Categories
National Viral

భారత్ లో మిడతల దండు జ్ఞాపకాలు.. కరోనాతో పాటు..మరో తలనొప్పి

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్ కు ఇప్పుడు మిడుదల దండు రూపంలో మరో ప్రమాదం వచ్చి పడింది. దండులుగా వచ్చి పడుతున్న మిడతలతో వందల హెక్టార్ల ఎకరాల్లో పంటు క్షణాల్లో మాయం అయిపోతోంది. దీంతో రైతులు లబోదిబోంటున్నారు. వాటిని తరమటానికి నానా అగచాట్లు పడుతున్న క్రమంలో దండులుగా వచ్చి పడుతున్న మిడతలతో ‘ప్లేగు’వ్యాధి వస్తుందనే భయం వెంటాడుతోందని రాజస్థాన్ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం మిడతల దండు బీభత్సం..ఆహారం..పశుగ్రాసం కొరత

మళ్లీ ఆహార కష్టాలు తప్పవేమో..
రాజస్థాన్ జైసల్మేర్ లోని రామ్ ఘర్ గ్రామంలో ఛత్తర్ సింగ్ అనే 60 ఏళ్ళ వద్ధ రైతు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో తన పొలాల్లో దండులుగా చీకటి మేఘంలా కమ్ముకున్న మిడతల్ని చూసి..భయపడిపోయాడు. అటువంటి సందర్భాన్ని ముఫ్ఫై ఏళ్ల క్రితం శీతాకాలంలో చూశాననీ..అప్పుడువాటిని తరమటానికి పళ్లాలను కర్రలతో కొట్టటం..టైర్లు కాల్చటం చేసేవాళ్లమనీ..అప్పుడు మిడతల వల్ల వచ్చిన కష్టానికి అప్పుడు ప్రభుత్వం ఓ మిడతల విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిందని..ఈడిపార్ట్ మెంట్ రైతుల సహకారంతో చురుకుగా పనిచేసిందని..గుర్తు చేసుకున్నారు ఛత్తర్ సింగ్. ఆ మిడతల దండులతో సగానికి పైగా పంటలు నాశమైపోయాయని..తీవ్రంగా ఆహార కొరత ఏర్పడిందనీ..పశువులకు కూడా తిండి లేకుండా పోయిందని..దాంతో చాలా పశువులు చచ్చిపోయాయని గుర్తు చేసుకున్నారు ఛత్తర్ సింగ్. ఆ తరువాతి కాలంలో మిడతల బెడద లేకుండాపోయిందని..కానీ మళ్లీ ఇంతకాలనికి అంటే 30ఏళ్లకు ఇలా వచ్చి పడుతున్న మిడతల్ని చూసిన ఆ నాటి కష్టాల్ని గుర్తుచేసుకున్నారు. మళ్లీ అటువంటి పరిస్థితి వస్తుందని భయాందోళనలు వ్యక్తంచేశారు.

మిడతలు చిన్న పిల్లల్ని కూడా తినేయనే వార్తలు
దేశాలు..రాష్ట్రాల సరిహద్దులు దాటి వచ్చి పడుతున్న మిడతల దండు గురించి ఢిల్లీకి 800ల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రభాదుబే అనే 76 ఏళ్ల వృద్ధురాలు మాట్లాడుతూ..  తన చిన్నప్పుడు అంటే 1950,60లో యూపీలోని బలియాలో ఉండేవాళ్లం. అప్పుడు మా ప్రాంతంలో మిడతల దండు వచ్చినప్పుడు ఊరంతా చీకటిగా మారిపోయిందనీ..అవి ఇళ్లలోకి వచ్చేస్తాయని తలుపులు మూసుకుని ఇళ్లలోనే ఉండిపోయేవాళ్లమన్నారు. అలా తరచుగా మిడతలు దండులు దండులుగా వచ్చి పడేవన్నారు. కానీ అప్పట్లో మిడతలు పంట పొలాల్ని నాశనం చేసి తినటానికి ఏమీ లేక చిన్నపిల్లల్ని కూడా తినేశాయనే వార్తలొచ్చాయని కానీ అవి ఎంతవరకూ నిజమో తెలీదని ఆమె గుర్తు చేసుకున్నారు. 

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మరియు మహారాష్ట్ర ప్రాంతాలన్నింటినీ ధ్వంసం చేసిన మిడుతల దండులు ఢిల్లీవైపుగా కూడా వస్తున్న వాటిని గురించి పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ సంవత్సరం ప్రపంచ మహమ్మారి కరోనాకు తోడు ఈ మిడతల దండు మరొక విపత్తు కావచ్చని అభిప్రాయపడ్డారు. గ్రామాల వినాశనానికి ఇవి కారణమవుతున్నాయని..కొన్నొ వార్తాపత్రికలు ఈ మిడతలు ప్లేగు వంటివాటికి కూడా కారణమవుతాయని ప్రచురిస్తున్నాయి. 

ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి ఆహార,వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం 1900 నుంచి కొన్ని దశాబ్దాలకు మిడుతల దండు దాడులు జరుగుతున్నాయని తెలిపింది. 1926,31 మధ్య ఐదేళ్లలో మిడతల దండు రూ.2 కోట్ల విలువైన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపింది. తీవ్రంగా పశ్రగ్రాసం దెబ్బతిందనీ దీంతో భారీ సంఖ్యలో పశువులు మరణించాయని తెలిపింది. 

చివరిగా..1993 లో 172 దండయాత్రలు జరిగినట్లుగా గుర్తించబడింది. ఆ తరువాత..1997, 2005, 2010 మరియు 2015 లలో కూడా జరిగింది. కానీ చాలా తక్కువగా నష్టం జరిగింది. ఇలా మిడతల దండుల దాడులతో మరోసారి భారతదేశానికి కష్టంకాలం తప్పేలా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేకనుక నిజమైతే మరోసారి భారత్ తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుందనీ..అదేవిధంగా తీవ్రమైన పశ్రగ్రాసం కొతరకూడా తప్పదంటున్నారు. ఈకరోనా కష్టకాలంతో పాటు భారత్ ఈ మిడతల దండుల దాడులతో రానున్న కష్టాల్ని కూడా ఎదుర్కోక తప్పదంటున్నారు విశ్లేషకులు.

కాగా ప్రస్తుతం..కరోనా మహమ్మారితో తీవ్రంగా పోరాడుతున్న భారత్‌ను ఇప్పుడు మరో సమస్య కలవరపెడుతోంది. భారత సరిహద్దులోని పంటలపై మిడతలు పెద్ద ఎత్తున దాడిచేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం సాయంత్రం ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ శివారులో ఏకంగా మూడు కిలోమీటర్ల మేర మిడతల దండు కనిపించి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. రసాయనాలతో సిద్ధంగా ఉండాలంటూ అగ్నిమాపక సిబ్బందిని ఆదేశించారు. మిడతల సమూహం కనిపించడంతో అప్రమత్తమైన కలెక్టర్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 

Read: పంట పొలాల్లో డీజేలు..తీన్మార్ లతో మిడతల్ని తరిమేస్తున్న రైతులు