Categories
Political Telangana

దీక్ష భగ్నం : అశ్వత్థామరెడ్డి అరెస్టు

తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రెండు రోజులుగా దీక్ష చేస్తున్న టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమింప చేయాలని వైద్యులు సూచించారు. దీనికి నో చెప్పారు అశ్వత్థామరెడ్డి. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

బీపీ 150, షుగర్ 196 ఉన్నట్లు తేల్చారు. వెంటనే ట్యాబ్లెట్లు వేసుకోవాలని, ఆహారం తీసుకోవాలని అశ్వత్థామరెడ్డికి సూచించారు. లేదంటే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని హెచ్చరించారు.తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామన్నారు అశ్వత్థామరెడ్డి. హస్తినాపురంలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అశ్వత్థామరెడ్డిని అదుపులోకి తీసుకుని దీక్షను భగ్నం చేశారు. 

మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారానికి 44వ రోజుకు చేరుకుంది. వివిధ దశలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విలీనం చేయాలని పట్టుబట్టిన కార్మిక సంఘాలు వెనక్కి తగ్గాయి. ఆ ఒక్క దాని తప్ప…మిగతా డిమాండ్లు పరిష్కరించాలని కోరాయి. దీనికి ప్రభుత్వం నో చెప్పింది. హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. చర్చల ప్రసక్తే లేదని, సమ్మె చట్టవిరుద్ధమని ఆదేశించాలని వెల్లడించింది. ఈ క్రమంలో నవంబర్ 18వ తేదీ సోమవారం హైకోర్టు ఎలాంటి తీర్పునివ్వనుంది ? ఆర్టీసీ జేఏసీ ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుందో వేచి చూడాలి. 
Read More : ఆర్టీసీ సమ్మె : క్షీణిస్తున్న అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం