Categories
Movies

ఎల్లలు దాటిన అభిమానం.. తారక్ పాటకు చైనా ఫ్యాన్స్ స్టెప్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరూ అభిమానిస్తుంటారనే సంగతి తెలిసిందే. తారక్ డైలాగ్స్, డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఫ్యాన్స్ ఎన్టీఆర్ డైలాగులు చెప్పడం, పాటలకు డ్యాన్స్ వేయడం చూశాం. తాజాగా చైనాకు చెందిన తారక్ అభిమానులు చేసిన డ్యాన్సింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తారక్ నటించిన ‘అశోక్’ సినిమాలోని గోలా గోలా రంగోలా అనే పాటకు ఓ యువతి, యువకుడు బ్యూటిఫుల్ మూమెంట్స్ వేశారు. అచ్చు తారక్, సమీరా రెడ్డిలా కాస్ట్యూమ్స్ వేసుకుని అంతే ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేశారు. HIROMUNIERU పేరుతో వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇదే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లో కూడా వీడియో అప్‌లోడ్ చేశారు. తారక్ అభిమానులు ఈ వీడియోను పలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.

Read:పంద్రాగష్టుకు ‘మైదాన్’

Categories
Movies

భూమి ఫడ్నేకర్‌ ‘దుర్గావతి’ ప్రారంభం

‘భాగమతి’ హిందీ రీమేక్‌ ‘దుర్గావతి’ ప్రారంభం..

భూమి ఫడ్నేకర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దుర్గావతి’. తెలుగులో హిట్‌ సాధించిన అనుష్క ‘భాగమతి’ (2018) చిత్రానికి ఇది హిందీ రీమేక్‌. అక్షయ్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో విక్రమ్‌ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Image result for bhaagamathie

‘భాగమతి’ చిత్రానికి దర్శకత్వం వహించిన జి. అశోకే ‘దుర్గావతి’ని తెరకెక్కిస్తుండటం విశేషం. దర్శకుడిగా హిందీలో అశోక్‌కి ఇది తొలి చిత్రం. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా భూమి ఫడ్నేకర్‌ నటిస్తున్న ఈ చిత్రంలో మహీ గిల్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు.

Image

‘‘దుర్గా మాత ఆశీర్వాదంతో ‘దుర్గావతి’ చిత్రీకరణ మొదలైంది. నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాను. టాల్‌ అండ్‌ స్ట్రాంగ్‌గా నిలబడటానికి నేను రెడీ అక్షయ్‌ సార్‌’’ అన్నారు భూమి. ‘దుర్గావతి’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Categories
Education and Job Hyderabad

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ఫలితాలు కారణం కాదు

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు విద్యార్థులకు శాపంగా మారిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో పొరపాట్ల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంటర్ లో ఫెయిల్  అయ్యామనే మనస్తాపంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు దుమారం రేపాయి. ఇంటర్ బోర్డు అధికారుల వైఖరికి నిరసనగా ఆందోళనలు జరిగాయి. దీనిపై  ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పందించారు. ఇంటర్‌ ఫలితాల్లో పొరపాట్ల కారణంగానే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆయన తేల్చి చెప్పారు. ఆత్మహత్య  చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలను ఇంటర్‌ బోర్డు పరిశీలించగా ఫలితాల్లో దొర్లిన సాంకేతిక పొరపాట్లకు, ఆత్మహత్యలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడైందని ఆయన స్పష్టం చేశారు.

ఆత్మహత్యలకు పాల్పడిన, యత్నించిన 53మంది విద్యార్థుల జవాబుపత్రాలను నిశితంగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ నిర్వహించగా చెప్పుకోదగ్గ తప్పిదం జరిగినట్టు తేలలేదని అశోక్ స్పష్టం  చేశారు. ఫలితాల ప్రకటన కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు చెప్పడానికి గల తప్పిదం రీ-వెరిఫికేషన్‌లో కానీ రీ-కౌంటింగ్‌లో కానీ బయటపడలేదని చెప్పారు. గ్లోబరీనాతో పాటు  టెక్ మెథడక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వేర్వేరుగా 12 కేంద్రాల్లో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబుపత్రాలను దిద్దినట్టు అశోక్ చెప్పారు. ఈ రెండు సంస్థలు నిర్వహించిన  రీ-వెరిఫికేషన్..రీ-కౌంటింగ్‌లో ఫలితాలు ఒకేలా ఉన్నాయని వివరించారు. ఆత్మహత్యకు పాల్పడిన 25మంది విద్యార్థుల్లో 10మంది విద్యార్థులు ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ కాగా 12 మంది విద్యార్థులు  ఒకటికి మించిన సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని చెప్పారు. ముగ్గురు విద్యార్థులు పాస్ అయినా ఆత్మహత్యకు పాల్పడినట్టు బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు.

85శాతం మార్కులు వచ్చినా ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని అశోక్ చెప్పారు. మరో విద్యార్థిని పరీక్ష రాసి ఫెయిల్‌ అవుతామన్న ఆందోళనతో ఆత్మహత్య చేసుకుందన్నారు. కానీ ఆ విద్యార్థి  అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యినట్టు చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబుపత్రాల రీ-వెరిఫికేషన్.. రీ-కౌంటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. మే 10వ తేదీ లోగా ఫలితాలను  ప్రకటిస్తామన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత 15 రోజులకు స్కాన్ చేసిన జవాబు పత్రాలు ఇస్తామన్నారు. ఫలితాల్లో తప్పుల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వేలాది మంది  ఫెయిల్‌ అయ్యారని మీడియా అసత్య ప్రచారం చేస్తోందని అశోక్ మండిపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతంలోనూ పెద్దగా వ్యత్యాసం లేదన్నారు. విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు  తీసుకోకుండా వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

Categories
Education and Job Hyderabad

తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం : ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్

చిన్న తప్పిదం వల్ల ఒక్కరిద్దరికీ నష్టం జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి అశోక్ అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షకు హాజరుకాని వారిని పాస్ చేయడమంటూ జరుగదన్నారు. అలాగే పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం.. ఫెయిల్ అయిన వారిని పాస్ చేయడం ఎక్కడా జరుగదని తెలిపారు. టెక్నికల్ అవగాహన లోపంతో మీడియాలో ఇలాంటి కథనాలు వచ్చాయన్నారు. ఇంటర్ బోర్డు చెక్కుచెదరలేదని..పారదర్శకంగానే చేస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆయన వివరణ ఇచ్చారు. 

ఇంటర్ బోర్డు పారదర్శకంగా మూల్యాంకనం చేసిందన్నారు. అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నాయని ..వాటిని సరి చేస్తామన్నారు. బబ్లింగ్ లో టోటల్ మార్కుల దగ్గర 99 వేయాల్సి ఉండగా 00గా వేశారని తెలిపారు. తప్పులు దొర్లిన ముగ్గురు విద్యార్థుల మార్కులు సవరించామని తెలిపారు. ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ చేయడంలో కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు గల్లంతు కాలేదన్నారు. పోలీసుల నిఘా మధ్య జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయని తెలిపారు. పాసైన వారు ఫెయిల్ అయినట్లు ఎక్కడా చూపించలేదన్నారు.

బార్ కోడ్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఓఎంఆర్ షీట్లు ఉంటాయని. ..పార్టీ 3 లో బబ్లింగ్ ఉంటుందని తెలిపారు. నవ్య అనే అమ్మాయికి 99 మార్కులు వస్తే ఎగ్జామినర్ 00 గా బబ్లింగ్ చేశారని చెప్పారు. ఎగ్జామినర్, స్క్రూటినైజర్ చూసుకోలేదన్నారు. వెంటనే సరిదిద్దామని… విద్యార్థినికి కూడా సమాచారం ఇచ్చామన్నారు. నవ్యకు సంబంధించి పెద్ద తప్పు జరిగిందని.. ఆమె పేపరును తెప్పించుకుని పరిశీలించి.. సవరించామని తెలిపారు. తప్పు చేసిన ఇద్దరిపైన చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేస్తే చార్జ్ మెమోతోపాటు పెనాల్టీ కూడ ఉంటుందన్నారు. అవకతవకలు జరిగి ఉంటే జవాబు పత్రం ఇస్తామని చెప్పారు. తమ నుంచి తప్పు లేదనడం లేదన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఉంటుందన్నారు. రివాల్యుయేషన్ ఉంటుందా? ఉండదా.. ? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.

Categories
Hyderabad

ఐటీ గ్రిడ్స్ కేసు : అశోక్ ఎక్కడ ? 

ఐటీ గ్రిడ్స్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఓవైపు ఈ కేసులో అసలు సూత్రదారులు ఎవరు.. డేటా లీకేజీ వెనక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతూనే సీఈవో అశో‌క్ కోసం వేట ముమ్మరం చేశారు. ఇప్పటికే రెండు నోటీసులు ఇవ్వగా.. వాటికి అశోక్ స్పందించలేదు. బుధవారం విచారణకు హాజరవ్వాల్సి ఉన్నా.. అశోక్ అడ్రస్ లేదు. దీంతో… అశోక్ పై చర్యలకు సిట్ రంగం సిద్ధం చేసింది.

మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌, బ్లూఫ్రాగ్‌ సంస్థల్లో పోలీసులు సోదాలు నిర్వహించి హార్డ్‌డిస్క్‌లు సహా ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. డేటా చౌర్యానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని.. అశోక్‌కు మార్చి 2, 3 తేదీల్లో నోటీసులు జారీ చేశారు. అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన అశోక్‌ నోటీసులకు స్పందించలేదు. తాజాగా మార్చి 11వ తేదీ సోమవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను కేపీహెచ్‌బీలోని ఆయన ఇంటికి అంటించారు. గోషామహల్‌లోని సిట్‌ కార్యాలయంలో హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

అయితే.. ఇంటికి నోటీసులు అంటించినా అశోక్ విచారణకు హాజరు కాకపోవడంతో చర్యలకు సిట్ సిద్ధమవుతోంది. అశోక్ వ్యవహారంలో సిట్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తోంది. సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని సిట్ భావిస్తోంది. అశోక్ కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అశోక్ కాల్ డేటాతో పాటు లొకేషన్స్‌‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. 

Categories
Hyderabad

ఎక్కడున్నా పట్టేస్తాం : IT గ్రిడ్స్ చైర్మన్ అశోక్ ఫై లుక్ అవుట్ నోటీస్

హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు . దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్స్ కంపెనీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో చైర్మన్ అశోక్‌ను లొంగిపోవాలని పోలీసులు సూచించారు. ఆయన లొంగిపోలేదు. నోటీస్ గడువు కూడా కూడా ముగిసింది. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్ ఔట్ నోటీసులు ఇష్యూ చేశారు. దీంతో ఆయన ఎటూపోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ క్షణం అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ ను అరెస్టు చేసేందుకు.. తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న క్రమంలో మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుతో పాటు SR నగర్‌, KPHB కేసుల దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదుచేసిన లోకేశ్వర్‌రెడ్డిని సైబరాబాద్ పోలీసులు మరోమారు విచారించినట్లు తెలిసింది.