Categories
National

ఆసియాలో అతిపెద్ద మురికివాడ.. కరోనాపై యుద్ధంలో గెలుపు దిశగా.. ఆదర్శంగా ముంబైలోని ధారావి!

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావి ప్రాంతం..  దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో కరోనా ప్రళయ తాండవం చేస్తుండగా.. అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఇప్పుడు ఆ స్లమ్ ఏరియా రోల్ మోడల్‌గా మారింది. మొన్నటివరకు యావరేజ్‌గా రోజుకు 60 కరోనా కేసులతో హడలెత్తిన ఆ ప్రాంతంలో ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 

ముంబై నగరంలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతాలకు, ముంబయి స్టాక్‌ ఎక్స్చేంజీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారావిలో ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయకపోతే ముంబయి మహానగరం ఆపదలో పడుతుందని భావించిన అధికారులు.. ఈ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బందించారు. 10లక్షలకు పైగా జనాభా ఉన్న ధారావిలో అధిక భాగం వలసకూలీలు. 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న ఇంట్లో 10 నుంచి 12 మంది నివసిస్తూ ఉంటారు.

ఈ ప్రాంతంలో 80 మంది వ్యక్తులకు ఒకే టాయిలెట్‌ ఉంటుందంటే ఇక్కడ జీవన ప్రమాణాలు గురించి అర్థం చేసుకోవచ్చు. అయితే అధికారులు పనితీరు, అక్కడి ప్రజల సహకారం.. చివరకు ధారావి కరోనా నుంచి కోలుకుంటుంది. కరోనాపై గెలుస్తుంది. దేశంలోని కరోనా కేసుల్లో అగ్రబాగాన ఉన్న మహారాష్ట్రలో, కరోనా మరణాల్లో ముందున్న ముంబై నగరంలో ఈ స్లమ్ ఏరియాలో విజయం అంటే మాములు విషయం కాదు.  

మొదట్లో ఈ ప్రాంతాన్ని సీజ్‌ చేయటానికి వెళ్లిన అధికారులపై రాళ్లు విసిరారు అధికారులు. అయితే దేశంలోని మిగిలిన ప్రజల్లాగే ధారావి ప్రజలకు కూడా కరోనా అంటే భయం ఉన్నా కూడా పటిష్టమైన లాక్‌డౌన్ విధిస్తే ఆకలిచావులు ఎక్కువ అవుతాయి అనేది అక్కడి ప్రజల అభిప్రాయం. అయితే తమ ప్రాంతంలో కరోనా విస్తరించడంతో వణికిపోగా.. ఆ పరిస్థితుల్లో వారి మనసుల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని నింపి ప్రభుత్వాధికారులు చివరకు కరోనాపై గెలిచారు. 

ధారావిలో మే నెలలో యావరేజ్ గా రోజుకు 60 కేసులు నమోదవగా.. ఇప్పుడు యావరేజ్‌గా రోజుకు 20 కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి. ముంబై వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో కోలుకున్న వారి సంఖ్య 41శాతం ఉంటే.. ధారావిలో మాత్రం 51శాతంగా ఉంది. ధారావిలో ఆరోగ్యం బాగోలేని ప్రతి ఇంటి తలుపు తట్టి మొత్తం 47,500ఇళ్లలో దాదాపు 700,000మందికి పరీక్షలు నిర్వహించారు. 

స్థానికులకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేయడం.. పేషెంట్లందరికీ ఉచిత వైద్య సేవలు, ఉచిత ఆహారం అందించింది. బెడ్లు సరిపోకపోతే అప్పటికప్పుడు ఆఫీసర్లు కొన్ని ఇండ్లను కూడా ఐసోలేషన్ వార్డులుగా మార్చడం వంటివి చేయడంతో చివరగా ధారావి కరోనాపై గెలుపు తలుపు తట్టింది. ధారావిలోని దుస్తుల తయారీ కేంద్రాల్లో లక్షమంది పేద కార్మికులు వరకు పనిచేస్తుంటారు. అక్కడి నుంచి దేశమంతా దుస్తులు ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటాయి.