Categories
Andhrapradesh Latest Political

ఎవరీ సంచైత గజపతిరాజు.. ఆమెకు పూసపాటి వారత్వం ఉంటుందా

విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌(MANSAS TRUST) ఛైర్మన్‌గా సంచైతా గజపతి బాధ్యతలు తీసుకునే వరకూ ఆమె ఎవరో ఈ ప్రాంత ప్రజలకు

విజయనగరం రాజులకు చెందిన మాన్సాస్‌ ట్రస్ట్‌(MANSAS TRUST) ఛైర్మన్‌గా సంచైతా గజపతి బాధ్యతలు తీసుకునే వరకూ ఆమె ఎవరో ఈ ప్రాంత ప్రజలకు తెలియదు. ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ఓ రెండు జీవోలు సంచైత లైఫ్‌నే మార్చేశాయి. రాత్రికి రాత్రే ఆమె మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టటమే కాకుండా.. హఠాత్తుగా తెరపైకి వచ్చి పూసపాటి వంశీయుల చరిత్ర పుటల్లోకి ఎక్కారు.

అనూహ్యంగా ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సంచైత:
2020 మార్చి 4న మాన్సాస్‌ ట్రస్ట్ ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజు బాధ్యతలు తీసుకున్నారు. ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతి. వీరికి ఇద్దరు సంతానం. వారిలో చిన్న కుమార్తె సంచైత గజపతిరాజు. ఆనందగజపతిరాజు..ఉమా గజపతి వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అనంతరం బాలీవుడ్‌ డైరెక్టర్‌ రమేష్‌ శర్మను ఉమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయనగరం వైపు వచ్చిందే లేదు. ఇప్పటి జనరేషన్‌కు వీరి గురించి అసలు తెలియనే తెలియదు. అయితే సనా అనే స్వచ్ఛంద సంస్ధ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సంచైత. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పుడు ఆమె మాన్సాస్‌ ట్రస్ట్‌కు, సింహాచలం దేవస్థానానికి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం.. ఎవరి ఊహకు అందడం లేదు. 

బతికి ఉండగా వేధించిన కుటుంబం:
బఆనంద్‌ గజపతిరాజుతో ఉమా గజపతి విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలు కూడా రాజకుటుంబంతో కలవలేదు. తండ్రి ఆనందగజపతి రాజు ఉన్నంత కాలం ఇటు వచ్చిందే లేదు. అయితే ఆయన చనిపోయినప్పుడు మాత్రం విజయనగరం వచ్చారని .. వారికి తనకు తెలిసిన ఓ మిత్రుడి ఇంట్లో బస ఏర్పాటు చేశానని చెబుతున్నారు అశోక్‌ గజపతి రాజు. బతికి ఉండగా తన అన్న ఆనందగజపతిరాజును మానసికంగా వేధించిన ఆ కుటుంబం .. ఇప్పుడు ఇలా వచ్చి చిచ్చు పెట్టడం ఎంతవరకు సబబు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆశోక్‌ గజపతి రాజు.

మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నియామకంపై అశోక్ న్యాయపోరాటం:
ఆనంద్‌ గజపతిరాజు, ఉమా గజపతి చట్టపరంగా విడాకులు తీసుకున్నా.. వారిద్దరి సంతానమైన సంచైతకు పూసపాటి వారత్వం ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే న్యాయ విద్య చదివిన సంచైత.. చట్టపరంగా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే .. తండ్రి వారసురాలిగా పూసపాటి వంశంలోకి వచ్చారన్న చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అశోక్‌ గజపతిరాజును ఎదిరించలేక అదును కోసం ఇంతవరకూ వేచి చూసి.. ఇప్పుడు వైసీపీ సర్కారు అండతో … రాజకుటుంబంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ నియామకంపై అశోక్‌ గజపతిరాజు కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కోర్టు తీర్పు ఎలా వస్తుందన్న దానిపై.. విజయనగరం కోటలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read:  రాజుగారి ఇంట్లో వారసత్వ పోరు, బాబాయ్‌-అమ్మాయ్‌ మధ్య ముదురుతున్న వివాదం

Categories
Andhrapradesh Latest Political

రాజుగారి ఇంట్లో వారసత్వ పోరు, బాబాయ్‌-అమ్మాయ్‌ మధ్య ముదురుతున్న వివాదం

విజయనగరం పూసపాటి రాచ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం .. ఇప్పుడు యావత్తు తెలుగు ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మాన్సాస్‌ ట్రస్ట్(MANSAS TRUST)‌, మూడు లాంతర్ల (Three Lanterns Pillar) వ్యవహారంతో బాబాయ్‌, అమ్మాయ్‌కి మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. అసలు విజయనగరం మహారాజుల వారసత్వం ఎవరిది..? మాన్సాస్‌ ట్రస్ట్ ఎందుకు చేతులు మారింది..? 

మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత మరో వివాదం:
విజయనగరం పూసపాటి వంశీయులకు చెందిన మాన్సస్ ట్రస్ట్‌, అలాగే సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ట్రస్ట్‌ ఛైర్మన్‌ నియామకంలో జరిగిన పరిణామాలు మరువక ముందే తాజాగా విజయనగరంలో చోటుచేసుకున్న మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత మరో వివాదానికి దారితీసింది. అతిపురాతనమైన ఈ కట్టడాన్ని కూల్చివేయడంపై విపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు రాజవంశీయులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు కుటుంబం.. తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం.. ప్రభుత్వ నేతల తీరుపై అశోక్‌ గజపతిరాజు ధ్వజమెత్తారు. అయితే అశోక్‌ గజపతిరాజు అన్న కుమార్తె సంచైత కూడా ట్విట్టర్‌ వేదికగా బాబాయ్‌పై విమర్శలు గుప్పించారు. 

2

మోతీ మహల్‌ను ఎందుకు కూల్చారు:
1969లో నిర్మించిన మోతీమహల్‌ను ఎందుకు కూల్చివేశారని.. దాన్ని కూల్చకుండా బాగు చేయించొచ్చుగా అని ప్రశ్నించారు.. సంచైత. అయితే ఆమె తాత, తండ్రులు బతికి ఉండగానే వీటిని కూల్చివేశారని.. అప్పుడు ఎందుకు సంచైత ఈ ప్రశ్న అడగలేదంటూ అశోక్‌ గజపతి లేవనెత్తిన ప్రశ్న .. ఇప్పుడు చర్చనీయాంశమైంది. సంచైత ప్రస్తావించిన మోతీ మహల్ పూర్తిగా శిథిలమైందని దానిని పాఠశాలగా ఉపయోగిస్తున్నందువల్ల .. అది అకస్మాత్తుగా కూలిపోతే.. ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని అశోక్‌ చెప్పారు. అందుకే దాన్ని కూల్చి.. ఆ భవనం స్థానంలో మరో భవనాన్ని నిర్మించేందుకు .. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టామని చెప్పారు. 

సంచైత రాజకీయాల్లోకి వచ్చింది అందుకేనా:
అశోక్‌ గజపతిరాజు కుటుంబాన్ని, వారసత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికే సంచైతను రాజకీయంగా రంగంలోకి దించారన్న ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో .. సంచైత కూడా తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతున్నారు. పూసపాటి వంశీయుల వారసత్వ సంపద కేవలం ఒక్క వ్యక్తి చేతిలో ఉండదని .. అది తరతరాల నుంచి వస్తోందని చెబుతోంది. తాము కేవలం వారసత్వ సంపదకు సంరక్షకులం మాత్రమే అంటోంది. దీంతో బాబాయ్‌ అమ్మాయ్‌ మధ్య వాగ్వాదం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

Read: ఏడాది పాలనలో కేకు సంబరాలే తప్ప..డెవలప్ మెంట్ లేదు : వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

Categories
Andhrapradesh Political

మాన్సాస్ మంటలు : సంచయిత ఆధార్ కార్డు పరిశీలించండి – అశోక్ గజపతి రాజు

విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది.  సింహాచలం దేవస్థానం ఆస్తుల పాటు.. విలువైన ట్రస్టు భూములను కొట్టేయడానికి ప్రభుత్వం స్కెచ్‌ వేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. సంచయితను ట్రస్ట్ బోర్డ్ చైర్‌ పర్సన్‌గా తప్పించాలంటూ విజయనగరంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అటు టీడీపీ నేతలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంచయిత తెలిపారు.

మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదన్నారు కేంద్ర మాజీ మత్రి అశోక్‌గజపతిరాజు. సింహాచలం దేవస్థానం పరిధిలో 105 ఆలయాలు, విలువైన భూములు ఉన్నాయని, దేవస్థానం భూములపై కొందరు కన్నేశారని ఆరోపించారు. దాతలు ఇచ్చిన భూములు ఆలయానికే చెందాలని స్పష్టం చేశారు. ట్రస్టుకు రాజకీయాలతో సంబంధం లేదని, ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయన్నారు. పిల్లలకు భవిష్యత్‌ను ఇవ్వడానికే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సంచయిత ఆధార్‌ కార్డు పరిశీలిస్తే ఆమె ఎక్కడ నివసిస్తున్నారో అందరికీ తెలుస్తుందన్నారు.

తన మీద, తన కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం బాధగా ఉందన్నారు సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్‌పర్సన్ సంచయిత గజపతి. మహిళ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్‌గా ఎన్నికైతే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ఏ ఆశయం కోసం తన తాతగారు మాన్సాన్‌ ట్రస్ట్  ఏర్పాటు చేశారో ఆ ఆశయ సాధనకు పని చేస్తానన్నారు. సింహాచలం దేవాలయ భూములు, ట్రస్ట్ భూములు ఎవరికి చెందినవి కావని స్పష్టం చేశారు. తనను ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకోవడంపై.. టీడీపీ నేతలు కోర్టుకు వెళితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించారు, అప్పుడు మాట్లాడని వాళ్లు, ఇప్పుడెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సంచయిత ప్రశ్నించారు. 

మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.  మాన్సాస్‌ ట్రస్ట్‌ ఆస్తులపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని చంద్రబాబు ఆరోపించారు. సింహాచలం ఆలయ భూములు లాక్కోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వంగా వస్తున్న ఆస్తులపై ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని మండిపడ్డారు. అటు బీజేపీ కూడా వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.  భూములను కొట్టేయడానికే ట్రస్ట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌, సీనియర్‌ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. సంచయిత వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఇతర మతానికి చెందిన సంచయితకు ఆలయ బాధ్యతలు అప్పగించారంటూ విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. 

Read More : మాన్సాస్ ట్రస్టు వివాదం : ఏపీలో సంచయిత రాజకీయం

Categories
Andhrapradesh Political

మాన్సాస్ ట్రస్టు వివాదం : ఏపీలో సంచయిత రాజకీయం

విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్ చైర్‌పర్సన్‌ .. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పాలకవర్గం నియామక వ్యవహారంపై రాజకీయ రచ్చ ముదురుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన హక్కుతో.. ఇంతకాలం ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌గా కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజును తప్పించి.. ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతిరాజుకు ట్రస్ట్‌ బోర్డ్ నిర్వహణా బాధ్యతలను అప్పగించడం వివాదాస్పదంగా మారింది. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త హక్కులనూ  సంచయితకే అప్పగించడంపై టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంచయిత హిందూ కాదని.. ఆలయ ధర్మం మంటకలిసిపోతుందని మండిపడుతున్నాయి.

పూసపాటి రాజవంశీయులు చేసిన కృషి : –
విజయనగరానికి  విద్యల నగరంగా, కళలలకు అనధికార రాజధానిగా  పేరు రావడానికి.. పూసపాటి రాజవంశీయులు చేసిన కృషే కారణం. విజయనగరం సంస్ధానం చివరి పట్టాభిషక్తులైన  పీవీజీ రాజు, తన తండ్రి అలకనారాయణ గజపతి పేరున మాన్సాస్‌ ట్రస్టును ఏర్పాటు చేసి, విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎందరో  విద్యావంతులను తీర్చిదిద్దిన ఘనత మన్సాస్ ట్రస్టుకుంది. అయితే ఇప్పుడీ ట్రస్టుతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అప్పన్న దేవస్థానంలో రాజకీయ చిచ్చు రేగింది. మాన్సాస్‌  చైర్మెన్‌గా, అప్పన్న  ఆలయ అనువంశిక ధర్మకర్తగా వున్న మాజీ మంత్రి అశోక గజపతి రాజుని ఆ పదవి నుంచి తొలగించి. సంచయితా గజపతిరాజును నియమించింది.  

ఆనంద గజపతి రాజు మరణం తర్వాత :-
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా అనువంశిక ధర్మకర్తగా ఉన్న పూసపాటి వంశీయులే కొనసాగడం సంప్రదాయంగా వస్తోంది. 1958లో పీవీజీ రాజు దీనిని ఏర్పాటు చేయగా.. ఆయన మరణం తర్వాత పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు ఆ బాధ్యతలు చేపట్టారు. సుమారు 16 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగారు. ఈ సమయంలో అశోక్ గజపతిరాజు ఏనాడూ ఆ పదవికి ఆశ పడకపోవడమే కాకుండా, తన వంశ సంప్రదాయాలను గౌరవిస్తూ వచ్చారు. సోదరుడు ఆనంద గజపతి రాజు మరణం తర్వాత మాత్రమే అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టారు.

సంచయిత.. ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె :- 
అయితే తాజాగా అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును పక్కన బెట్టి.. ఆయన సొదరుడు ఆనంద గజపతి కుమార్తెను ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్‌గా నియమించడం వివాదాస్పదంగా మారింది.  సంచయిత.. ఆనంద గజపతి రాజు మొదటి భార్య ఉమా కుమార్తె. కొన్ని కుటుంబ కారణాల రీత్యా అప్పట్లో ఆనంద గజపతి, ఉమాలు వేరుపడి, విడాకులు కూడా తీసుకున్నారు. కొంతకాలం తర్వాత ఆనంద్ గజపతి రెండో వివాహం చేసుకున్నారు. 

రాజకీయం నడుస్తోందా :-
ఆనంద్ గజపతి, ఉమాల మధ్య విడాకుల తర్వాత విజయనగరం పూసపాటి వంశీయులకు, సంచయిత కుటుంబానికి ఎటువంటి సంబంధాలు కొనసాగలేదు. సంచితకు తన పిన తండ్రి అశోక్ గజపతి కుటుంబంతో కూడా ఎటువంటి సన్నిహిత సంబంధాలు లేవు. అయితే సడన్‌గా సంచయిత తెరమీదకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గజపతిరాజు అటు అప్పన్నదేవస్ధానం, ఇటు  మాన్సాస్‌లకు చైర్మెన్‌గా రావడం వెనుక పెద్ద రాజకీయమే నడుస్తుందని టీడీపీ ఆరోపిస్తోంది.

అదితికి చెక్ పెట్టేందుకే : –
మరోవైపు అశోక్ గజపతి రాజు కుమార్తె అదితికి చెక్ పెట్టేందుకే.. వైసీపీ ఎప్పుడో ఈ ప్రాంతానికి దూరమైన ఆనంద గజపతి వారసులను తెర మీదకు తెచ్చారనే చర్చ సర్వత్రా సాగుతోంది. ప్రస్తుతం విజయనగరం సంస్థానంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ అంటోంది. మరోపక్క పూసపాటి రాజస్థానానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. 

విజయనగరంలో టీడీపీ నేతల ఆందోళన : – 
విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది.  సింహాచలం దేవస్థానం ఆస్తుల పాటు.. విలువైన ట్రస్టు భూములను కొట్టేయడానికి ప్రభుత్వం స్కెచ్‌ వేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. సంచయితను ట్రస్ట్ బోర్డ్ చైర్‌ పర్సన్‌గా తప్పించాలంటూ విజయనగరంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అటు టీడీపీ నేతలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంచయిత తెలిపారు.
Read More : ఏపీలో 25 జిల్లాలు..జగన్‌తో మాట్లాడా – కేసీఆర్

Categories
Andhrapradesh Political

జగన్ కు జై కొట్టిన సంచిత : 3 రాజధానులపై అశోక్ గజపతి రాజుకు కూతురు షాక్

ఏపీ రాజధాని వికేంద్రీకరణ అంశం దుమారం రేపుతోంది. మూడు రాజధానులపై పెద్ద రచ్చ జరుగుతోంది. ప్రాంతాలకు అతీతంగా టీడీపీ నాయకులు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ముద్దు అని నినదిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సైతం మూడు రాజధానులను వ్యతిరేకించారు. జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇది ఇలా ఉంటే.. సొంత ఇంట్లోనే అశోక్ గజపతి రాజుకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అన్న(ఆనందగజపతిరాజు) కూతురు, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు పూసపాటి సంచిత గజపతి రాజు షాక్ ఇచ్చారు.

రాజధాని వికేంద్రీకరణపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సంచిత స్వాగతించారు. బుధవారం(జనవరి 22,2020) ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంచిత గజపతిరాజు.. అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వెనుకబడిన కర్నూలులో హైకోర్టు, విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు. రాజధాని పేరుతో రైతుల దగ్గర చంద్రబాబు బలవంతంగా లాకున్న భూమిలు తిరిగి ఇచ్చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు ముందే ఎందుకు పారిపోయి వచ్చారని సంచిత ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ.. రాజధానిపై పూర్తి నివేదిక ఇవ్వకుండానే అమరావతి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధపడిందని సంచిత ఆరోపించారు. అమరావతి అనేది చట్ట విరుద్ధం నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా.. చంద్రబాబు బాధ్యత లేకుండా వ్యవహరించారని విమర్శించారు. టీడీపీని ప్రజలు ఎ‍ప్పడో తిరస్కరించారని, రాజధానిపై మాట్లాడే కనీస హక్కు చంద్రబాబుకి, ఆ పార్టీ నేతలకు లేదన్నారు. అమరావతి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను సంచిత ప్రశంసించారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పడూ సహకారంగా ఉంటారని, దీనిలో రాజకీయం చేసే దురాలోచన ఆయనకు లేదన్నారు. రెండేళ్ల క్రితమే సంచిత బీజేపీలో చేరారు.

జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంచిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అటు అశోక్ గజపతి రాజు కుటుంబంలో, ఇటు బీజేపీ శ్రేణుల్లో సంచలనంగా మారాయి. ఎంతో అనుభవం ఉన్న బాబాయ్ అశోక్ మాటను కొట్టేస్తూ అమ్మాయి చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. అభివృద్ది వికేంద్రీకరణకు ఓకే.. పరిపాలన వికేంద్రీకరణను మాత్రం ఒప్పుకునేది లేదని బీజేపీ ఇప్పటికే స్టేట్ మెంట్లు ఇచ్చింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఏపీ బీజేపీ నేతలు ఓపెన్ గానే ఖండించారు. అంతేకాదు.. అమరావతి రాజధాని కోసం పోరాటాలకు రెడీ అవుతున్నారు. సంచిత మాత్రం.. జగన్ నిర్ణయాన్ని స్వాగతించి బీజేపీలో సంచలనం రేపారు. మరి సంచిత వ్యాఖ్యలపై బీజేపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Also Read : టీడీపీకి షాక్ : ఇద్దరు మాజీ మంత్రులపై సీఐడీ కేసులు

Categories
Uncategorized

రాజుల జిల్లా టీడీపీ ఖిల్లా..! : సైకిలెక్కేసిన సంస్ధానాధీశులు

రాజకీయాల్లో మిత్రులుండరు..శత్రువులుండరు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు రాజకీయ పార్టీల్లో పదవులను అనుభవించిన వారంతా..ఇప్పుడు ఒకే గొడుకు కిందకు చేరి చేయి చేయి కలుపుతున్నారు. విజయనగరం జిల్లాలోని నలుగురు ప్రధాన సంస్థానాధీశులు టీడీపీ పార్టీలో చేరి.. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. నాటి వైరాన్ని, రాజకీయ ద్వేషాలను పక్కన పెట్టడం గమనార్హం. 

విజయనగరం సంస్థానాదీశులు : 
విజయనగరం, బొబ్బిలి, కురుపాం, చినమేరంగి సంస్థానాలు ప్రధానం. విజయనగరం సంస్థానాదీశులు నాటి రాచరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ తమ ప్రతిష్టను కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రధానంగా విజయనగరం సంస్థానాదీశులు ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీకి పెద్ద దిక్కు. 1978లో జనతా పార్టీ నుంచి విధాన సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 1982లో టీడీపీలో చేరారు. ఇదే పార్టీలో కొనసాగుతూ.. వివిధ పదవులను అనుభవించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 2004 ఎన్నికల్లో తప్ప.. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చారు. 

బొబ్బిలి సంస్థానం : 
శౌర్యప్రతాపాల గడ్డగా పిలిచే బొబ్బిలి సంస్థానాదీశులు కూడా .. నాటి నుంచి నేటి వరకు తమ ప్రతిష్టను పెంచుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయ కృష్ణ రంగారావు కుటుంబం..మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఈ పార్టీ నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికలకు ముందు సుజయ వైసీపీలో చేరి విజయం సాధించారు. అయితే…వైసీపీ సీనియర్ నేత బొత్స ఫ్యామిలీతో రాజకీయ వైరం ఉంది. ఆ పార్టీని వీడిన సుజయ కృష్ణ టీడీపీలోకి జంప్ అయ్యారు. 

చినమేరంగి సంస్థానం : 
మాజీ మంత్రి శత్రుచర్ల కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంది. ఈయన కాంగ్రెస్ పార్టీలో పలు పదవులను అనుభవించారు. మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులను చేపట్టారు. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందారు. ఈయన కూడా టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు.

కురుపాం జమిందారు  : 
కురుపాం జమిందారు వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా అశోక్ గజపతిరాజుతో చేతులు కలిపి, త్వరలో సైకిల్ ఎక్కనున్నారు. సుమారు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పని చేసి, వివిధ పదవులను అనుభవించారు. ఇటీవలనే ఆయన విజయనగరం సంస్థానాదీశులు అశోక్ గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిసి.. టీడీపీలోకి తన రాకపై సంసిద్ధను తెలిపారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదైన కిశోర్ చంద్రదేవ్ కూడా ఇలా పార్టీ మారి సైకిల్ ఎక్కుతుండటం .. రాజకీయాల్లోనే ఒక కొత్త అధ్యాయానికి తెరతీసినట్లైంది. 

మొత్తం మీద నాటి సమైకాంధ్రా ఉద్యమం ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో.. చేసేది లేక కాకలు తీరిన నేతలు సైతం ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. రాజుల జిల్లా అయిన విజయనగరం.. ఇప్పుడు టీడీపీ ఖిల్లాగా మారిపోయిందనే చర్చ జరుగుతోంది.

Categories
Uncategorized

అదే మాట : పవన్ ఎవరో తెలియదన్న అశోక్ గజపతి రాజు

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు మరోసారి హాట్‌ కామెంట్స్ చేశారు. ఇప్పుడీ కామెంట్స్‌.. రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. గతంలో ఓ సారి అశోక్‌ గజపతికి పవన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాజా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సినిమాలు చూసే అలవాటు లేదు 
చిరంజీవి తెలుసు.. వాళ్ల నాన్న తెలుసు 
టీటీడీ ఈవో సింఘాల్ నియమాకాన్ని తప్పుపట్టిన పవన్
అశోక్‌గజపతిరాజుకు నేనెవరో తెలియకపోవచ్చు – పవన్
అణగారిన ప్రజలకు నేనెవరో తెలుసు- పవన్
అశోక్‌గజపతి రాజు కామెంట్స్‌పై జనసైనికుల ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎవరో తనకు తెలియదని మరోసారి అన్నారు మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు. పవన్ కల్యాణ్ సినిమా నటుడు అంటున్నారని, తాను సినిమాలు చూడనని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తెలుసు. పవన్ కళ్యాణ్ వాళ్ల నాన్న కూడా నాకు తెలుసన్నారు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఒక పనికోసం తన వద్ద కొస్తే చేసిపెట్టినట్లు చెప్పారు. 

గతంలో ఇదే అంశంపై అశోక్‌గజపతి రాజు, పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కూడా.. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదన్నారు అశోక్‌ గజపతి రాజు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఓ ఉత్తరాది వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించడమేంటని పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదన్నారు. టీటీడీ ఈవో ఎంపికపై తాను స్పందించనని అన్నారు.

తానెవరో తెలియదన్న టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజుపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సెటైర్ వేశారు. అశోక్‌గజపతిరాజుకు తానెవరో తెలియకపోవచ్చు కానీ.. అణగారిన ప్రజలకు తానెవరో తెలుసని చెప్పారు. అటు అశోక్ గజపతిరాజు కామెంట్స్ పై అప్పట్లో జనసైనికులు, పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కీలకపాత్ర పోషించిన పవన్ తెలియదా అంటూ మండిపడ్డారు. అశోక్‌ గజపతి రాజు తాజా మాటలు విన్న జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు గజపతి వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.