Categories
National

నిర్భయ ‘తాళిబొట్టు’: ‘ఉరి’ వేసి.. డబ్బుతో కూతురు పెళ్లి చేస్తా

‘నిర్భయ’ దోషులకు ఉరి వేస్తాను. దానికి నాకు డబ్బులిస్తారు. ఆ డబ్బులతో నా కూతురు పెళ్లికి ‘తాళిబొట్టు’ చేయిస్తాను..పెళ్లిచేస్తాను అంటున్నాడు నిర్భయ దోషులకు ఉరి వేయనున్న తలారి 57 ఏళ్ల  పవన్ జల్లాద్. నిర్భయ దోషులకు ఉరి పడనుంది. దీనికోసం నిర్భయ తల్లి ఆశాదేవితో పాటు యావత్ భారతం ఎదురు చూస్తోంది.  వారికి ఉరే సరి అంటున్న దేశం మొత్తం ఘోషించింది. ఏడు సంవత్సరాల తరువాత నిర్భయ దోషులకు ఉరి పడనుంది. ఈ క్రమంలో నిర్భయ దోషులను ఉరి తీసే వ్యక్తి పేరు వార్తల్లోకెక్కింది. అతనే పవన్.  జల్లాద్ అంటే తలారి. అంటే హ్యాంగ్‌మ్యాన్‌.

ఇప్పుడు తలారి అనే మాట వినిపించగానే నిర్భయ దోషుల్ని తీహార్‌ జైల్లో ఉరి తీయబోతున్నానే విషయమే ఠక్కుమని తెలిసిపోతుంది. ఆ దుర్మార్గులను ఉరి తీయబోయేది పవన్ జల్లాద్. ఈ నలుగుర్ని ఉరి తీసినందుకు పవన్‌కి ప్రభుత్వం రూ. లక్ష రూపాయలు ఇస్తుంది. 

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..నిర్భయ దోషులకు ఉరి వేసిన ‘‘ఆ లక్షతో నా కూతురి పెళ్లి చేస్తాను. ఇప్పుడే నాకూతురికి సంబంధాలు చూస్తున్నాను. కూతురు పెళ్లి చేయటానికి డబ్బు ఎలా సమకూర్చాలా? అని అనుకుంటున్నాను. కానీ నిర్భయ దోషులకు ఉరి తీసే అవకాశం నాకు కలిగింది. దీంతో నా కూతురు పెళ్లికి సమస్య దాదాపు తీరిపోయినట్లేననీ..నా వృత్తే నాకు దారి చూపించింది’’ అన్నాడు పవన్‌. “నేను ఉరిశిక్షలు వేసే కుటుంబం నుండి వచ్చాను. ఎవరినైనా ఉరి వేయాలంటే ఒక్కసారి  ఉరితీసే స్థలాన్ని పరిశీలించాల్సి ఉంటుంది..ఉరి వేసే దోషుల కొలతను చూసి ఉరిశిక్షకు నన్ను సిద్ధం చేసుకోవాలి” అని పవన్ అన్నారు.

కాగా..తలారుల వంశంలో పవన్ ది నాలుగో తరం. కల్లు జల్లాద్‌ మొదటి తలారి. పవన్‌ అసలు పేరు సింధీరామ్‌. మీరట్‌లో ఓ చిన్న ఇంట్లో ఉంటాడు. భార్య, ఏడుగురు పిల్లలు ఉన్నారు. నిర్భయ దోషులను  ఉరి తీసిన డబ్బుతో తన కూతురు పెళ్లి చేస్తానని వపన్‌ అనడం ఎంతోమంది మనస్సులను కలచివేసింది. కదిలించివేసింది. 

కాగా..నిర్భయపై అత్యాచారం చేసిన దోషులకు జనవరి 22 న ఉరి తీయనున్న విషయం తెలిసిందే. ఈ రోజు కోసం తాను ఎదురు చూస్తున్నాననీ నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకుంటున్నానని పవన్ తెలిపాడు.