగులు మూడు రెట్లు పెరిగాయని ఫలితంగా కేసుల నమోదు పెరుగుతుందని అన్నారు. గతంలో రోజుకు 5వేలు టెస్టులు చేసే ఢిల్లీ 18వేల టెస్టులు నిర్వహిస్తుందని అన్నారు. కరోనా వైరస్ టెస్టింగులు చేయించుకోవడంలో నగర వాసులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని అన్నారు. 

హోం ఐసోలేషన్ లో ఉండిపోయిన కరోనా వైరస్ పేషెంట్లకు ప్రతి ఐదు గంటలకోసారి ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకునేందుకు పల్స్ ఆక్సిమీటర్లు సప్లై చేస్తున్నట్లు తెలిపారు. లడఖ్ కేంద్రంగా ఇండియా, చైనీస్ ట్రూపులు జూన్ 15 నుంచి తలపడుతున్నాయి. అప్పటి నుంచి చైనాతో ఇండియా రెండు యుద్ధాలు ఎదుర్కొంటుంది. ఒకటి కరోనా వైరస్, ఇంకొకటి బోర్డర్ ఇష్యూ.

బోర్డర్లో సైనికులు చైనా మీద పోరాడుతుంటే ఇండియా మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతుంది. ఇందులో వెనక్కితగ్గేది లేదు. ‘మనం రెండు యుద్ధాల్లో చైనాతో పోరాడుతున్నాం. ఒకటి వైరస్, ఇంకొకటి బోర్డర్. కలిసికట్టుగా పోరాడాల్సిందే. వీటిని రాజకీయం చేయకూడదు. మనం గెలిచేంత వరకూ సైనికులు వెనుకడుగేసేది లేదు’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

ఢిల్లీలో పరిస్థితి గురించి చెప్తూ.. ‘ఈ రోజు ఢిల్లీలో 25వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 6వేల మంది హాస్పిటళ్లో ఉండగా 12వేల మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. శుభవార్త ఏంటంటే వారంలో కేవలం వెయ్యి కేసులు మాత్రమే పెరిగాయి’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. 

Read: బిల్డ‌ర్ భారీమనస్సు: 19 అంత‌స్థుల బిల్డింగ్‌ను క్వారెంటైన్ సెంట‌ర్‌ కు ఇచ్చేసారు

Categories
National

కేజ్రీవాల్ కు కరోనా నెగిటివ్

ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా సోకలేదని పరీక్షల్లో తేలింది. గత రెండు రోజులుగా కరోనా వైరస్ లక్షణాలు గొంతునొప్పి, జ్వరం,దగ్గుతో కేజ్రీవాల్‌ బాధపడుతున్నారు.

కరోనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానంతో సోమవారం ఆయన స్వీయ గృహనిర్బంధంలో ఉండిపోయారు.  ఆదివారం నుంచి మంత్రులతోగానీ, ఆధికారులతోగానీ కేజ్రీవాల్‌ కలువలేదు. గొంతునొప్పి కారణంగా ఎవరితో మాట్లాడలేదు. మంగళవారం కేజ్రీవాల్‌ నుంచి వైద్యులు శాంపిల్స్ సేకరించి కరోనా వైరస్ నిర్ధారణ టెస్ట్ కు పంపారు. టెస్ట్ రిపోర్ట్ లోనెగెటివ్‌గా తేలడంతో కేజ్రీవాల్‌ ఊపిరిపీల్చుకొన్నారు.

మరోవైపు, జులై 31నాటికి దేశరాజధానిలో 5లక్షల 50వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని అంచానా వేసినట్లు ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. దేశ రాజధానిలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్)లేదని,కానీ 50శాతం కేసులకు మూలం తెలియలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కేంద్రప్రభుత్వ అధికారులు ఇంకా ఢిల్లీలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగలేదని చెప్పారని అన్నారు .కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు కరోనా కేసులు 27వేలు దాటగా,760కి పైగా మరణాలు నమోదయ్యాయి.

Categories
National

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అస్వస్ధత

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్ధతకు గురయ్యారు. ఆయనకు కరోనా లక్షణాలైన గొంతు నొప్పి, జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు ఢిల్లీ సీఎం కార్యాలయం తెలిపింది. ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. రేపు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. కాగా ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 30 వేలకు చేరుకుంటున్నాయి. లాక్ డౌన్ నిబంధనల సడలింపు విషయంలో ప్రభుత్వం కొంత కఠినంగా ఉంది.

