Categories
Movies

మూవీ రివ్యూ – ఫ్యాన్స్‌కి ఫుల్‌మీల్స్

పేట ఈ సంక్రాంతికి తలైవా ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చే సినిమా.

సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరోయిన్లుగా నటించగా, కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో, కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మించిన సినిమా, పెట్టా.. ఈసినిమాని, తెలుగులో పేట పేరుతో డబ్ చేసారు. బాషా తర్వాత సంక్రాంతికి రిలీజవుతున్న రజినీ సినిమా పేటనే కావడంతో తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 10) పేట, తమిళ్, తెలుగులో భారీగా రిలీజ్ అయ్యింది. తెలుగు పేట ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ : 

కాళీ (రజినీకాంత్) ఒక హాస్టల్ వార్డెన్. అక్కడ స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలను తనదైన స్టైల్‌లో పరిష్కిరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. ఒకానొక టైమ్‌లో, కాలేజీలో చదువుకునే ఒక ప్రేమ జంటకి పెళ్ళి చేస్తాడు కాళీ. అప్పుడు అనుకోకుండా అక్కడి లోకల్ రౌడీతో గొడవ జరుగుతుంది. కాళీ అసలు పేరు పేట అని, అతనిది ఉత్తరప్రదేశ్ అనీ, అక్కడ సింహాచలం (నవాజుద్దీన్ సిద్ధిఖీ) అనే రాజకీయ నాయకుడితో పేటకి విభేదాలున్నాయని తెలుస్తుంది. అసలు కాళీకీ, సింహాచలానికీ గొడవలేంటి, కాళీ మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్ళాడా, లేదా? అనేది పేట కథ.

నటీనటులు, సాంకేతిక నిపుణులు :

సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ గురించీ, ఎనర్జీ అండ్ మేనరిజమ్స్ గురించీ కొత్తగా చెప్పక్కర్లేదు. కబాలి, కాలా వంటి సినిమాల్లో ఆయన స్టైల్ మేనరిజమ్స్ లేకపోవడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్‌కి, పేట కాస్త ఊరటనిస్తుంది. యంగ్ గెటప్‌లో రజినీ స్టైల్, సిమ్రన్‌తో లవ్ ట్రాక్‌లో కుర్రాడిలా మారిపోయి ఆడియన్స్‌ని మెప్పించిన రజినీ, కాళీగానూ చక్కగా నటించాడు. సిమ్రన్, త్రిష లుక్స్, యాక్టింగ్ పరంగా ఆకట్టుకుంటారు. బాబీ సింహా, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ క్యారెక్టర్స్‌కి పెద్దగా స్కోప్ లేదు. అనిరుధ్ పాటలు సినిమాకి అడ్డుపడుతున్నాయనే ఫీలింగ్ తీసుకొస్తే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా కొట్టాడు. తిరు కెమెరా వర్క్ బాగుంది.

పిజ్జా, జిగర్తండా సినిమాలతో తమిళనాట దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్, రజినీని వేరే రూట్‌లోకి తీసుకెళ్ళి, కొత్త యాంగిల్‌లో ప్రజెంట్ చేస్తాడని రజినీ ఫ్యాన్స్, ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసారు. కట్ చేస్తే, కార్తీకే రజినీ రూట్‌లోకి వచ్చి, ఆయన ఇమేజ్‌నీ, అభిమానులకు కావాల్సిన కయర్షియల్ ఎలిమెంట్స్‌నీ దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నాడు. ఫస్ట్‌హాఫ్‌లో అసలు కథ అనేదే ఉండదు. సెకండ్ హాఫ్ సాదాసీదా రివేంజ్ డ్రామాగా సాగిపోతుంది. భాషా, ముత్తు, నరసింహా సినిమాల తరహాలో, ఫ్లాష్ బ్యాక్ కాస్త స్ట్రాంగ్‌గా ఉండుంటే, సినిమా మరోలా ఉండేది. పేట ఈ సంక్రాంతికి తలైవా ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చే సినిమా..

వాచ్ పేట ట్రైలర్…  
 

Categories
Movies

రజినీ సినిమాకి రెండు థియేటర్లేనా?

పేట వచ్చిన తర్వాత రోజు వినయ విధేయ రామ, దాని తర్వాత ఎఫ్2 సినిమాలు రిలీజవుతుండడంతో, రెండవ రోజునుండి కేవలం రెండంటే రెండు థియేటర్లకే పరిమితం కానుంది.

ఈ సంక్రాంతికి, ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2 సినిమాలతో పాటు, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ సినిమా పేట్టా, తెలుగులో పేటగా రిలీజ్ అవబోతున్న సంగతి తెలిసిందే. అయితే, మొన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పేటని తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత అశోక్ వల్లభనేని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ సంఘటన గురించి ఫిల్మ్‌‌నగర్‌లో చర్చలు జరుగుతుండగానే, పేట గురించిన మరో వార్త సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. సూపర్ స్టార్ సినిమాకి హైదరాబాద్‌లో కేవలం రెండే రెండు థియేటర్లే ఉన్నయాంట.

మొదటిరోజు ఓమోస్తరు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తుండగా, పేట వచ్చిన తర్వాత రోజు వినయ విధేయ రామ, దాని తర్వాత ఎఫ్2 సినిమాలు రిలీజవుతుండడంతో, రెండవ రోజునుండి కేవలం రెండంటే రెండు థియేటర్లకే పరిమితం కానుంది. వాటిలో ఒకటి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సప్తగిరి థియేటర్, ఇంకోటి మల్కాజ్‌గిరి రాఘవేంద్ర థియేటర్.. కూకట్‌పల్లి, దిల్‌షుక్‌నగర్ లాంటి ఏరియాల్లో సింగిల్ స్క్రీన్లూ, మల్టీప్లెక్స్‌లు ఉన్నా, పేటకి మాత్రం స్పేస్ దొరకలేదు. దీనిపై పేట నిర్మాతఅశోక్ వల్లభనేని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి. 

వాచ్ పేటా తెలుగు ట్రైలర్…  
 

Categories
Movies

సూపర్ స్టార్ సినిమా సెన్సార్ పూర్తి

బాషా తర్వాత సంక్రాంతికి రిలీజవుతున్న రజినీ సినిమా పేటనే కావడం విశేషం. జనవరి 10న పేట, తమిళ్, తెలుగులో రిలీజవనుంది.

ఈ సంక్రాంతికి, ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2 సినిమాలతో పాటు, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ సినిమా పేట్టా, పేటగా తెలుగులో రిలీజ్ అవబోతుంది. రైట్స్ కొనడం దగ్గరినుండి, డబ్బింగ్ వరకు అన్ని పనులు మెరుపు వేగంతో జరిగిపోతున్నాయి. ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తయిపోయింది. పేట సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సిమ్రన్, త్రిష హీరోయిన్లుగా నటించగా, కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో, కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మించి పెట్టా సినిమాని, తెలుగులో పేటగా రిలీజ్ చేస్తున్నాడు నిర్మాత అశోక్ వల్లభనేని.

పేట ట్రైలర్ అండ్ ఆడియో సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. బాషా తర్వాత సంక్రాంతికి రిలీజవుతున్న రజినీ సినిమా పేటనే కావడం విశేషం. జనవరి 10న పేట, తమిళ్, తెలుగులో రిలీజవనుంది.

వాచ్ పేటా తెలుగు ట్రైలర్…  
  
 

Categories
Movies

కాళికి కోపమొస్తే భస్మమే

సూపర్ స్టార్ రజినీకాంత్ పేట తెలుగు ట్రైలర్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, సిమ్రన్, త్రిష హీరో, హీరోయిన్లుగా, యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో, కళానిధి మారన్ సమర్పణలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా.. పెట్టా.. తెలుగులో పేట పేరుతో రిలీజ్ కాబోతుంది.  మొన్నామధ్య రిలీజ్ చేసిన ఆడియోకి, పోస్టర్స్‌కి, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

టీజరే అనుకుంటే, అంతకుమించి ట్రైలర్‌లో రచ్చ చేసాడు రజినీ. సూపర్ స్టార్ స్టైల్, లుక్స్ పరంగా అదరగొట్టేసాడు. పెద్ద పెద్ద మీసాలతో, గెడ్డంతో రఫ్ లుక్‌లోనూ కనిపించిన రజినీ, యాక్షన్ సీన్స్, రొమాంటిక్ సీన్స్‌లో ఇరగదీసేసాడు. ఇక తన స్టైల్ చెప్పే డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ట్రైలర్ చివర్లో రజినీ బ్లాక్ కుర్తా, తెల్ల పంచెలో చేతులతో స్టెప్పు వేసుకుంటూ రావడం అయితే అదిరిపోయింది. 

పేటలో రజినీ, డాన్‌గా, హాస్టల్ వార్డెన్‌గా రెండు ఢిఫరెంట్ రోల్స్ చేసాడని తలుస్తోంది. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్దిఖీ, శశికుమార్, మేఘా ఆకాష్ తదితరులు నటిస్తున్న పెట్టా, జనవరి 10న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

వాచ్ పెట్టా తెలుగు ట్రైలర్…