Categories
Hyderabad

చినజీయర్ స్వామి ఆశ్రమంలో చంద్రబాబు

హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొన్నారు. చినజీయర్ పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా 5వ రోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు. చిన జీయర్ స్వామి చేసిన మంగళ శాసనాలను అందరూ తమ జీవితంలో ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు.

హిందూధర్మ పరిరక్షణ కోసం చినజీయర్ స్వామి చేసిన ఉద్యమం చాలా గొప్పదని అన్నారు. జీయర్ స్వామి చేపట్టిన కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని చెప్పారు.

తిరునక్షత్ర వేడుకలకు హాజరుకావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. స్వామివారు ఏం చెప్పినా అది లోకహితం కోసమే అన్నారు. జీయర్ స్వామి ఏం చెప్పినా చేయడానికి.. అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తన ఆశ్రమానికి వచ్చిన చంద్రబాబును జీయర్ స్వామి సత్కరించారు.