Categories
Hyderabad Movies

సంగీత్ వేడుక‌లో సంద‌డి చేసిన స్టైలిష్ స్టార్

త‌మిళ‌ హీరో ఆర్య‌(38), అందాల‌ భామ‌ స‌యేషా సైగ‌ల్‌(21)ల వివాహం నేడు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల నుండి వీరి వివాహానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. శుక్ర‌వారం(మార్చి 8,2019)న జ‌రిగిన ప్రీ వెడ్డింగ్ వేడుక‌కి బాలీవుడ్ సెల‌బ్రిటీలు సంజ‌య్ ద‌త్‌, ఖుషీ క‌పూర్‌, ఆదిత్యా పంచోలితో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. ఇక నిన్న సంగీత్ వేడుక‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజ‌ర‌య్యారు. 

ఆర్య‌, సాయేషాతో క‌లిసి బ‌న్నీ దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వ‌రుడు చిత్రంలో అల్లు అర్జున్‌కి ప్ర‌తినాయ‌కుడిగా ఆర్య న‌టించిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో ఆర్య‌, స‌యేషాల పెళ్లి వేడుక నేడు ఘ‌నంగా జ‌ర‌ప‌నుండ‌గా, చెన్నైలో రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తార‌ని టాక్.