Categories
International National

ఒకవైపు కరోనా.. మరోవైపు మిడతల దండు ముప్పు ముంచుకొస్తోంది..!

కరోనా వైరస్‌తో పోరాడుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. లక్షలాది ఎకరాల్లో పంట పొలాలపై మిడతల దండు దాడి చేయబోతున్నాయా?
రాబోయే నెలల్లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుందా? అంటే అవుననే అంటున్నారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (FAO) నిపుణులు. కరోనాతో అల్లాడిపోతున్న తూర్పు ఆఫ్రికా దేశాల్లోని వారికి ఆహార కొరత ఆందోళన కలిగిస్తోంది. కొద్ది నెలల క్రితం మిడతల దండు విజృంభించిన సంగతి తెలిసిందే. ఇథియోపియా, సోమాలియా, పాకిస్తాన్‌తోపాటు భారతదేశంలోనూ లక్షలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో 3,70,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. తెలంగాణలోని సిద్ధిపేట, మెదక్‌ జిల్లాల్లోనూ వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 

రెండో దశలో ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశాల్లో 20 రెట్లు ఎక్కువ సంఖ్యలో మిడతల దండు దాడి చేసింది. వచ్చే జూన్‌ నాటికి మిడతల సంఖ్య 400 రెట్లు పెరిగిపోతుందని FAO నిపుణుల అంచనా వేస్తున్నారు. అంతేకాదు..  దాదాపు 60 దేశాల్లో పంట నష్టం జరగొచ్చు. కరోనా లాక్‌డౌన్‌ మధ్య ఆఫ్రికా దేశాలు మిడతల దండును అరికట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రెండు నెలల్లో ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పంటలకు ముప్పు వాటిల్లనుంది. ఆఫ్రికా దేశాల నుంచి బయలుదేరే మిడతల దండు జూన్‌ నాటికి భారత్‌లో పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పంటలపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని FAO హెచ్చరించింది. 

జీవిత కాలం 3 నెలలు మాత్రమే :
ఎడారి మిడత జీవిత కాలం సాధారణ వాతావరణంలో 3 నెలల వరకు ఉంటుంది. చల్లని వాతావరణంలో 6 నెలలు కూడా జీవిస్తాయి. ఎడారి ప్రాంతాల్లో నెలకు 2.5mm వర్షపాతం రెండు నెలల్లో కురిస్తే చాలు మిడతల దండు సంతతి పెరిగిపోతుంది. తగిన తేమ ఉన్న ఇసుక నేలల్లో 2–4 అంగుళాల లోతున మిడత గుడ్లు పెడుతుంది. ఒక మిడత 80 నుంచి 160 గుడ్లను పెడుతుంది.

చదరపు మీటరు స్థలంలో వందలాది మిడతలు గుడ్లు పెడతాయి. గుడ్లలో నుంచి రెండు వారాల్లో పిల్లలు బయటకు వస్తాయి. 4–6 వారాల్లో రెక్కలు సంతరించుకుంటాయి. ఇవన్నీ మిడతల దండులో చేరతాయి. అప్పటి నుంచి 3–4 వారాలు యాక్టివ్‌గా ఉండి మళ్లీ మిడత గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మిడత చనిపోతుంది. 8 దేశాల్లో 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటున్నాయి. 

నివారించలేమా? :
వాతావరణ మార్పులే మిడతల దండు దాడికి కారణమని నిపుణులు అంటున్నారు. పురుగులు మందు చల్లి సంతతిని అరికట్టే ప్రయత్నం చేయటం తప్ప మరోకటి లేదన్నారు. ఆఫ్రికాలో రెండు రకాల (Schistocerca gregaria, Locusta migratoria) మిడతలు సమస్యాత్మకంగా తయారయ్యాయి. శక్తివంతమైన పురుగుమందులను మనుషులతోను, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లతోను పిచికారీ చేయిస్తున్నారు. పురుగులను అరికట్టే మెటార్హిజియం శిలీంధ్రం (Metarhizium sp.) చల్లుతున్నారు. మిడతలను అరికట్టాలంటే 7 నుంచి 14 రోజులు పడుతుంది. 

Categories
National Technology

బోణి అదుర్స్ : GSAT 30 ప్రయోగం సక్సెస్

ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో ISRO బోణీ కొట్టింది. ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక Gsat -30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ స్పేస్‌ పోర్టు నుంచి ఎరియన్‌-5 రాకెట్‌ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ రాకెట్‌ జీశాట్‌-30తో నింగిలోకి దూసుకుపోయింది. స్పేస్‌ పోర్టులోని 3వ ఎరియన్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు వెల్లడించింది.

Gsat విశేషాలు 
జీశాట్‌-30 ఉపగ్రహం బరువు 3,357 కిలోలు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. దీనిద్వారా టెలివిజన్‌, టెలీకమ్యూనికేషన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్లలో కమ్యూనికేషన్ సేవల్ని అందిస్తుంది. ఇన్శాట్-4ఏకు ప్రత్యామ్నాయంగా జీశాట్-30 పనిచేయనుంది. భారత్‌తో పాటు అనుబంధ దేశాలకు ఈ శాటిలైట్ ద్వారా కేయూ బ్యాండ్లో సిగ్నల్ అందించనుండగా గల్ఫ్ దేశాలకు సీ బ్యాండ్ ద్వారా కవరేజ్ ఇవ్వనున్నారు. ఆసియాలో కొన్ని దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు కూడా సీ బ్యాండ్ ద్వారా సేవలందిస్తారు.

Read More : KTR దిశా నిర్దేశం : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

Categories
National

జీవించడానికి అనువైన దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా

ప్రపంచంలో నివసించేందుకు 2020లో అత్యంత అనువైన దేశాల్లో భారత్‌ టాప్‌ 25లో స్ధానం దక్కించుకుంది. గతేడాది కంటే రెండుస్థానాలను భారత్ ఎగబాకింది. 2019లో భారత్ ఈ జాబితాలో 27వ ర్యాంక్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే. వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ ది యూఎస్‌ సహకారంతో యూఎస్‌ న్యూస్‌ అండ్‌ ది వరల్డ్‌ రిపోర్ట్‌ నిర్వహించిన సర్వేలో  జీవించడానికి ఉత్తమ దేశాల్లో భారత్‌ కంటే  చైనా, సింగపూర్‌, దక్షిణ కొరియా, యూఏఈ వంటి నాలుగు ఆసియా దేశాలే ముందున్నాయి.

జీవించేందుకు అనువైన దేశాల్లో భారత్‌ స్ధానం మెరుగుపడినా దేశంలో పిల్లల ఎదుగుదల లేదా మహిళల స్థితిగతుల విషయంలో భారతదేశం గురించి ప్రజలకు మంచి అవగాహన లేదని సర్వేలో తేలింది. ఈ విభాగంలో సింగపూర్‌ 22వ స్ధానంలో ఉండగా అంతర్గత సమస్యలు ఎదుర్కొనే కెన్యా, ఈజిప్ట్‌ వంటి దేశాలు సైతం భారత్‌ కంటే మెరుగైన ర్యాంకులు సాధించాయి.

చిన్నారుల ఎదుగుదలకు అనువైన దేశాల్లో భారత్‌ 59వ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019తో పోలిస్తే ఈ విభాగంలో ఆరు ర్యాంకులు మెరుగుపడటమే భారత్‌కు ఊరట ఇచ్చే అంశం. గతేడాది ఈ విభాగంలో భారత్ కు 65వ స్థానం దక్కిన విషయం తెలిసిందే. భారతదేశం పిల్లలకు “మంచిది కాదు” అనే ఆందోళనకు బుధవారం(జనవరి-15,2020) భారత రైల్వే శాఖ విడుదల చేసిన నివేదిక ప్రామాణికంగా నిలిచింది. 2019 లో దేశవ్యాప్తంగా 16,457 మంది పిల్లలను రైళ్లు, రైల్వే స్టేషన్ల నుండి రక్షించినట్లు రైల్వే తెలిపింది. అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ప్రతిరోజూ దాదాపు 46 మంది పిల్లలను రక్షించింది.

మరోవైపు 2020లో మహిళల జీవనానికి అనువైన దేశాల జాబితాలో భారత్‌ 58వ ర్యాంక్‌తో సంతృప్తిపడాల్సి వచ్చింది. 2019తో పోలిస్తే ఈ విభాగంలో భారత్ ఒక స్ధానం దిగజారింది. పశ్చిమాసియా దేశాలు, యూఏఈ, ఖతార్‌, సౌదీ అరేబియాలు భారత్‌ కంటే ఎగువ ర్యాంకులు సాధించాయి. ఈ సర్వేలో మన పొరుగు దేశాలు చైనా, శ్రీలంకలు సైతం మహిళలకు అనువైన జీవనం కల్పించడంలో భారత్ కంటే ముందున్నాయి.

ఇక ఆశ్చర్యకరంగా…1 లక్ష జనాభాకు 36.4 హత్యల రేటుతో దక్షిణాఫ్రికా భారతదేశపు 2.2 కన్నా చాలా ఎక్కువగా ఉంది.  మరియు మొత్తం మీద అత్యాచారాల నేరాల రేటు 72.1 వద్ద ఉంది భారతదేశం యొక్కఅత్యాచారాల నేరాల రేటు 5.2 గా మాత్రమే ఉంది. అయితే దక్షిణాఫ్రికా మత్రం మహిళలకు ఉత్తమమైన దేశాల్లో భారత్ కన్నా 15 ర్యాంకుల ముందు ఉంది.