Categories
National

తల్లి చనిపోయిందని తెలిసినా…కరోనా నివారణ చర్యల్లో పాల్గొన్న హెల్త్ ఆఫీసర్ 

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు కరోనా నివారణ చర్యల్లో సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఒకరు తల్లి మరణించినా, మరొకరికి చేతి విరిగినా విధులు నిర్వర్తించారు.

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ లో కూడా వైరస్ విజృంభిస్తోంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు అష్రఫ్ అలీ, ఇర్ఫాన్ ఖాన్ కరోనా నివారణ చర్యల్లో సైనికుల్లాగా పని చేస్తున్నారు. అష్రఫ్ అలీ తల్లి చనిపోయింది, ఇంటికి రావాలని తమ కుటుంబ సభ్యుల నుంచి పిలుపువచ్చినా..వ్యక్తిగత భావోద్వేగాలను పక్కన పెట్టి, నగరానికి సేవ చేయడానికి సిద్ధపడ్డాడు. మరో వ్యక్తి ఇర్ఫాన్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుడి చేతి విరిగింది. అయినా అతను విధులకు హాజరయ్యాడు. 

అష్రఫ్ అలీ భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య అధికారిక ఇన్‌చార్జిగా ఉన్నారు. భారతదేశం అంతటా 700 మందికి పైగా వైరస్ సోకింది. కనీసం 17 మంది ప్రాణాలు తీసింది. కరోనా వైరస్‌ నివారణకు రాష్ట్రం చేస్తున్న పోరాటంలో అతనిది ఒక కీలకమైన బాధ్యత. అయితే బుధవారం ఉదయం విధుల్లో ఉండగా అలీకి తన తల్లి మరణం వార్త అందింది. అయినా ఇంటికి వెళ్లకుండా విధుల్లో ఉండి పని చేశాడు. 

అతను తన విధులను వదిలివేసి ఇంటికి వెళ్తే ఎవరూ ప్రశ్నించరు. కాని అతను గృహాలను శుభ్రపరిచే తన పనిని పూర్తి చేసి ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతను ఇళ్లను శుభ్రపరిచాడు. దీంతో ప్రజలు కరోనా వైరస్ నుంచి సురక్షితంగా పయటపడ్డారు. వైరస్ నుంచి ప్రజలను కాపాడి, ఇంటికి వెళ్లాడు. 

“తల్లి కంటే విలువైనది ఏదీ లేదు. ఉదయం 8 గంటలకు నా తల్లి మరణం గురించి తెలిసింది, కానీ నా దేశం కోసం పని చేయాల్సిన నా కర్తవ్యం కూడా ఉంది” అని అలీ చెప్పారు. “మధ్యాహ్నం నేను అంత్యక్రియలకు వెళ్ళి, అనంతరం పనికి తిరిగి వచ్చాను” అని అతను చెప్పాడు.

COVID-19 నివారణకు పని చేస్తున్న భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ పోరాట బృందంలోని మరొక సభ్యుడు ఇర్ఫాన్ ఖాన్ సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలర్బోన్, కుడి చేతి విరిగింది. అతను కూడా వైద్యుల సలహాలను విస్మరించి పనికి తిరిగి వచ్చాడు. 

“COVID-19 కి వ్యతిరేకంగా పోరాటంలో విజయం సాధించడానికి మనమందరం ఇప్పుడు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. వైద్యులు నన్ను విశ్రాంతి తీసుకోమని అడిగారు, కాని నాకు కేటాయించిన పనిని పూర్తి చేసే శక్తి ఉందని తెలుసుకున్నాను” అని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం (ఐడిఎస్పి) డేటా మేనేజర్ గా  ఖాన్ ఉన్నాడు. భోపాల్ లోని ఎయిమ్స్ నుండి తన కార్యాలయానికి తిరిగి వెళ్లేటప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. 

IDSP వైద్య సమాచారాన్ని వర్గీకరిస్తుంది. వైరల్ లేదా వ్యాధి వ్యాప్తిపై పోరాడటానికి వ్యూహాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వానికి సహాయపడటంలో ఇది చాలా కీలకం.
“ఈ కఠినమైన కాలంలో వారు నిజమైన హీరోలు. అష్రఫ్ అలీ మా సిబ్బందికి ఒక ప్రేరణ – అతను నగరంలో 5,000 నుంచి 7,000 గృహాల వరకు శుభ్రపరుస్తాడు” అని నగర మునిసిపల్ కమిషనర్ విజయ్ దత్తా చెప్పారు.

భోపాల్ అంతటా 10 నుండి 12 వాహనాలు రెండు షిఫ్టులలో పనిచేస్తాయి. ఒక్కో షిఫ్ట్ కు 5,000 ఇళ్లను శుభ్రపరుస్తాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 20 COVID-19 కేసులు నమోదయ్యాయి. ఒకరు కరోనా వైరస్‌తో మృతి చెందారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగా మధ్యప్రదేశ్ లో కూడా “టోటల్ లాక్డౌన్” ఉంది. ప్రపంచవ్యాప్తంగా 4.7 లక్షలకు పైగా ప్రజలకు వైరస్ సోకింది. 20, 000 మందికి పైగా మరణించారు.

Also Read | రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ లో వర్షాలు