Categories
Movies

ఆర్య 3 స్క్రిప్ట్ రెడీ – బన్నీ వింటే సెట్స్‌కెళ్లిపోడమే!

‘ఆర్య 3’ గురంచి తన మనసులో మాట బయటపెట్టిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్..

తెలుగు సినీ చరిత్రలో రూపొందిన ప్రేమకథా చిత్రాల్లో ‘ఆర్య’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ఫీల్ మై లవ్.. వన్ సైడ్ లవ్.. అంటూ యువతను ఉర్రూతలూగించిందీ చిత్రం. బన్నీని స్టైలిష్ స్టార్, సుక్కూని క్రియేటివ్ డైరెక్టర్ చేసింది ఈ సినిమానే.. తర్వాత వచ్చిన సీక్వెల్ ‘ఆర్య 2’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం బన్నీ, సుకుమార్ కలయికలో హ్యాట్రిక్ సినిమా రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే తాజాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్‌లో తన మనసులో ‘ఆర్య 3’ ఆలోచన ఉన్నట్టు బయట పెట్టారు దర్శకుడు సుకుమార్.

Read Also : తీవ్ర విషాదంలో అమలా పాల్

హైదరాబాద్ యూసఫ్ గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీలో ‘మాంటేజ్ 20’ సెలబ్రేటింగ్ స్టూడెంట్ షాట్స్’ పేరుతో జరుగుతున్న షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు దర్శకుడు సుకుమార్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ : ‘‘ఆర్య 3 స్క్రిప్ట్ రెడీగా ఉంది.. బన్నీకి ఇంకా చెప్పలేదు.. తను విని ఓకే అంటే షూట్‌కి వెళ్లిపోతాం’’ అని చెప్పారు. అల్లు అర్జున్ 20 సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభం కానుంది.