Categories
Crime National

బస్సులో మహిళకు వాంతులు: తల బయటపెట్టగానే తెగిపడింది!

సాధారణంగా కొంతమందికి ప్రయాణికులకు బస్సు వాతావరణం పడదు. బస్సులో కూర్చొగానే వాంతులు చేసుకుంటారు. ఇలాంటి అనుభవమే ఓ మహిళా ప్రయాణికురాలికి ఎదురైంది.

బస్సులో ప్రయాణించేటప్పుడు తల బయటపెడితే ప్రమాదమని హెచ్చరిస్తుంటారు. ప్రయాణికులు ఎవరైనా కిటికిలో నుంచి తల బయటపెట్టగానే బస్సు లోపలి కండెక్టర్, బస్సు డ్రైవర్ ముందుగానే ప్రయాణికులను హెచ్చరిస్తుంటారు.  సాధారణంగా కొంతమంది ప్రయాణికులకు బస్సు వాతావరణం పడదు. బస్సులో కూర్చొగానే వాంతులు చేసుకుంటారు. ఇలాంటి అనుభవమే ఓ మహిళా ప్రయాణికురాలికి ఎదురైంది. బస్సు కిటికీలో నుంచి బయటకు తల పెట్టి ఆమె వాంతులు చేసుకుంది. బస్సు డ్రైవర్ బస్సును వేగంగా నడుపుతున్నాడు. ఇంతలో రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభానికి ప్రమాదవశాత్తూ మహిళ తల బలంగా తాకింది.

అంతే బస్సు వేగానికి ఆమె తల చిధ్రమై తెగి రోడ్డుపై పడింది. ఈ భయానక ఘటన మధ్యప్రదేశ్ లో పన్నా జిల్లాలో జరిగింది. సత్నా జిల్లా నుంచి పన్నా జిల్లాకు బయల్దేరిన బస్సులో ఈ ప్రమాదం జరిగినట్టు కోత్వాలి పోలీసు స్టేషన్ ఇన్స్ పెక్టర్ అరవింద్ కుజుర్ తెలిపారు. మృతురాలు ఛహట్ పూర్ జిల్లాకు చెందిన ఆషా రాణిగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు చెప్పారు.  అతివేగంగా బస్సును నడిపిన డ్రైవర్ ను అరెస్ట్ చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు.