Categories
Business National

ప్లీజ్ స్టాప్ : రైడ్ క్యాన్సిల్ చేస్తే.. Ola, Uber ఛార్జీల మోత!

రైడ్ షేరింగ్ సర్వీసు Ola, Uber రైడర్లపై చార్జీల మోత మోగిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేసుకుంటే అదనపు ఛార్జీల పేరుతో భారీగా దండుకుంటున్నాయి.

రైడ్ షేరింగ్ సర్వీసు అందించే Ola, Uber సంస్థలు.. బుకింగ్ రైడర్లపై చార్జీల మోత మోగిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేసుకుంటే అదనపు ఛార్జీల పేరుతో భారీగా దండుకుంటున్నాయి. దీనిపై ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరన్ మంచ్ (SJM) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మోటార్ వెహికల్ చట్టం 2019 క్రింద టాక్సీ అగ్రిగేటర్స్ ధర పరిమితులను ఫిక్స్ చేయాలని కోరుతూ ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరన్ మంచ్  రోడ్డు రవాణ రహదారులు మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసింది. ఉబెర్, ఓలాతో సహా టాక్సీ అగ్రిగేటర్లు సర్ ఛార్జీల పేరుతో లాభార్జన పొందుతున్నాయని ఆల్ ఇండియా కో-కన్వీనర్ (SJM), మంత్రి అశ్వనీ మహాజన్ ఆ లేఖలో ఆరోపించారు.

‘గత రెండు వారాల్లో తమకు కొన్ని స్క్రీన్‌షాట్‌లు వచ్చాయని అందులో ముంబైలో 6 నిమిషాల రైడ్ కోసం రూ .2వేల వరకు ఛార్జీలు విధించారని ఆరోపించారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సాదా లాభం కోసం ఇలా చేయడం దారుణమని అని ఆయన అన్నారు. ఉబెర్, ఓలా వంటి యాప్ ఆధారిత టాక్సీ సేవలతో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారని సూచించడానికి మహాజన్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేను ఆయన ఉటంకించారు. 

తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన టాక్సీ సేవలను అందించడానికి 2014-15లో ఇండియాలో సర్వీసులు ప్రారంభించిన టాక్సీ అగ్రిగేటర్స్ లాభాలను ఆర్జించడంపైనే ఎక్కువ దృష్టిపెట్టాయని అన్నారు. పెంచిన ధరలపై 25 శాతం పరిమితిని SJM కోరిందని చెప్పారు. కస్టమర్లపై ప్రబలంగా ఉన్న పెనాల్టీ నిబంధనలను ఉటంకిస్తూ.. టాక్సీ యాప్ కంపెనీ లేదా డ్రైవర్‌పై జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా రైడ్ రద్దు చేసిన సందర్భాల్లో.. అత్యవసర పరిస్థితుల్లో కస్టమర్ సర్వీసు సెంటర్లను సంప్రదించడానికి వీలుగా ప్రాథమిక కస్టమర్ సర్వీసు, యాప్ ఫీచర్లను ప్రామాణికం చేయాలని సంస్థ కోరుతోంది. 

మోటారు వాహన చట్టం 2019 ప్రకారం.. యాప్ ఆధారిత టాక్సీ అగ్రిగేటర్లకు రెగ్యులేటరీ నిబంధనలను రూపొందించడానికి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ లేఖ వెలుగులోకి వచ్చింది. 2016లో మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలతో సాధారణ ఛార్జీలు మూడు రెట్ల ధరలను పెంచేందుకు అనుమతించాయని పేర్కొంది . ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని నివారించాలని SJM కోరింది. మోటారు వాహనాల (సవరణ) బిల్లు 2019ను ప్రస్తుత లోక్‌సభ మొదటి సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. 

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, అతివేగంగా వెళ్లడం, రెడ్ లైట్ దాటడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వంటి ప్రతి నేరానికి జరిమానాను అనేక రెట్లు పెంచినందున ఈ సవరణ ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. చట్టాన్ని మరింత సవరణ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలను సూచించకపోగా, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకత భయంతో ఆయా రాష్ట్రాల్లో కొత్త చట్టాన్ని అమలు చేయడానికి సంకోచిస్తున్నాయి.