గత 24 గంటల్లో భారత దేశంలో అత్యధికంగా 9,983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,56,611కు చేరింది. 24 గంటల్లో వైరస్ కారణంగా 206 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు మొత్తం 7,135 మంది కరోనాతో మృతి చెందారు.

Read: పేద పిల్లలకు ఫ్రీగా హెయిర్ కటింగ్ చేస్తున్న బార్బర్ 

Categories
National

మిమ్మల్ని వదిలేది లేదు.. ప్రైవేట్ హాస్పిటల్స్‌పై సీఎం ఫైర్

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులకు హాస్పిటళ్లలో ఖాళీలు లేకుండా పోతున్నాయి. భారమంతా ప్రభుత్వ హాస్పిటళ్లే మోస్తుండటంతో చికిత్స అందించడం ఇబ్బందిగా మారింది. దీంతో బాధ్యత ప్రైవేట్ హాస్పిటల్స్ వారు తీసుకోవాల్సిందేనని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటున్నారు. ఈ సందర్భంలో హాస్పిటల్ చేస్తున్న బ్లాక్ బిజినెస్ క్షమించరానిదని అన్నారు. 

దేశరాజధానిలో జరుగుతున్న ఇటువంటి ఘటనలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ‘ఢిల్లీలో మీరు హాస్పిటల్స్ పెట్టుకునేందుకు అనుమతులిచ్చింది డబ్బులు సంపాదించుకోమని కాదు. ప్రజలకు సేవ చేయమని. మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో చాలా హాస్పిటల్స్ పాజిటివ్ గా ఆలోచించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నాయి’

‘కేవలం 3-4 హాస్పిటల్స్ మాత్రం ఇతరులకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. Covid-19 పేషెంట్లను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. అలా చేస్తున్నవారందరినీ హెచ్చరిస్తున్నా. హాస్పిటల్ బెడ్ లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదు’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

ఢిల్లీ సిటీలో బెడ్‌ల కొరత అనేది రాష్ట్ర ప్రభుత్వం అస్సలు సహించదు. ఒకవేళ ఉన్నా అది ఎక్కువ సేపు ఉండకూడదు. ఇవాళ్టి వరకూ హాస్పిటల్స్ లో బెడ్ ల కొరతేం లేదు. ఇంకా 8వేల 645బెడ్లు అందుబాటులో ఉన్నాయి. 4వేల 38మంది పేషెంట్లు చికిత్స తీసుకుంటుండగా 4వేల 607మంది డిశ్చార్జ్ అయ్యారు. ట్రీట్‌మెంట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్న వారిపై కొద్ది రోజుల్లోనే యాక్షన్ తీసుకుంటామని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 

Read: ఏసీ ట్రైన్, క్యాబ్.. మీ ప్రయాణం ఎందులో సురక్షితం? నిపుణులు ఏమంటున్నారు?

Categories
National

కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన నిజాముద్దీన్ మసీదు మూసివేత

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమై కలకలం సృష్టించిన ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ మసీదు ను అధికారులు మూసి వేశారు. మర్కజ్‌లో మార్చినెలలో నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్‌ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మసీదును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఢిల్లీ  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకు మసీదుకు సీల్‌ వేశారు. 

దీంతో పోలీసులు మర్కజ్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్త్‌ను ఏర్పాటు చేసి…. డ్రోన్‌ కెమెరాలతో అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే మర్కజ్‌లో ప్రార్థనలు నిర్వహించిన మతపెద్దలపై కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు.

కాగా మర్కజ్‌ ప్రార్థనలకు ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, నేపాల్‌, మలేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన దాదాపు 280 మంది హాజరయ్యారు. దీంతో ఆ ప్రార్థనలో పాల్గొన్న వారికి వైరస్‌ సోకే అవకాశం ఉందని ఢిల్లీ వైద్యులు భావిస్తున్నారు. 
 

మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసిన కరోనా మూలాలు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీనిలో తెలంగాణకు చెందిన ఆరుగురు, కశ్మీర్‌కు చెందిన ఒకరు మరణించడంతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది.
 

మరోవైపు ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందికిపైగా కరోనా అనుమానితులను అధికారులు క్వారెంటైన్‌ను తరలించారు. వీరిలో ఇప్పటి వరకు 24 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే వీరిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని ప్రభుత్వం కోరుతోంది. ఇక ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం అధికారులు జల్లెడపడుతున్నారు.

