Categories
National

సౌర విద్యుత్​కు భారత్ అతిపెద్ద మార్కెట్…ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ

సౌర విద్యుత్​కు భారత్​ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్​ను భారత్ ఉత్పత్తి చేస్తోందని, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రథమ 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని మోడీ అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి భారత్ అతిపెద్ద మార్కెట్ అని ప్రధాని తెలిపారు

మధ్యప్రదేశ్​లోని రేవాలో ఏర్పాటైన ఆసియాలోనే అతిపెద్దది అయిన 750 మెగా వాట్ల సౌర విద్యుత్ పార్క్​ను శుక్రవారం(జులై-10,2020) ప్రధాని మోడీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని.. సోలార్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. రేవా అల్ట్రా మెగా సోలార్​ లిమిటెడ్​ (ఆర్​యూఎంఎస్​ఎల్​), మధ్యప్రదేశ్​ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్​, భారత సోలార్​ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ పార్క్​ను నిర్మించాయి.

సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో భారత్​కు ఉన్న అనుకూలతలను మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. అతిపెద్ద ప్లాంట్ నిర్మాణంతో భారత్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. శుద్ధమైన విద్యుత్​కు అత్యంత ఆకర్షణీయ మార్కెట్ భారతేనని వెల్లడించారు. రేవాలోని సౌర విద్యుత్ ప్లాంట్‌తో స్థానిక పరిశ్రమలతో పాటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు కూడా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రధాని తెలిపారు. రాబోయే రోజుల్లో సౌరశక్తే ప్రధాన విద్యుత్ వనరుగా ఉంటుందని ఆయన చెప్పారు.

21వ శతాబ్దంలో ప్రధాన విద్యుత్ వనరు సౌరశక్తి. ఎందుకంటే ఇది నిశ్చితమైనది. నాణ్యమైనది. సురక్షితమైనది. రేవా ప్లాంట్‌తో స్థానిక పరిశ్రమలతో పాటు ఢిల్లీ మెట్రోకు కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. మధ్యప్రదేశ్​లోని నీముచ్, ఛత్తర్​పుర్, ఉత్తర్​ప్రదేశ్​లోని షాజాపూర్​ల్లో సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వివిధ దశల్లో ఉందని మోడీ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 22 డిసెంబర్ 2017న ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ప్లాంట్ పూర్తయింది. ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును 1590 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్ట్. దీని సామర్థ్యం 750 మెగా వాట్లు. ఇందులో మూడు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ 250 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. రెవా ప్రాజెక్టు నుండి వచ్చే విద్యుత్తులో 76 శాతం మధ్యప్రదేశ్ విద్యుత్ నిర్వహణ సంస్థకు, 24% ఢిల్లీ మెట్రోకు అందిస్తారు.

Categories
International

భర్తతో విడాకులు తీసుకుంది..ఆసియా బిలియనీర్ గా మారింది

చైనాకు చెందిన ఓ మహిళ తన భర్తతో విడాకులు తీసుకోవడం ద్వారా బిలియనీర్ అయింది. ఆసియాలోనే అత్యంత ఖరీదైన బ్రేకప్ గా ఇది నిలిచింది. ఇప్పటివరకు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (35 బిలియన్‌ డాలర్లు) ఇచ్చిన విడాకులే అత్యంత కాస్ట్‌లీగా రికార్డుల్లోకెక్కగా.. రెండోస్థానంలో అలెక్‌ వైల్డెన్‌స్టెయిన్‌ ( 3.8 బిలియన్‌ డాలర్లు) ఉన్నారు. వీరి తర్వాతి స్థానంలోకి చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన ఓ బిలియనీర్‌ వచ్చారు.

చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన షెన్‌జెన్‌ కంగతాయ్‌ బయాలాజికల్‌ ప్రాడక్ట్స్ కంపెనీ యజమాని “డు వీమిన్‌”…తన భార్య యువాన్‌ లిపింగ్‌ (49) తో విడాకులు తీసుకోవాలనుకున్నాడు. దీంతో అందుకు భార్యకు భరణంగా కంపెనీలోని 161.3మిలియన్ షేర్లు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ షేర్ల మొత్తం విలువ 3.2 బిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో 24వేల కోట్ల ఖరీదైన విలువైన విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించాడు. 

