Categories
Crime National

పంచకుల ఆశ్రమంలో ఇద్దరు బాలికలపై స్వామీజీ అత్యాచారం

హర్యానాలోని పంచకుల ఆశ్రమంలో దారుణం జరిగింది. ఓ స్వామిజీ ఇద్దరు బాలికలను బంధించి మూడురోజుల పాటు వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఘటన పంచకుల పట్టణంలోని కల్కా ప్రాంతంలో సంచలనం సృష్టించింది. 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్ది ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు పంచకుల ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో బోధనలు చేస్తున్న స్వామిజీ ఇద్దరు బాలికలపై స్వామీజి కామపు కన్ను పడింది. వారిని బంధించి మూడు రోజుల పాటు పలు సార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బాలికలను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమంలో స్వామిజీని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను పంపించామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
వివారాల్లోకి వెళితే..అంబాలాకు చెందిన స్వామీ లక్ష్యానంద్ సరస్వతి (47) పంచకుల జిల్లా ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌పూర్ రాణి బ్లాక్‌లోని త్రిలోక్ పూర్ గ్రామంలో సనాటన్ సన్యాస్ ఆశ్రమం నడుపుతున్నాడు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలోని బడ్డి ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులతో కలిసి శనివారం (జనవరి 25) స్వచ్ఛంద సేవ చేయటానికి 15 సంవత్సరాల ఇద్దరు బాలికలు ఆశ్రమానికి వచ్చారు. 

బాలికలో ఒకరు 9th క్లాస్ చదువుతుండగా..మరొకరు స్కూల్ మానేశారు. వారి కుటుంబాలు బడ్డిలో నివసిస్తున్నాయి. వారు  స్వామీ లక్ష్యానంద్ సరస్వతి ఆశ్రమం గురించి తెలిసి సేవ చేసేందుకు వచ్చారు. సేవ చేస్తున్న బాలికలపై స్వామీజీ కన్నువేశాడు. అదను కోసం వేచి చూసాడు. ఓ రోజు బాలికల సోదరులు ఇద్దరు వేరే గదిలో నిద్రిస్తున్న సమయంలో స్వామీజీ బాలికలపై అత్యాచారం చేశారు. ఈ విషయం బైటకు చెబితే చంపి ఆశ్రమంలోనే పాతేస్తానని బెదిరించాడు. భయపడిపోయిన బాలికలిద్దరు నోరు మెదపలేదు. దాన్ని అదనుగా చేసుకుని లక్ష్యానంద్ సరస్వతి వారిపై మూడు రోజుల పాటు పదే పదే అత్యాచారానికి పాల్పడుతునే ఉన్నాడు. 

అలా మంగళవారం (జనవరి 28)న వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వారు తమ తల్లులకు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో వారు కుటుంబ సభ్యులు పంచకుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలను పరీక్షించేందుకు పోలీసులు పంచకుల సివిల్ ఆసుపత్రిలో నిర్వహించిన బాలికల వైద్య పరీక్షలో అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బాలికలు తమ స్టేట్మెంట్లను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసినట్లు ఎసిపి బిష్ణోయ్ తెలిపారు. 

ఈ కేసుపై ఏసీపీ మాట్లాడుతూ..ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) లోని సెక్షన్ 376 (2) (ఎన్) (పదేపదే అత్యాచారానికి పాల్పడటం) 506 (క్రిమినల్ బెదిరింపు), బాలికల పిల్లల రక్షణ చట్టం,లైంగిక నేరాల (పోక్సో) చట్టం  కింద సెక్షన్ కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. 

ఆశ్రమంలో సోదాలు చేసి ప్రాంగణాన్ని లాక్ చేసామని ఏసిపి బిష్ణోయ్ తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. కాగా 2019లో  స్వామి లక్ష్యానంద్‌పై అత్యాచారం ఆరోపణల కేసు నమోదైందని బిష్ణోయ్ తెలిపారు. అలాగే ఆశ్రమంలో జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా పెట్టామనీ..వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. 

ఆశ్రమం గురించి
రాయ్‌పూర్ రాణిలోని చోటా త్రిలోక్‌పూర్ గ్రామంలో అర ఎకరానికి పైగా భూమిని ఏర్పాటు చేసి స్వామి లక్ష్యానంద్‌ సనాటన్ సన్యాస్ ఆశ్రమాన్ని పదేళ్లుగా నడుసుతున్నాడని స్థానికులు తెలిపారు. 

Categories
Crime National

నిత్యానంద శిష్యురాలి హత్య : నా బిడ్డను చంపేశారు.. సీబీఐ విచారించాలి

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త స్వామి నిత్యానంద ఆశ్రమంలో తన కుమార్తెను హత్య చేశారంటూ ఓ మహిళ ఆరోపిస్తోంది. సంగీత అర్జునన్ అనే యువతి నిత్యానంద శిష్యురాలిగా ఆశ్రమంలో ఉండేది. 2014లో సంగీతను దారుణంగా హత్యచేశారంటూ ఆమె తల్లి ఝాన్సీ రాణి ఆరోపణలు చేస్తోంది. తన కుమార్తెను చంపేశారని, సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మృతురాలి తల్లి ఝాన్సీ తన గోడును వెల్లబోసుకుంది. బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమంలో సంగీత శిష్యురాలిగా ఉండేదని చెప్పుకొచ్చింది. తన కుమార్తెను దారుణంగా హత్యచేసి, గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించారంటూ రాణి ఆరోపిస్తోంది.

‘నా బిడ్డను దారుణంగా హింసించి చంపేశారు. భర్త, బిడ్డతో పాటు అన్నీ కోల్పోయాను. సంగీత గుండెనొప్పితో చనిపోలేదు. ఆశ్రమంలో హత్యకు గురైంది. సీబీఐతో విచారణ జరిపించి నాకు న్యాయం చేయండి’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమంలో 2008 నుంచి 2014 వరకు తిరుచ్చి ప్రాంతానికి చెందిన సంగీత అర్జునన్ అనే యువతి ఉండేది.

అక్కడే కంప్యూటర్ విభాగంలో హెడ్‌గా పనిచేసేది. అప్పటికి సంగీతకు 24 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచి తన కుమార్తెను కలిసి ఇంటికి తిరిగి తీసుకొచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆశ్రమంలోకి అనుమతించలేదని వాపోయింది. నిత్యానంద ఆశ్రమంలో ఒక సంగీత మాత్రమే దుర్భర స్థితిలో లేదని, ఎంతోమంది అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపింది. 

సంతకం చేసిన పత్రాలను చూపించి శిష్యులైన అమ్మాయిలను శిక్షించే అధికారం ఉందని సంగీతతో ఆశ్రమ అధికారులు చెప్పినట్టు ఝాన్సీ తెలిపింది. ఒకరోజున తాను ఆశ్రమం నుంచి తిరిగి ఇంటికి రావాలని అనుకుందని తల్లి రాణి చెప్పింది. తన బిడ్డతో కలిసి ఆశ్రమం నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి సంగీతను తిరిగి తీసుకెళ్లినట్టు తెలిపింది.

పైగా తాను ఆశ్రమం నుంచి ఏదో దొంగలించిందంటూ పోలీసులకు అప్పగిస్తామంటూ బెదిరించారని ఝాన్సీ వాపోయింది. అప్పటినుంచి సంగీతను ఆశ్రమంలో బంధీగా ఉంచి హింసించినట్టు తెలిపింది. గంటలకొద్ది ఆశ్రమం గేటు దగ్గర నిలబడి తన కుమార్తె కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని బోరుమంది. కనీసం ఫోన్లో కూడా కుమార్తెతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. 

ఆశ్రమంలోని హంసానంద, పరమానంద అనే ఇద్దరు వ్యక్తులు సంగీతతో మాట్లాడకుండా అడ్డుకున్నారని ఝాన్సీ పేర్కొంది. ఆశ్రమంలోని దేవుడి దగ్గర మీడియాకు చెప్పొద్దంటూ తనతో ప్రమాణం చేయించుకున్నారని, సంగీతను కూడా తిరిగి పంపిస్తామని చెప్పారని తెలిపింది. కానీ, చివరికి కుమార్తెను పంపలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత మరోసారి సంగీతను బతికి ఉండగా చూడలేకపోయానని ఝాన్సీ వాపోయింది.

మరోవైపు సంగీత మరణానికి సంబంధించి నిత్యానంద సంఘా అకౌంట్ నుంచి అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ‘సంగీత గుండెనొప్పితో మరణించింది. ఆమె కుటుంబంలో వారికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. అందుకే యుక్త వయస్సులోనే సంగీతకు గుండెనొప్పి వచ్చింది’ అంటూ వెబ్ సైటులో సమాచారాన్ని పొందుపరిచింది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీలు, ప్రజల అభిప్రాయాలతో పాటు సాక్ష్యా ఆధారాలు, తల్లి ఝాన్సీ రాణి నిత్యానందకు కృతజ్ఞతలు తెలిపే వీడియోను కూడా జత చేసింది. 

కానీ, సంగీత కుటుంబం మాత్రం ఆమెకు అసలు గుండెసంబంధిత సమస్యలే లేవని తేల్చి చెప్పింది. ఆశ్రమంలో  సంగీతకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించగా తల్లి ఝాన్సీ అడ్డుకుంది. ఆ తర్వాత సంగీత మృతదేహానికి ఇంటికి పంపేందుకు అనుమతించారు. అంత్యక్రియలకు మాత్రమే అనుమతించి రెండోసారి పోస్టుమార్టానికి ఆశ్రమ అధికారులు నిరాకరించినట్టు మీడియాకు తెలిపింది. 

బెంగళూరులోని రామ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రెండోసారి పోస్టుమార్టం నిర్వహించగా.. సంగీత మృతదేహంలో అవయవాలు అదృశ్యమైనట్టు రిపోర్టులో తేలింది. ఆ తర్వాత నుంచి ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని వాపోయింది. కేసు నమోదైనప్పటి నుంచి ఐదేళ్లగా కర్ణాటక కోర్టులో విచారణ జరిగిందని తెలిపింది. ఏడాది క్రితమే ఒక జడ్జీ.. ఈ కేసుపై విచారణకు సీబీఐకి అప్పగిస్తామని చెప్పారని, 10 రోజుల్లోనే ఆ జడ్జీ బదిలీ అయ్యారని ఝాన్సీ వాపోయింది. నా కుమార్తె మరణంతో గుండెపగిలిన తన భర్త రెండేళ్ల తర్వాత ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని ఝాన్సీ కన్నీటిపర్యంతమైంది.  

స్వామి ముసుగులో ఆశ్రమంలో అమ్మాయిలను లోబర్చుకున్నట్టుగా అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న నిత్యానందపై మరిన్ని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిలతో బలవంతపు విరాళాలు వసూలుతో పాటు పిల్లలను నిర్బంధించినందుకు నిత్యానందపై కేసు నమోదైంది. మరోవైపు నిత్యానంద తన ఆశ్రమం నుంచి దేశం విడిచి పారిపోయాడని పోలీసులు అంటున్నారు. 

Categories
Crime National

మరో వివాదంలో నిత్యానంద : అమ్మాయిలను కిడ్నాప్ చేశారని కేసు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. నిత్యానంద ఇద్దరు శిష్యులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. తమ ఇద్దరు కూతుళ్లను నిత్యానంద స్వామి అహ్మదాబాద్‌లోని తన సర్వజన ఆశ్రమంలో బంధించాడని బెంగళూరుకు చెందిన జనార్ధనస్వామి దంపతులు ఆరోపిస్తున్నారు. నిత్యానంద ఆశ్రమం నుంచి తమ కుమార్తెలను తమకు అప్పగించేందుకు ఆశ్రమ నిర్వాహకులను ఆదేశించాలని కోరుతూ గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం(నవంబర్ 20,2019) విచారణ జరిగింది. 

జనార్ధన శర్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద స్వామి ఆశ్రమంలో తనిఖీలు జరిపారు. అమ్మాయిల స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. కేసులో నిత్యానంద స్వామిని విచారించేందుకు పోలీసులు వెతుకుతున్నారు. కేసు దర్యాప్తు సాగుతుండగానే నిత్యానంద స్వామి ఓ వీడియో విడుదల చేశారు. ఆరోపణలు చుట్టుముట్టిన వేళ అహ్మదాబాద్ భక్తులు తనకు అండగా నిలిచిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆశ్రమంలో ఎవరినీ నిర్బంధించ లేదని, పిల్లలను కలవకుండా తల్లిదండ్రులెవరినీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఎవరినైనా కలవాలా వద్దా అన్నది వారి ఇష్ట ప్రకారమే ఉంటుందన్నారు. 

7 నుంచి పదిహేనేళ్ల మధ్య వయసున్న తన నలుగురు పిల్లలను నిత్యానంద స్వామి ఆధ్వర్యంలో నడిచే ఓ సంస్థలో 2013లో చేర్పించామని జనార్ధన శర్మ తన పిటిషన్‌లో తెలిపారు. అయితే నిత్యానంద తమను సంప్రదించకుండా పిల్లలు నలుగురినీ అహ్మదాబాద్‌లోని తన ఆశ్రమంలోని మరో సంస్థకు తరలించారని ఆరోపించారు. తమకు ఈ విషయం తెలియగానే, నలుగురు పిల్లలను మళ్లీ అహ్మదాబాద్‌లోని సర్వజనపీఠానికి రహస్యంగా తరలించారని తెలిపారు. పిల్లలను కలుసుకునేందుకు ఆ ఆశ్రమానికి తాము వెళితే లోపలకు అనుమతించ లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

దీంతో స్థానిక పోలీసులు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సాయతో తన ఇద్దరు మైనర్ బాలికలను వెనక్కి తీసుకొచ్చామన్నారు. అయితే తమ పెద్ద కుమార్తె లోపముద్ర(21), రెండో కుమార్తె నందిత(18) తమతో వచ్చేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ నిర్వాహకుల బెదిరింపులకు భయపడి వారు తమతో రాలేదన్నారు. కోర్టు జోక్యం చేసుకుని తమ కుమార్తెలిద్దరినీ తమకు అప్పగించాలని కోరారు. శర్మ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అహ్మదాబాద్ రూరల్ పోలీసులు నిత్యానందతో పాటు ఆశ్రమంలోని ఇతర అధికారులపై కేసు నమోదు చేశారు.

Categories
Hyderabad

శ్రీ చినజీయర్ స్వామి ఆశ్రమంలో సహస్ర కలశాభిషేక మహోత్సవం

శంషాబాద్ సమీపంలోనే శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరు నక్షత్ర మహోత్సవం కన్నుల పండవగా జరుగుతోంది. ఈ వేడుకలు ఈరోజుతో ముగియనున్నాయి.త్రిదండి చినజీయర్ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ 28 నుంచి జరుగున్న ఈ వేడుకలు నేటితో ( నవంబర్ 1)తోముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆశ్రమంలో శ్రీరాముడికి సహస్ర కలశాభిషేక మహోత్సవం జరుగుతోంది. స్వామి  వారి ఆరాధ్యదైవమైన శ్రీరాముడికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

ఈ వేడుకల్లో భాగంగా..అనుగ్రహ భాష్యం చేసిన చిన జీయర్ స్వామి మాట్లాడుతూ..ప్రజల్ని అనుగ్రహించటం కోసం శ్రీరాముడు నడిచి వచ్చి అనుగ్రహించిన  రోజు అని అన్నారు.  గతంతో శ్రీరాముడికి 108 కలశాలతో అభిషేకం నిర్వహించగా 1995 నుంచి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రజలపై భగవంతులు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని నిరూపించిన రోజు ఈ రోజు అందుకే సహస్ర కలశాభిషేక మహోత్సవాన్ని నిర్వహించామని  శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు.

Categories
Uncategorized

అజ్ఞాతంలో కల్కి దంపతులు

కల్కిభగవాన్‌ ఆశ్రమంలో ఐటీ దాడులు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కోట్ల రూపాయల నగదు దొరికినట్లు తెలుస్తోంది. స్థానిక ఐటీ అధికారుల సహకారంతో చెన్నైకి చెందిన అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ దాడులతో కల్కి భగవాన్ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లారు.

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కిభగవాన్‌కు చెందిన ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉన్నది. వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల నిర్వాహకుడు లోకేష్‌ దాసాజీతో పాటు మరికొంత మంది సిబ్బందిని రహస్యంగా విచారించారు. ఈ విచారణలో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తుల సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. 