Categories
National Political

61 MLAలకు బర్త్ సర్టిఫికెట్లు లేవు….NPR,NRCలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం

వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జ‌న్మ ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవ‌ని అన్నారు. కేవ‌లం 9 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే తమ దగ్గర బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని అసెంబ్లీలో చేతులు లేపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీలో మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  మిగితా సీట్లు అన్నీ బీజేపీ ఖాతాలో ఉన్నాయి. 

త‌న‌కు కానీ, త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు కానీ బ‌ర్త్ స‌ర్టిఫికేట్లు లేవ‌ని కేజ్రీవాల్ తెలిపారు. పౌర‌స‌త్వాన్ని నిరూపించాలనుకుంటే, త‌న భార్య వ‌ద్ద కానీ, క్యాబినెట్ మంత్రుల వ‌ద్ద కానీ జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రాలు లేవ‌న్నారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఎన్‌పీఆర్‌, ఎన్ఆర్‌సీను ఉప‌సంహ‌రించాల‌ని కేంద్రాన్ని కోరిన‌ట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర మంత్రులు కూడా త‌మ జ‌న‌న ద్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను చూపించాల‌ని కేజ్రీవాల్ స‌వాల్ చేశారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు.

పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్‌ కోరారు. NPR ప్రకియలో ప్రజలెవరకు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేదని కేంద్రహోంమంత్రి అమిత్ షా గురువారం రాజ్యసభలో చెప్పిన మరుసటి రోజే…ఢిల్లీ అసెంబ్లీ ఎన్ పీఆర్ కి వ్యతిరేకంగా తీర్మాణం చేసింది. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే లేదని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ జాబితాలో ‘సందేహాస్పద’ (D) అనే కేటగిరీ ఉండదని గురువారం రాజ్యసభలో అమిత్ షా ప్రకటించారు.

ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ పీఆర్ ను అమలుచేయబోమని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఎన్ పీఆర్ ప్రక్రియ చేపట్టబోమని  కేరళ,వెస్ట్ బెంగాల్,బీహార్(బీజేపీ మిత్ర పక్షం),రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా ఎన్ పీఆర్ ప్రక్రియ చేపట్టబోమంటూ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్ పీఆర్ ప్రక్రియ పై రాష్ట్రం సందేహాలను కేంద్రం తీర్చనంతవరకు ఎన్ పీఆర్ చేపట్టే ప్రశక్తే లేదని అన్నా డీఎంకే తేల్చి చెప్పింది. 

Categories
National Political

Delhi Protest : AAP లీడర్ల తప్పుంటే డబుల్ శిక్ష వేయండి-కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఆప్ నేత తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. దేశ రక్షణ కోసం రాజకీయాలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇలా..ఎవరైనా సరే..ఎవరినీ కూడా వదలవద్దని, తన మంత్రివర్గంలో ఉన్నా సరే..వారికి శిక్ష వేయాలన్నారు.

ఆప్ పార్టీకి చెందిన వారు ఉంటే..వారికి డబుల్ శిక్ష పడే విధంగా చూడాలని సూచించారు. 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లు, ఘర్షణలను ఖండించారు. అల్లర్ల కారణంగా దెబ్బతిన్న వారికి పరిహారం ప్రకటించడం జరుగుతుందన్నారు.

బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామన్నారు. ఫరిస్తే పథకం కింద బాధితులకు ఆహార పదార్థాలతో పాటు..నిత్యావసర వస్తువులు కూడా ఇస్తామన్నారు. ఢిల్లీ అల్లర్లలో 35 మృతి చెందగా, 200 మంది గాయపడ్డారని వెల్లడించారు.

వీరందరికీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, రాత్రింబవళ్లు కృషి చేసిన వైద్యులకు, సిబ్బంది కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. అల్లర్లు, హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణలు ప్రకంపనాలు సృష్టించాయి. మూడు రోజులుగా జరిగిన అల్లర్లలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది.

 

ఫిబ్రవరి 27వ తేదీ గురువారం తగ్గుముఖం పట్టాయి. ఈశాన్య ఢిల్లీలో కర్ఫ్యూ విధించడంతోపాటు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేయడంతో.. అల్లర్లు, ఆందోళనలు తగ్గాయి. దీంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు చేపట్టారు. ఆందోళనల్లో నడిరోడ్లపై ఆహుతైన వాటిని తొలగిస్తున్నారు.

