Categories
International

కరోనా వైరస్‌కు టీకా కనిపెడుతున్నాం : ట్రంప్

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయటానికి  టీకా తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని దానికి అమెరికా ఔషధ కంపెనీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం (మార్చి 1,2020) తెలిపారు. ఈ వార్త ప్రపంచ దేశాలకు చాలా చాలా శుభవార్త అని అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. (Amazon డెలివరీ బాయ్‌కు కరోనా)

కరోనాకు టీకా తయారు చేసేందుకు టాప్ 10లో ఉండే దిగ్గజ ఫార్మా కంపెనీల సీఈవోలతో వైట్‌హౌ్‌సలో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టీకా తయారీకి సందరు ఫార్మా కంపెనీలన్నీ సంయుక్త ప్లాన్ తో ఆలోచనలను పంచుకుంటూ ముందుకు సాగాలని ట్రంప్ వారికి సూచించారు. టీకాను డెవలప్ చేసే ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కరోనా బాధిత దేశాల పరిస్థితిపై తమకు పూర్తి అవగాహన ఉందని ట్రంప్ తెలిపారు. 

కాగా.. కరోనా టీకాను కనుగొనే యత్నాల్లో అమెరికా ఫార్మా కంపెనీలు ముందున్నాయని.. న్యూయార్క్‌ కేంద్రంగా  పనిచేసే ఫైజర్‌ కంపెనీ ఓ అడుగు ముందుకేసి కరోనాను కట్టడి చేయగల యాంటీ వైరల్‌ ఔషధ సమ్మేళనాలను కనుగొన్నట్లు ప్రకటించింది. థర్డ్‌ పార్టీ డ్రగ్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఫలితాలు నెలాఖరుకు వస్తాయని, దాంతో ఆ సమ్మేళనాల్లో ఎన్ని కరోనాకట్టడికి దోహదపడతాయనేది తేలుతుందని స్పష్టంచేసింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ప్రభావవంతంగా పనిచేసే ఔషధ సమ్మేళనాలతో 2020 చివరికల్లా ఫైజర్‌ ప్రయోగ పరీక్షలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 

See More:

కరోనా వైరస్ సోకిందని..భార్యను ఏం చేశాడో తెలుసా..?

కరోనాపై యుద్దం చేస్తున్నా..నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి..ప్రభుత్వానికి నర్స్ రిక్వెస్ట్

కరోనాతో పోరాడేందుకు చైనా గబ్బిలం సూట్లు