బినామీల పేరుతో వేల ఎకరాల భూముల అమ్మకాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు… సుమారు 40 కోట్ల భారతీయ, విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు గోవర్దనపురంలోని కల్కి కార్యాలయంలో సోదాలు నిర్వహించిన రెండు బృందాలు చెన్నైకి వెళ్లిపోయాయి. 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం మరికొన్నిచోట్ల సోదాలు నిర్వహించే అవకాశముంది.

కల్కిభగవాన్‌ ఆశ్రమం ఐదెకరాల నుంచి ప్రారంభమై వేలాది ఎకరాలకు విస్తరించింది. అయితే మూడేళ్లుగా పన్నులతోపాటు ఐటీ రిటర్న్స్‌ చెల్లించడం లేదని సమాచారం. అంతేకాదు.. పలురకాల కంపెనీలు, ట్రస్టీల పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు కల్కి ఆశ్రమంపై నిఘా పెట్టారు. చెన్నైలోని ప్రధాన కార్యాలయంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆశ్రమాలు, కార్యాలయాలు, భూముల కొనుగోళ్లు, విరాళాల సేకరణలపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం కల్కి భగవాన్ దంపతులు ఎక్కడున్నారో తెలియడం లేదు. 
 

Categories
National

కల్కి లీలలు : రూ.33కోట్ల నగదు సీజ్.. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లోనూ ఆస్తులు

కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(అక్టోబర్ 17,2019) 2వ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ,

కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(అక్టోబర్ 17,2019) 2వ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. 400 మంది అధికారులు 10 బృందాలుగా రంగంలోకి దిగారు. కల్కి ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. దాడుల సమయంలో కల్కి భగవాన్‌, ఆయన భార్య పద్మావతి అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకంలోని మెయిన్ ఆఫీస్ లో కల్కి కొడుకు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు.

తొలి రోజు ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. రూ.33 కోట్ల క్యాష్ సీజ్ చేశారు. అందులో భారత కరెన్సీకి సంబంధించి రూ.24 కోట్లు ఉన్నాయి. చెన్న, బెంగళూరు నగరాల్లో భారీగా భూములు కొన్నట్టు గుర్తించారు. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లోనూ ఆస్తులున్నట్లు కనుగొన్నారు. ట్రస్ట్ నిర్వాహాకులు కృష్ణాజీ దంపతులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కృష్ణాజీ ఇంట్లో రూ.9కోట్ల అమెరికన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం, బీ ఎన్‌. కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల ట్రస్ట్‌ నిర్వహాకుడు లోకేష్‌ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని ఐటీ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అలాగే బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు కనుగొన్నారు. 

గతంలో కూడా కల్కి భగవాన్‌ ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలో భక్తులకు మత్తు పదార్థాలు ఇచ్చి వారిని మత్తులో ఉండేలా చేయడంతో పాటు, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విజయ్‌ కుమార్‌ నాయుడు అలియాస్‌ కల్కి భగవాన్‌ తొలినాళ్లలో ఎల్‌ఐసీలో క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఓ విద్యాసంస్థను నెలకొల్పారు. అది కాస్తా దివాళా తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ విజయ్‌ కుమార్‌ 1989లో చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. 

ఆ తర్వాత తన ఆశ్రమ కార్యాకలాపాలను ఏపీతో పాటు తమిళనాడుకు విస్తరించారు. కల‍్కి భగవాన్‌ తనతో పాటు భార్య పద్మావతిని దైవాంశ స్వరూపులుగా చెప్పుకునేవారు. వీరి ఆశ్రమానికి దేశంలోని ధనవంతులే కాకుండా విదేశీయులు, ఎన్నారైలు క్యూ కట్టేవారు. కల్కి భగవాన్‌ సాధారణ దర్శనానికి రూ.5వేలు, ఇక​ ప్రత్యేక దర్శనం కావాలంటే రూ.25 వేలు చెల్లించుకోవాల్సిందే. కల్కి కుమారుడు కృష్ణాజీ కూడా పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదుతో 2010లో ఏపీ హైకోర్టు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. 2008లో చిత్తూరు జిల్లాలోని కల్కి ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు చనిపోగా, అనేకమంది గాయపడ్డారు. దీంతో కొద్దిరోజులు ఆశ్రమం మూతపడింది. కల్కి లీలలు చూసి అధికారులే షాక్ అవుతున్నారు.