Categories
Movies

మహర్షి సెట్‌లో మహేష్

మహర్షి సెట్‌లోనుండి బయటకొచ్చిన మహేష్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా, మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో,  అశ్వినీ దత్, పీవీపీ, దిల్ రాజు నిర్మిస్తుండగా, అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు. ఫస్ట్‌టైమ్ పూజాహెగ్డే మహేష్ పక్కన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సూపర్ స్టార్ ఫస్ట్ అండ్ సెకండ్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్‌గా మహర్షి సెట్‌లోనుండి మహేష్ పిక్ ఒకటి బయటకొచ్చి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పచ్చటి పొలాల మధ్య, చుట్టూ జూనియర్ ఆర్టిస్ట్‌లుండగా, అసిస్టెంట్ గొడుగు పట్టుకుని ఉంటే, మహేష్ అలా నడుచుకుంటూ వస్తున్నాడు ఆ పిక్‌లో.

ఫార్మల్ వేర్‌లో, టక్ చేసుకుని, గాగుల్స్‌తో ఉన్న మహేష్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో మహేష్, స్టూడెంట్‌గా, రైతుగా, సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. జగపతి బాబు, జయసుధ, నవీన్ చంద్ర, సోనాల్ చౌహాన్ తదితరులు నటిస్తున్న మహర్షిమూవీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 2019 ఏప్రిల్‌ 25న సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. 

Categories
Movies

మహర్షి సెకండ్ లుక్

నూతన సంవత్సరం సందర్భంగా మహర్షి సెకండ్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా, మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో,  అశ్వినీ దత్, పీవీపీ, దిల్ రాజు నిర్మిస్తుండగా, అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్‌గా, పూజాహెగ్డే హీరోయిన్‌గా చేస్తుంది.
నూతన సంవత్సరం సందర్భంగా మహర్షి సెకండ్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఫస్ట్ లుక్‌లో చేతిలో బుక్‌తో కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించిన సూపర్ స్టార్, సెకండ్ లుక్‌లో సూటూ, బూటు గెటప్‌లో అదరగొట్టేసాడు. రెయిన్ ఎఫెక్ట్‌లో ఒక చేతిని పాకెట్‌లో పెట్టుకుని, గాగుల్స్‌తో, సూపర్ స్టార్ అలా స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్నాడు.

ఒక స్ట్రీట్‌లో ఆయన నడుస్తుండగా, వెనక ఇద్దరు విదేశీ అసిస్టెంట్స్ తన వెనకే ఫాలో అవుతుండగా, ఒకతను గొడుగు పట్టుకున్నాడు. మహేష్‌కి ముందు అవుట్ ఫోకస్‌లో కొంతమంది నడుస్తున్నారు. మొత్తానికి ఈ న్యూ లుక్‌లో మహేష్ చాలా బాగున్నాడనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్, స్టూడెంట్‌గా, రైతుగా, సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

ఈ లుక్ చూస్తుంటే, రిషి అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించడం ఖాయం అనిపిస్తుంది. జగపతి బాబు, జయసుధ, నవీన్ చంద్ర, సోనాల్ చౌహాన్ తదితరులు నటిస్తున్న మహర్షికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చుస్తున్నాడు. 2019 ఏప్రిల్‌లో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.