Categories
Movies Viral

షూటింగులకూ ‘కరోనా’ ఎఫెక్ట్..

‘కరోనా’ ఎఫెక్ట్ కారణంగా కొత్త సినిమాల షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎఫెక్ట్ కారణంటా కొత్త సినిమాల షూటింగ్‌లు ఆగిపోతున్నాయి. ఈ డేంజరస్ వైరస్‌ వల్ల ప్రపంచంలో చాలా రంగాలమీద ఎఫెక్ట్ పడినట్టే, మూవీ ఇండస్ట్రీ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. తెలుగు సినిమాలు కూడా కరోనా వైరస్‌కుఎఫెక్ట్ అయ్యాయి. 

ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని వీసాలు రెడీ చేసుకుని బ్యాగులు ప్యాక్ చేసుకుని షూటింగ్‌కి వెళ్దామనుకున్న సినిమా వాళ్లకు కరోనా గట్టి దెబ్బే కొట్టింది. కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ సినిమాతో పాటు.. కింగ్ నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమా కూడా కరోనా వైరస్‌తో ఎఫెక్ట్ అయ్యాయి.

 

wild dog

రామ్ గోపాల్ వర్మ.. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’  అనే మార్షల్ ఆర్ట్స్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇండో చైనీస్ మ్యూచ్యువల్ ప్రొడక్షన్‌లో వస్తున్న ఈ సినిమా బ్రూస్ లీకి వీరాభిమాని అయిన ఓ అమ్మాయి బ్యాక్ డ్రాప్‌లోరూపొందుతుంది. ఈ సినిమాకు సంబందించి కొన్ని సీన్స్‌ని చైనా పరిసర ప్రాంతాల్లో షూట్ చెయ్యాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం చైనాలో విపరీతంగా ఉన్న కరోనా వైరస్ వల్ల రెడ్ అలెర్ట్ అనౌన్స్ చెయ్యడంతో షూట్ క్యాన్సిల్ చేసుకున్నారు వర్మ అండ్ బ్యాచ్ . 

etgd

మరో సినిమా ‘వైల్డ్ డాగ్’ కూడా కరోనా వైరస్‌కు ఎఫెక్ట్ అయ్యింది. అశుతోష్ సాల్మన్ డైరెక్షన్లో నాగార్జున హీరోగా చేస్తున్న యాక్షన్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమా షూట్ కోసం బ్యాంకాంక్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్. కానీ ప్రస్తుతం కరోనా వైరస్‌తో బ్యాకాంక్‌కి వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ ఉండడంతో షూట్ పోస్ట్ పోన్ చేసింది టీమ్. ఇలా అక్కడెక్కడో చైనాలో కరోనా వైరస్ వస్తే.. ఆ దెబ్బకి టాలీవుడ్ కూడా ఎఫెక్ట్ అవుతోంది..