షెన్‌జెన్‌లో నివసిస్తున్న కెనడా పౌరురాలైన యువాన్‌…మే-2011 నుంచి ఆగస్టు-2018 వరకు కంగతాయ్‌ బయాలాజికల్‌ ప్రాడక్ట్స్‌ కంపెనీకి డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈవిడ బీజింగ్‌ మిన్‌హాయ్‌ బయోటెక్నాలజీ కంపెనీకి వైస్‌ జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.  బీజింగ్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ నుంచి యువాన్ బ్యాచిలర్ డిగ్రీ పొందారు.

గడిచిన ఏడాదిగా కంగతాయ్ కంపెనీ షేర్లు రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టాయి. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారీలో ఉన్నట్టు ఫిబ్రవరిలో  ప్రకటించడంతో ఈ సంస్థ షేర్లు అమాంతం పెరిగాయి. అయితే, విడాకుల వార్త బయటికి రావడంతో గత రెండు రోజులుగా నష్టాలను చవిచూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. విడాకుల నిర్ణయానికి ముందుకు డు వీమిన్‌ షేర్లు 6.5 బిలియన్‌ డాలర్ల నుంచి 3.1 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. 

చైనాలోని జింగ్జి ఫ్రావిన్స్ లోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన డు వీమిన్‌(56).. అంచెలంచెలుగా ఎదిగి 2004లో కంగతాయ్‌ సంస్థ చైర్మన్‌ స్థాయికి ఎదిగారు. కంగతాయ్ కంపెనీ మార్కెట్ విలువ 12.9బిలియన్ డాలర్లుగా ఉంది.

Categories
National

కరోనా సంక్షోభం…ఉగ్రవాదానికి ఆజ్యం

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మహమ్మారి రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో టెర్రరిజాన్ని పెంచుతుందని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆసియా,ఆఫ్రికాలో కరోనా వైరస్ సంక్షోభం…ఉగ్రవాదసంస్థలు పెరగడానికి ఉపయోగపడుతుందంటున్నారు. కరోనా వైరస్,లాక్ డౌన్ ల కారణంగా ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవడం, ఆహారం కొరత మనుషుల్లో ఆక్రోశాన్ని, ఆగ్రావేశాలను పెంచుతుందని, వారు ప్రభుత్వంపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా తిరగబడేందుకు సిద్ధంగా ఉంటారని, అలాంటి సమయాల్లో ఏమాత్రం డబ్బులిచ్చి ఆదుకున్నా ఉగ్ర సంస్థల్లో చేరేందుకు ప్రజలు సిద్ధమవుతారని వారు తెలిపారు.

మరీ ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు, పేదలు, నిరుపేదలు టెర్రరిస్టు కార్యకలాపాలపై మొగ్గుచూపే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సాధారణంగా ప్రభుత్వాలు బలహీనంగా ఉన్న దేశాల్లో, సరిహద్దు వివాదాలు నెలకొని ఉన్న దేశాల్లో ఉగ్రవాదం మరింత‌ పెరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉందని వారు చెప్పారు. ప్రాంతీయ విభేదాలు ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా నైజీరియాలో బోకో హరామ్‌ లాంటి టెర్రరిస్టు సంస్థలు పుట్టుకొచ్చి అలజడని పెంచాయన్నారు.

2019లో విడుదలైన ఓ అంతర్జాతీయ నివేదిక ప్రకారం ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియాలోని 55 దేశాలు ఆహారం కొరతను ఎదుర్కొంటున్నాయి. కరోనా కారణంగా ఆ దేశాల్లో ఆహారం కొరత మరింత తీవ్రమైందని,ఆ దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని బాయిస్‌ స్టేట్‌ యూనివర్శిటీ పొలిటికల్‌ సైన్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిషా బెల్లింగర్‌ హెచ్చరించారు.

సంపన్న దేశాల్లో కూడా కరోనా కారణంగా రాజకీయ,ఆర్థిక సమస్యలు వచ్చాయి. ఈ సంక్షోభం అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేరిన నేపథ్యంలో ఆయా దేశాలు ప్రజలకు ఆహారం అందించడం,శాంతిని నెలకొల్పడం వంటి సీరియస్ సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపారు. మరోవైపు కరోనాను కూడా తన ఉగ్ర కార్యకలాపాలకు పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది. దీన్ని భూచిగా చూపించి ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. జైళ్లలో ఉన్న చాలామంది కరుడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేసింది. ఇలా విడుదలైన వారిలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఒకడు. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన లష్కరే తోయిబా చీఫ్ ను… జైల్లో ఉన్న ఖైదీల మధ్య కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సాకుతో వదిలేసింది ఇమ్రాన్ ప్రభుత్వం

Categories
National

ఆసియాలో అతిపెద్ద మురికివాడ “ధారావి”లో 5కి చేరిన కరోనా కేసులు

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా కేసుల పెరుగుదల ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ధారావిలో కరోనా సోకి ఇటీవల ఓ వ్యక్తి ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే.

ముంబై నగరంలో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతుండటంతో పేదవారే కాదు మధ్య తరగతికి చెందిన చాలా మంది ఇక్కడకు వలస వచ్చారు. ఇక్కడ ప్రజలు దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకుంటున్నా అక్కడ కనీస వసతుల గురించి ఎవరూ ఆలోచించలేదు. దీంతో ధారావి ప్రాంతం 1947 నాటికే దేశంలోనే అతి పెద్ద మురికివాడగా మారింది.

ఎటు చూసినా కిటకిటలాడుతున్న జనం. నడవడానికి వీల్లేని ఇరుకు రోడ్లు. కాస్తంత జాగా కనిపిస్తే ఇళ్ల నిర్మాణం మొదలైంది. నియమాలు, నిబంధనలు ఏమీ ఉండవు. అడిగే వాళ్లే లేరు. ఓ పద్ధతీ పాడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇళ్లు కట్టేశారు. చిన్నపాటి ఇంట్లో పాతిక మంది దాకా సర్దుకోవాల్సిన పరిస్థితులు. ఇళ్లైతే కట్టారు కానీ కనీస వసతులను ఏమాత్రం పట్టించుకోలేదు. ధారావిలోని మెజారిటీ ఇళ్లల్లో టాయిలెట్ సౌకర్యం అనేదే ఉండదు.

పబ్లిక్ టాయిలెట్స్‌పై ఆధారపడటాన్ని జనం అలవాటు చేసుకున్నారు. దీంతో చాలాసార్లు అంటువ్యాధులు విజృంభించాయి. చాలా మంది మృత్యవాత పడ్డారు. ఇప్పుడు అక్కడ కరోనా వైరస్‌ ప్రవేశించింది. ప్రజలను కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా లక్షల మంది ప్రమాదంలో చిక్కుకోవడం ఖాయం. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం రెడీ అయింది.

Categories
Business National

ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్‌లోకి ఆసియా రిచెస్ట్ మ్యాన్

ఆసియాలో నెంబర్ 1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నెక్ట్స్ ఆన్ లైన్ గేమింగ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే వార్తలు

ఆసియాలో నెంబర్ 1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నెక్ట్స్ ఆన్ లైన్ గేమింగ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఆన్ లైన్ గేమింగ్ గురించి ముకేష్ అంబానీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు దారితీశాయి. సోమవారం(ఫిబ్రవరి 24,2020) మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనాదెళ్లతో ముకేష్ అంబానీ మాట్లాడారు. ఆన్ లైన్ గేమింగ్ గురించి ప్రస్తావించారు. మ్యూజిక్, మూవీస్, టెలివిజన్ కన్నా.. భారత్ లో గేమింగ్ రంగం మరింత విస్తరిస్తుందని అంచనా వేశారు. భారత దేశంలో గేమింగ్ రంగానికి చాలా స్కోప్ ఉందని తెలిపారు. పెరుగుతున్న బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీతో గేమింగ్ రంగం విస్తరణకు అవకాశం ఉందని అంబానీ అన్నారు. ముకేష్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. నెక్ట్స్ ఆయన.. గేమింగ్ వ్యాపారంలోకి దిగనున్నారనే సంకేతాలు వచ్చాయి. అయితే.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. గేమింగ్ సెగ్మెంట్ లోకి వెళ్తుందని కచ్చితమైన ప్రకటన మాత్రం చెయ్యలేదు. జియోకి 38 కోట్ల మంది వినియోగదారులు ఉన్న సంగతి తెలిసిందే.

అంబానీ వ్యాఖ్యలు చూస్తుంటే.. గేమింగ్ బిజినెస్ పై ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టు ఉందనే వార్తలు వస్తున్నాయి. దేశంలో ఆన్ లైన్ గేమింగ్ రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఆన్ లైన్ గేమింగ్ కు ఆదరణ పెరుగుతోంది. ఫ్యాంటసీ స్పోర్ట్స్ లీగ్స్, క్విజ్జింగ్, పోకర్ లాంటి కార్డు గేమ్స్ కు మంచి గ్రోత్ ఉంది. ఇవన్నీ కూడా స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. రానున్న రెండేళ్లలో డేటా చార్జీలు మరింత చౌక కానున్నాయి. దీంతో 85 కోట్ల మంది యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ వాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.

ఆన్ లైన్ గేమింగ్ రంగం ద్వారా ఆదాయం కూడా బాగానే వస్తోంది. ఈ రంగం ద్వారా వచ్చే రెవెన్యూ.. రానున్న రోజుల్లో 72వేల కోట్లకు పెరగనుందని మార్కెట్ వర్గాల అంచనా. ఏవైపు నుంచి చూసినా ఆన్ లైన్ గేమింగ్ లాభదాయకంగా ఉంది. దీంతో ఈ బిజినెస్ పైనా ముకేష్ అంబానీ చూపు పడినట్టుంది. ఈ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ముకేష్ అంబానీలో మొదలైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ముకేష్ అంబానీ బిజినెస్ లన్నీ ఫ్రాఫిట్ లో ఉన్నాయి. ఆయన పట్టిందల్లా బంగారం అవుతోంది. ఏ రంగానికి ఫ్యూచర్ ఉందో తెలుసుకుంటూ ఉంటారు ముకేష్ అంబానీ. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్ంగ్ పై ఆయన కన్ను పడింది. మరి ఆన్ లైన్ గేమింగ్ బిజెనెస్ లోకి అంబానీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ముంబైలో ప్యూచర్ డీకోడెడ్ సీఈవో సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో ముకేష్ అంబానీ, సత్య నాదెళ్ల పాల్గొన్నారు. భారత దేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరిస్తుందని, మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుందని అంబానీ చెప్పారు. ముఖ్యమైన టెక్నాలజీల్లో కంపెనీలు బలపడాలని సత్యనాదెళ్ల అన్నారు. ఈ సమ్మిట్ తర్వాత మైక్రోసాఫ్ట్, రిలయన్స్ భాగస్వామ్యంపై మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Categories
Health International

ఆసియా బయట ఇదే ఫస్ట్: ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి

ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ సోకి చైనా పర్యాటకుడు ఒకరు మృతిచెందారు. ఇది ఆసియా బయట కరోనా వైరస్ సోకి మృతిచెందిన తొలి వ్యక్తిగా ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనాలో ఇప్పటివరకూ వైరస్ బారినపడి 1,500 మందికి పైగా మృతిచెందగా, కొత్తగా 2,641 మందికి వైరస్ సోకినట్టు నేషనల్ హెల్త్ కమిషన్ గుర్తించింది.

దీంతో మొత్తంగా చైనాలో దాదాపు 66, 500 వరకు కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన వుహాన్ నగరంలోని ప్రజలను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. అక్కడ వారిందరిని ఇంట్లోనే బందీలుగా నిర్బంధించారు అధికారులు. వైద్య పరీక్షల కోసం మాత్రమే వుహాన్ సిటీలోని నివాసితులను ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు అనుమతినిస్తున్నారు. 

ఇతర నగరాల్లో మాత్రం పూర్తిగా తాళం వేసేశారు. ప్రతి కొన్నిరోజులకు ఆహారం కొనేందుకు మాత్రమే అక్కడి నగరవాసులను బయటకు వచ్చేందుకు అనుమతినిస్తున్నారు. వుహాన్ సిటీ పక్క ప్రాంతాల్లో లోపలికి బయటకు వచ్చేందుకు బారికేడ్లను ఉంచారు అధికారులు. పొరుగు ప్రాంతాల వారిని లోపలికి వచ్చేందుకు అనుమతించడం లేదు. చైనా బయట వైపు వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. జపాన్, మలేసియాలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 

థాయిలాండ్ మాదిరిగా ఈ రెండు దేశాల్లోనూ మొదటి స్థానిక హెల్త్ వర్కర్ కు వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఇక, ఫారీస్ లో 80ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకి మృతిచెందినట్టు ఫ్రెంచ్ ఆరోగ్య శాఖ మంత్రి అగ్నేశ్ బ్యుజిన్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నుంచి పారిస్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఆమె తెలిపారు. ఫ్రాన్స్ లో మరో ఆరుగురికి వైరస్ సోకినట్టు చెప్పారు.