Categories
International

జపాన్ కురువృద్ధుడు ఇక లేరు

జపాన్ : ఇతను ప్రపంచంలోనే ఎక్కువ వయస్సున్న వ్యక్తి తుదిశ్వాస విడిచారు. ఎక్కువ వయస్సున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న జపాన్ వాసి మెజాజో నొనాకా కన్నుమూశారు. 2018 సంవత్సరం 112 ఏళ్ల 259 రోజులు పూర్తి చేసుకుని గిన్నీస్ బుక్ రికార్డ్స్‌లో ప్లేస్ దక్కించుకున్నారు. 
ఉత్తర జపాన్‌లోని హొక్కైడో దీవిలో ఉన్న ఆయన సొంత నివాసంలో జనవరి 20వ తేదీ తెల్లవారుజామున మృతి చెందారు. మృతి చెందే సమయానికి అతని వయస్సు 113 సంవత్సరాలు. మెజాజోది సహజ మరణమేనని…అతని కుటుంబసభ్యులు వెల్లడించారు.