Read More : కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై కేటీఆర్ ఆగ్రహం

Categories
National Political

మరోసారి ఏ మంత్రిత్వశాఖను తీసుకోని కేజ్రీవాల్…ఎందుకో తెలుసా

ఢిల్లీ సీఎంగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గత ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలోలా ఈసారి కూడా కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2015నుంచి ఉన్నట్లుగా మరోసారి  ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించకూడదని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ నిర్ణయంతో మరోసారి ఆయన తన కేబినెట్ లో ఏ మంత్రిత్వశాఖ లేకుండా ఉన్న ఏకైక మంత్రిగా ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ  ప్రతి ఇంటికి తక్కువ ధరలో నీటిని ఇస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరినందున, 2017 లో తాను చేపట్టిన నీటి మంత్రిత్వ శాఖను కూడా ఈసారి కేజ్రీవాల్ తన దగ్గర ఉంచుకోలేదు.

ఇవాళ(ఫిబ్రవరి-19,2020)ఢిల్లీలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ….ఎందుకు మీరు ఏ మంత్రిత్వశాఖను మీ దగ్గర ఉంచుకోలేదు అని చాలామంది ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం… ఢిల్లీ ప్రజలకి నా మొదటి మరియు పూర్తి కమిట్ మెంట్. ఢిల్లీ ప్రజలు నాకు పెద్ద బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించాలి. అందుకే నేను నా దగ్గర ఏ శాఖను ఉంచుకోలేదు. ఈ విధంగా నేను అన్ని మంత్రిత్వ శాఖలపై ఓ కన్నేసి ఉండగలను. ఒక మంత్రిత్వ శాఖలో, తక్కువ వివరాలతో చిక్కుకుపోతే మిగిలిన పని బాధపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు.

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత ఆప్ అధినేత…అమిత్ షాతో తొలిసారిగా భేటీ అయిన సందర్భం ఇది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పై అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆప్-అమిత్ షా ల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఢిల్లీలో గెలిచేందుకు అమిత్ షా చాలా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ కేజ్రీవాల్ విజయాన్ని ఆపలేకపోయారు.

గత కేబినెట్ లో పనిచేసిన ఆరుగురు మంత్రులే మరోసారి కేజ్రీవాల్ తో కలిసి గత ఆదివారం మంత్రులుగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కేబినెట్ లో కొత్తవాళ్లకు చోటు లేదని కేజ్రీవాల్ ప్రకటించేశారు. పాతవారినే మరోసారి మంత్రులుగా కంటిన్యూ చేశారు.

Categories
National Political

కలిసి పనిచేద్దాం….అమిత్ షాని కలిసిన కేజ్రీవాల్

ఆదివారం(ఫిబ్రవరి-16,2020)మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ (ఫిబ్రవరి-19,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70స్థానాల్లో 62సీట్లు గెలుచుకుని గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత ఆప్ అధినేత…అమిత్ షాతో తొలిసారిగా భేటీ అయిన సందర్భం ఇది. 

అమిత్ షాతో చాలా ఫలప్రదమైన సమావేశం జరిగిందని అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీకి సంబంధించిన వివిధ ఇష్యూలపై అమిత్ షాతో చర్చించినట్లు ఆప్ అధినేత తెలిపారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు తామిద్దరం అంగీకరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ పై అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆప్-అమిత్ షా ల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఢిల్లీలో గెలిచేందుకు అమిత్ షా చాలా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ కేజ్రీవాల్ విజయాన్ని ఆపలేకపోయారు.

గత ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా గ్రౌండ్ లో ఢిల్లీ ప్రజల మధ్య సీఎంగా మూడోసారి కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో ఢిల్లీ ప్రజల ఆశిస్సులతోపాటుగా ప్రధాని మోడీ ఆశిస్సులు కూడా కావాలని కేజ్రీవాల్ కోరిన విషయం తెలిసిందే. తన ప్రమాణస్వీకారానికి దేశంలోని ఏ ఇతర రాజకీయనాయకుడిని ఆహ్వానించని కేజ్రీవాల్ మోడీని మాత్రమే ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజు వారణాశి పర్యటనలో ఉన్న ప్రధాని కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు.

గత కేబినెట్ లో పనిచేసిన ఆరుగురు మంత్రులే మరోసారి కేజ్రీవాల్ తో కలిసి మంత్రులుగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కేబినెట్ లో కొత్తవాళ్లకు చోటు లేదని కేజ్రీవాల్ ప్రకటించేశారు. పాతవారినే మరోసారి మంత్రులుగా కంటిన్యూ చేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.