Categories
International National

అంత సీన్ ఉందా : అణుదాడికి సిద్ధమైన పాకిస్తాన్?

పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది.

పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసి 245మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడింది.

భారత వాయుసేన చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాక్ వైఖరిలో మార్పు రాలేదు. భారత్ దాడులపై ఆగ్రహంతో రగిలిపోతున్న పాక్… కుట్రలకు పన్నాగం పన్నుతోంది. సర్జికల్ ఎటాక్‌ను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ నేషనల్ కమాండ్ అథారిటీ(NCA) అత్యవసరంగా భేటీ కానుంది. పాక్ అణ్వాయుధ కార్యక్రమాలన్నీ NCA పర్యవేక్షిస్తుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. భారత్‌పై పాకిస్తాన్ అణుదాడి చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం పాక్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ వ్యాఖ్యలే.

”ఇక మీ వంతు కాసుకోండి.. సర్ ప్రైజ్ అందుకోవడానికి సిద్ధం కండి. మా ప్రతిస్పందన చాలా భిన్నంగా ఉంటుంది” అని పాక్ మేజర్ జనరల్, పాక్ మిలటరీ మీడియా హెడ్ ఆసిఫ్ గపూర్ భారత్ ను ఉద్దేశించి హెచ్చరించారు. గఫూర్ వ్యాఖ్యలతో అణుదాడి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం(ఫిబ్రవరి 26, 2019) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో NCAతో మీటింగ్ జరుగనుందని,  ఈ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గఫూర్ తెలిపారు.

అయితే పాకిస్తాన్ కు అణుదాడి చేసే అంత సీన్ లేదని భారత రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. పాక్ ది మేకపోతు గాంభీర్యం అని కొట్టిపారేస్తున్నారు. భారత్ పై దాడి చేయాలనే ఆలోచన కూడా పాకిస్తాన్ చెయ్యలేదని స్పష్టం చేస్తున్నారు.